Athagariki-eduru-chepakkudani-5-sandharbha

Image Courtesy : Zee Telugu 

కొత్తగా పెళ్ళి చేసుకొన్న మహిళ ఎక్కువగా గాభరా పడే విషయం ఏదైనా ఉందంటే అది అత్త గారి గురించే! పెళ్లి తర్వాత జీ వితంలో  చాలా మార్పులు వస్తాయి. ఎన్నో వదిదుడుకులు ఎదుర్కుంటారు. కొత్తగా పెరిగిన భాద్యతలు,  తల్లిదండ్రులకు దూరంగా ఉండటం, ముఖ్యంగా అత్తగారు అర్థం చేసుకోకపోవడంతో మీ జీవితాన్ని గందరగోళంగా మారుతుంది.అంతసేపు ఆనందంగా ఉన్న అత్తగారు మీరు చేసిన చిన్న తప్పుకు పెద్దగా అరవడం,  ప్రతి చిన్న విషయాన్నీ బూతద్దంలో చూడటం వంటివి చేస్తుంటారు. అప్పుడు చాలా బాధగా ఉంటుంది. ప్రతి సారి మీరే సర్దుకుపోతారు,  అయిన ఎప్పుడు మీ అత్తగారు ఎదో ఒకటి అంటూనే ఉంటారు. మీరు ఎప్పటికీ తప్పించలేని ఇబ్బందికర పరిస్థితులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే…

వంట చేసే దగ్గర 

మీరు వంట చేయడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కానీ మీ అత్త గారికి గత కొన్ని దశబ్ధాలుగా పాకశాస్త్రంలో నైపుణ్యం ఉంది. ఏదైనా ఒక వంటకాన్ని కొంచెం టేస్ట్ చేసి ఎలా ఉందో చేప్పే నేర్పు ఉంటుంది ఆమెకు. అయితే మీరు ఆమెకు పూర్తి భిన్నంగా ఇప్పుడే వంట నేర్చుకోవడం ప్రారంభించారు కాబట్టి మొదట్లో మీరు చాలా తప్పులు చేస్తుంటారు. ఉప్పు ఎక్కు వేయడం, అస్సలు వెయకపోవడం, సరైనా మసాలా వేయకపోవడం వంటివి. మీ వంటలన్నిటినీ కూడా మీ అత్తగారు విమర్శిస్తూ ఉంటారు. మీరు ఎప్పటికీ వంట విషయంలో ఆమెను సంతృప్తి పరచలేరు కాబట్టి వంట విషయములో ఆమెకు ఎదురు చెప్పకపోవడం మంచిది

ఇంటిని శుభ్రంగా ఉంచే విషయములో

మీకు పెళ్ళైన తర్వాత మీకు వచ్చే అదనపు బాధ్యతలలో ఇంటిని శుభ్రంగా ఉంచడం ఒకటి. మీరు ఎంత బాగా శుభ్రం చేసిన మీ అత్తగారు మీరు శుభ్రంగా ఉంచని ప్రదేశాన్ని కనుక్కొని మిమ్మల్ని ఎగతాలి చెస్తుండచ్చు. ఎందుకంటే ఆమె దృష్టిలో ఆమె కన్నా ఇంటిని శుభ్రంగా ఎవరు ఉంచలేరు అని ఆమె నమ్మకం కాబట్టి. అందువలన శుభ్రత విషయంలో కూడా అత్తగారి మాటలను మనస్సు వరకు రానివ్వకండి.

మీ అత్తగారి ఆధ్యాత్మికత

స్వతహాగా వయసు పెరిగే కొద్దీ వారిలో ఆధ్యాత్మికతా పెరుగుతూ ఉంటుంది. అలాగే మీ అత్తగారు కూడా ఆధ్యాత్మికతకు ఎక్కువ సమయం కేటయిస్తూ ఉండచ్చు. అయితే మీ పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. మీరు ఇప్పుడిప్పుడే దేవుని సన్నిధిలో గడపడము ప్రారంభిస్తూ ఉంటారు.  మీరు చూపించే భక్తి ఆమెకు నచ్చకపోవచ్చు. ఆమె మిమ్మల్ని విమర్శించ వచ్చును. కాబట్టి ఈ విషయములో మీ అత్తగారి కామెంట్స్‌ను పట్టించుకోకపోవడం మంచిది.

ఆమే ఆదర్శ అమ్మ అని అనుకోవడం

తన కొడుకుని పెంచి ఇంత ప్రయోజకుడిని చేసింది కాబట్టి తన కంటే పిల్లలని ఎవరు బాగా పెంచలేరు అని ఆమె విశ్వాసం. అందుకే, మీ పిల్లల్ని సరైన పద్దతిలో పెంచనప్పుడు ప్రపంచంలో నేనే గొప్ప తల్లి అని ఫీల్ అవుతూ మిమ్మల్ని విమర్శిస్తుంది. మీరు మీ పిల్లల్ని తిట్టినా, కొట్టినా, ఇంకేదైనా చేసినా మీరు పిల్లల్ని సరిగ్గా పెంచట్లేదని బాహాటంగా చెప్పేస్తుంది. కాబట్టి పిల్లల విషయంలో మీ వ్యక్తిత్వాన్ని తప్పు పట్టినా పట్టించుకోకండి.

తను గొప్ప న్యాయనిర్ణేతగా ఫీలవడం

అత్తగారి దృష్టిలో తన కోడలు కన్నా కూతురే చాలా బెస్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడూ కూడా మీ  ఆడపడుచునే… మంచి తల్లి అంటూ, బాగా వంట చేస్తుందని పొగుడుతూ ఉంటుంది. మీరు సంతోషంలో ఉన్నప్పుడు కానీ, ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ ఇలాంటి కామెంట్స్ మరింత ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోకండి. వారు ఏదైనా సలహా ఇస్తే తీసుకొని వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి.

పైన చెప్పిన విషయాలు దాదాపు ప్రతి అత్త కోడళ్ళ మధ్య జరిగేవే.  అందువలన, ఇలాంటివి మనస్సులో పెట్టుకోకుండా ఆమెతో మంచి బంధాన్ని కొనసాగించండి. స్వతహాగా ప్రతి అత్తకి ఒక అభద్రతా భావం ఉంటుంది. ఇంట్లో తన విలువ, కొడుకుకి తన మీద ఉన్న ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందో అని.  దీంతో మీ మీద కొన్ని సార్లు అసూయ కలిగే అవకాశం ఉండవచ్చు. కాబట్టి మీరు ఈ విషయములో ఆమెను అర్థం చేసుకోండి మరియు క్షమించండి. కొన్ని విషయాలను మీరు చూసీ చూడనట్లు   ఉంటే మీ అత్తగారికి కొన్ని రోజులలోనే మీరు కూతురిగా మారిపోవచ్చు.

Leave a Reply

%d bloggers like this: