mee-vivahika-jeevithanni-mee-pillalu-viluvinadiga-marustaranadaniki-7-rujuvulu

పెళ్ళైన తర్వాత మీ భర్తతో మీరు సంతోషంగా జీవిస్తుంటారు.  అయితే కొన్ని రోజులకు మీ ఇంటికి ఒక బాబు కానీ,  పాప కానీ వస్తారు.  అప్పుడు మీరు మరింత సంతోషపడతారు. పిల్లల పుట్టుకతో  మీ వైవాహిక సంబంధం మరింత పటిష్టంగా తయారవుతుంది. అది ఎలాగంటే..

మీరు దంపతుల నుండి కుటుంబంగా పరిణామం చెందుతారు

మీకు పెళ్ళైనప్పుడు మీ భర్తతో జీవితాన్ని సాగిస్తున్నప్పుడు మీరు ఇద్దరే. మిమ్మల్ని జంట లేదా దంపతులు అని అంటారు. అయితే మీకు పాప పుట్టిన తర్వాత మీరు కుటుంబముగా రూపాంతరం చెందుతారు. అప్పుడు మీరు ఒక తల్లిగా, మీ భర్త తండ్రిగా ఉంటూ ఒక కొత్త అనుభూతిని పొందడమే కాక మీ ఇద్దరి మధ్య సంబంధం  కూడా బలోపేతం అవుతుంది.

తండ్రీ-పిల్లల అనుబంధం చూసి ప్రేమ పెరగడం

పాప పుట్టిన తర్వాత మీ భర్త మీద మీకు ప్రేమ పెరిగే అవకాశాలు అపారం. మీ భర్త పాపతో ఆడుకుంటున్నప్పుడు, పాప నిద్ర పోవడానికి జోల పాడినప్పుడు, పాపను స్నానానికి తీసుకెళ్ళినప్పుడు, పాప ఇతర అవసరాలను తీర్చినప్పుడు మీకు అతని మీద మరింత ప్రేమ కలుగుతుంది.

చిన్నపిల్లల వల్ల ఎక్కువ ఆనందంగా ఉండగలరు

ఏ ఇంటిలోనైనా చిన్న పిల్లలు ఉంటే ఆ ఇల్లు చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఎలాగంటే, చిన్న పిల్లలు చేసే చేష్టలు చూసినప్పుడు, వారి నవ్వును, ఏడుపును చూసినప్పుడు, వారు మీ పేర్లను పలకడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీకు తెలియకుండానే నవ్వు వచ్చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, చిన్న పిల్లలు మీ జీవితంలోకి వస్తే మీ జీవితం మరింత ఆహ్లాదంగానూ, ఆనందంగానూ మారుతుంది.

ఓంటరి అన్న భావన దూరమౌతుంది

పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా మీ భాగస్వామి ఇంటికి ఆలస్యంగా వచ్చినప్పుడు మీకు ఒంటరి అన్న భావన కలగవచ్చు. అయితే మీకు బాబు లేదా పాప పుట్టిన తర్వాత మీరు ఒంటరిగా ఉండే ఆస్కారమే లేదు కాబట్టి మేము ఒంటరి అన్న భావన భాగస్వాములిద్దరిలోనూ కలగదు. దీంతో మీరు మరింత ఆనందంగా ఉండవచ్చు.

పిల్లలు ఉంటే ఒత్తిడి తగ్గుతుంది

చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో, మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు మొదట్లో కొన్ని అదనపు బాధ్యతలు రావడం సహజమే కానీ ఒక్కసారి వారిని చూడగానే, bవారు మీ దగ్గరకు పరుగెత్తుకొని రాగానే, రోజులో మీరు పడిన శ్రమ, ఒత్తిడి మొత్తం మరిచిపోతారు. దీనితో మీరు మానసికంగా మరింత బలపడతారు.

ఏకాంత సమయం కోసం భాగస్వామ్యులిద్దరూ ప్రయత్నిస్తారు

బిడ్డ పుట్టిన తర్వాత, వారి ఆలనా పాలనా చూడటానికి తల్లికి సమయమే సరిపోదు. రోజులో ఎక్కువ భాగం పాపతోనే గడపాల్సి వస్తుంది దీంతో బాగస్వాములిద్దరి మధ్యా కొంచెం ఎడం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇలాంటి ఎడబాటు వల్ల, మీ భర్త మిమ్మల్ని ఇంప్రెస్ చెయడానికి ప్రయత్నిస్తూ, అప్పుడప్పుడు బహుమతులు కూడా ఇస్తూ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాడు.  దీంతో మీ మధ్య మరింత అన్యోన్యత ఏర్పడుతుంది. దీని వల్ల మీరు ఒకరినొకరు మరింత అర్థం చేసుకుంటారు.

భవిష్యత్తు కోసం ప్రణాలికలు వేసుకోవడం

పిల్లలు పుట్టిన రెండు సంవత్సరాల తర్వాత, మీ భాగస్వామితో కలిసి పిల్లలను ఏ స్కూల్‌కు పంపాలి, ఏ డే కేర్ సెంటర్‌లో ఉంచాలి, వారి భవిష్యత్తు కోసం ఎలా డబ్బు కూడబెట్టాలి వంటి వాటి గురించి ఆలోచిస్తున్నప్పుడు మీ మధ్య ఏదో తెలియని అన్యోన్యత ఏర్పడుతుంది. పిల్లల కోసం మీరు చేసే చిన్న చిన్న త్యాగాల వల్ల మీ బంధం మరింత బలపడుతుంది.

పిల్లల వల్ల తల్లి-తండ్రి అనే అనుభూతిని పొందడమే కాక, తల్లిదండ్రులిద్దరి మధ్య కూడా ప్రేమాభిమానాలు పెరుగుతాయి. కాబట్టి కొత్తగా తల్లైయ్యే వాళ్ళు ఒక కొత్త జీవితానికి ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉండండి.

image source : indiatvnews

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Leave a Reply

%d bloggers like this: