prati-bhartha-thana-bharyaki-cheppa

ప్రతి భర్త తన భార్యకు అబద్ధాలు చెప్తాడు. అది పురుషలక్షణం. చాలా సహజం కూడా. కానీ అవి మిమ్మల్ని మోసం చేయడానికి అనుకుంటే అది మీ పొరపాటే.  భాద్యత తీసుకునేవాడే భర్త. మిమల్ని ఎల్లపుడు సంతోషంగా ఉంచాల్సిన భాద్యత తన మీద ఉంది కాబట్టి మీ సంతోషం కోసం చిన్న చిన్న అబద్ధాలు చెప్పడానికి కూడా వెనకాడడు. ప్రేమ నిజం అయినప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడిన తప్పు లేదు అంటారు. అలాంటప్పుడు,  మీ సంతోషం కోసం అబద్ధాలు  ఆడుతున్నాడంటే ప్రేమ  ఉన్నటే కదా! కాని అబద్ధాలు మీ సంతోషం కోసం చెప్తున్నాడా లేక తన స్వార్థం కోసం చెప్తున్నాడా గమనించుకోండి.

ఇప్పుడు ప్రతి భర్త తన భార్యకి చెప్పే 10 అబద్ధాలు ఏవో తెలుసుకుందాం.
 1.మీ బట్టల విషయంలో

 మీరు ఎంతో ఇష్టపడి కొనుకున్న బట్టలు బాగాలేవు అని ఎప్పుడు చెప్పడు. నిజం చెపాల్సిన భాద్యత తన మీద ఉంది కానీ మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టంలేక అబద్దము చెప్తాడు. మీకు బాగా నచ్చిన చీర మీ ఆహార్యానికి మీ రంగుకి సరిపడకపోవచ్చు. కాని మీరు ఆ చీర ఎలా ఉంది అని అడిగితే బాగుందనే చెప్తాడు.

 2.ఇప్పుడే వచ్చేస్తున్నా, 10 నిముషాలు అంటారు

 ఈ మాట చాలా సాధారణంగా వింటూ ఉంటాము. 10 నిమిషాలు అంటారు, గంట అయిన రారు. పని ఒత్తిడి వాల్లో. స్నేహితుల ఒత్తిడివల్లో ఈ అబద్ధం ఆడుతుంటారు.  మీకు నిజం చెప్పలేక, పనులను, స్నేహితులను కాదనలేక సతమతమౌతుంటారు. ఇలాంటి సమయంలో ఒక చిన్న అబద్ధం చెప్పడంలో తప్పులేదు అని అనుకుంటారు

 ౩. అహంతో కూడిన అబద్ధాలు

 ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి మగాడికి అహం ఉంటుంది. అన్ని తనకి తెలుసు అనుకుంటాడు, అదే మీకు చెప్తాడు. ఎంత కష్టమైన ఎదుర్కోగలను అనుకుంటాడు, ఎదురుకుంటాడు కూడా, కాని కొన్ని కొన్ని సార్లు బోల్తా కుడా పడుతుంటాడు.

 4.నా సమస్య – నేనే చూసుకుంటాను

 తను బాధలో ఉన్నప్పుడు కాని, కష్టాల్లో ఉన్నపుడు కానీ మీరు సహాయం చేయడానికి ప్రయత్నించి, సలహాలు ఇస్తుంటారు, ఇలా ఎందుకు చేసావ్ అని అడుగుతుంటారు. అప్పుడు తనకి కోపం వచ్చి నా సమస్య నేను చూసుకోగలను అని అంటాడు. కానీ మనస్సులో మాత్రం మీరు సహాయం చేస్తూ తోడుగా ఉండాలని అనుకుంటారు, కోరుకుంటారు.

 5.ఫోన్ చేశా కానీ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది

 ఇది కూడా చాలా సాధారణంగా వినే అబద్ధం. మీరిద్దరూ సినిమాకి వెళ్దాం అని అనుకునింటారు, కాని తను టైం కి రాడు. ఇంటికి వచ్చాక ఏదో ఒక సాకుతో మిమ్మల్ని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు. మీరు కనీసం ఫోన్ అయిన చేసుండాల్సింది అని అడిగితే, అప్పుడు, నేను ఫోన్ చేశా కానీ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అని అబద్ధం చెప్పి, ఫోన్ ని సరిగా పెట్టుకో లేవ అని మిమ్మల్నే నిందిస్తాడు.

 6.నీకు ఇష్టంలేకపోతే వద్దులే

 ఇలా అన్నాడు అంటే తనకి అది చాలా ఇష్టం అని, అది కావలి అని. మీరు మనస్సు మార్చుకుంటే బాగుండు అని అనుకుంటాడు. అర్ధరాత్రి అయిన మనస్సు మారకపోతుందా అని ఎదురు చూస్తాడు. కానీ, మిమ్మల్ని పదే పదే అడిగి ఇబ్బంది పెట్టడు. తనకే ఇష్టం లేదు అని అబద్ధం చెప్తాడు.

 7.నిన్ను తప్ప ఎవ్వరిని కలలో కూడా చూడను

 కలలో కూడా పరాయి స్త్రీని చూడను అంటాడు. మీ కళ్ళ ముందరే ఇంకో అందమైన స్త్రీ వెళ్తుంటే చూడకుండా ఉండలేడు. ఇది మగవారి సహజ లక్షణం. మీరే పెద్ద మనస్సు చేసుకొని సర్దుకుపోవాలి. పరాయి స్త్రీ ని చూస్తూ మీ కంటపడితే మాత్రమే అతన్ని సర్డుకుపోయేలా చేస్తారనుకోండి. దాన్ని ఎవరు ఆపలేరు.

 8.గతం గతః

 మంచి విషయం ఏమిటంటే తనకి గతం ఉందని ఒప్పుకుంటాడు. కాని ఆ గతం ఏంటో ఎప్పుడూ పూర్తిగా చెప్పడు. ప్రతి సారి పూర్తి నిజం చెప్పకుండా దాటేస్తాడు. ఇది మిమ్మల్ని అసహనానికి గురి చేయొచ్చు, కాని పూర్తిగా తన గతం తెలుసుకోకపోవడం మీకే మంచిది. ఒక రకంగా చెప్పాలంటే, ఈ అబద్ధం మంచిదే.

 9.చూశావా, నేను ఎంత తెలివైనవాడినో!

 ఈ మాట తనని తాను నమ్మిచ్చుకోవటానికి ఉపయోగిస్తుంటాడు. తన భార్య కూడా దీన్ని నమ్మాలనుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడూ తనతో ఉండే భార్యే తనని తెలివైనవాడు అనుకోకపోతే మిగతా వాళ్ళు ఎలా అనుకుంటారు. కాబట్టి ఈ అబద్ధాన్ని మీరు నిజం అని నమ్మితే మంచిది.

 10.ప్రామిస్, ఇంకెప్పుడు అబద్ధం చెప్పను

 ఈ మాట చెప్పినప్పుడు  తను నిజంగానే అబద్ధం చెప్పకూడదు అనుకుంటాడు.  కాని పరిస్తితుల ప్రభావం వల్ల కాని, మీ సంతోషం కోసం కానీ తన ప్రోమిస్ని నిలబెట్టుకోలేకపోవచ్చు. అందుచేత ఈ ప్రామిస్ అనేది ఇంకో కొత్త అబద్ధం మాత్రమే.

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Leave a Reply

%d bloggers like this: