kothaga-talli-ayina-vaaru-ti

తల్లవడం అనేదోక మధురానుభూతి. అయితే బిడ్డను మోసిన 9 నెలల్లో మీలో చాలా మార్పులు వచ్చి ఉంటాయి. మరీ ముఖ్యంగా మీరు లావవ్వడం, జుట్టు పలుచనవ్వడం, చర్మం ముడుతలు పడి ఉండటం వంటివి. వీటిని ఆలోచించుకుంటూ మీరు బాధపడాల్సిన అవసరం లేదు,  మీరు తిరిగి మునుపటి అందాన్ని ఆరోగ్యాన్ని పొందడానికి కొన్న చిట్కాలు ఉన్నాయి. అవేంటంటే…

వ్యాయామం చేయడం

ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చేయడం తప్పనిసరి. కొత్తగా తల్లైన మహిళలు వ్యాయామం చేయడం ద్వారా శరీరంలోని కొవ్వు కరిగి మునుపటి శరీరాకృతిని పొందవచ్చు. వ్యాయామం చేయాలని అదేపనిగా గంటల తరబడి జింలో గడపాల్సిన అవసరము లేదు. కేవలం రోజుకు 10 నిముషాలు వ్యాయామం చేస్తూ, క్రమంగా పెంచుతూ వెళ్ళాలి. శరీరంలో ఎక్కడైతే చర్మం వదులుగా అయి ఉంటుందో దానికి సంబంధించిన వర్కవుట్స్ చేస్తే మేలు. ప్రతిరోజూ కచ్చితంగా కొంత దూరం నడిచే విధంగా నియమం పెట్టుకుంటూ, రోజూ ఆ దూరాన్ని పెంచేలా ప్లాన్ చేసుకోండి. అలా చేయడం ద్వారా చాలా వరకు చెడు కొవ్వును కోల్పోతారు. వ్యాయామం చేయడానికి మీకు ఇబ్బందిగా ఉంటే ప్రతిరోజూ యోగా చేయడం మంచిది. సూర్య నమస్కారం చేయడం ద్వారా రోజంతా ఉల్లాసంగా ఉంటారు మరియు మానసిక ఆనందాన్ని కూడా పొందుతారు.

ఆరోగ్యకరమైన ఆహారం

బిడ్డ పుట్టిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలో మీకు అవగాహన ఉండాలి. ఎందుకంటే, అప్పుడే పుట్టిన బిడ్డకు జీర్ణ వ్యవస్థ బలంగా ఉండదు కాబట్టి, బిడ్డకు సరిపడే ఆహారాన్ని మీరు తీసుకోవడం చాలా ఉత్తమం. మీరు తీసుకొనే ఆహారంలో తాజా పళ్ళు, డ్రై ఫ్రూట్స్, తాజా కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండాలి. కొవ్వు పదార్థాలకు కొన్ని రోజులు దూరంగా ఉంటే మంచిది. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండటంతో పాటూ పాప కూడా ఆరోగ్యంగా ఉంటుంది

జుట్టు కోసం ప్రత్యేక జాగ్రత్తలు

మహిళలకు జుట్టు పెట్టని అలంకారం. అయితే ప్రసవం తర్వాత మహిళల్లో జుట్టు రాలే సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఐరన్ లోపించడం లేదా హార్మోన్ సమతుల్యత వల్ల మీ జుట్టు రాలిపోయే అవకాశం ఉంది. వీటి నివారణకు విటమిన్-బి, విటమిన్-సి ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. మీ జుట్టు ఎక్కువ పొడవుగా ఉంటే దాన్ని కత్తిరించడం ద్వారా  జుట్టు రాలడాన్ని ఆపవచ్చు. జుట్టుకు కాస్మోటిక్స్ వాడకపోవడం మంచిది. ఇవన్ని చేస్తే కొన్ని రోజులలోనే మీ జుట్టు ఒత్తుగా తయారవుతుంది.

చర్మం మీద శ్రద్ధ వహించాలి

మనుషులు యవ్వనంగా కనిపించడంలో చర్మం కీలకపాత్ర పోషిస్తుంది. ప్రసవం అయిన తర్వాత చర్మం మీద డెడ్ సెల్స్ చాలా సంఖ్యలో పెరిగిపోయి ఉంటాయి. వాటిని తీసివేయడానికి ప్రతిరోజూ స్నానం చేసినప్పుడు శరీరం మొత్తం బాగా రుద్దండి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ముఖాన్ని సీరంతో మర్ధనా చేయండి. వెన్న లేదా కొబ్బరినూనెతో మీ శరీరాన్ని ప్రతిరోజు మర్ధనా చెయండి. దీని ద్వారా చర్మం మీద ఉన్న డెడ్ సెల్స్ తొలగిపోయి కొత్త సెల్స్ వచ్చి శరీరం కాంతివంతంగా తయారవుతుంది. మీ కళ్ళ కింద నల్లటి మచ్చలు వచ్చే అవకాశం కూడా ఉంది. టీ బ్యాగ్స్ ఉపయోగించి వాటిని తగ్గించవచ్చును.

మిమ్మల్ని మీరు ఆకర్షణీయంగా ఉంచుకోండి

మిమ్మల్ని మీరు ఉత్సాహంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. రోజూ లేదా వారానికి ఒక్కసారైనా సెలూన్‌కు వెళ్ళడం, స్పాకు వెళ్లడం వంటివి చేయండ౦ ద్వారా మీ అందం పెరుగుతుంది. ఒకవేళ మీకు సమయం లేకపోతే ఇంటికే వారిని పిలిపించుకోండి లేదా మీరే స్వయంగా మర్ధనా చేసుకోండి. మీరు స్నానం చేసేటప్పుడు ఎక్కువ సమయం చేయడం ద్వారా కూడా మిమ్మల్ని మీరు ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.

నచ్చిన దుస్తులు వేసుకోండి

తల్లైన తర్వాత మీ దుస్తుల ఎంపిక కూడా మారాల్సి ఉంటుంది. మీకు నచ్చే, నప్పే బట్టలు వేసుకుంటే  మీకు మునుపటి ఉత్సాహం, ఆనందం కలుగుతాయి. మీకు నచ్చినట్లుగా కొత్త దుస్తులు డిజైన్ చేసుకోండి లేదా చేయించుకోండి. మంచి దుస్తుల వల్ల మీరు అందంగా కనపడుతారు మరియు మీ మీద మీకు విశ్వాసం కూడా పెరుగుతుంది.

నడకను అలవాటుగా మార్చుకోండి

మీరు చాలా రోజుల నుండీ ఇంటిలోనే ఉండి ఉంటారు. మీలో క్రితం ఉత్సాహం కలగడానికి నడక చక్కగా ఉపకరిస్తుంది. రోజులో వీలు చిక్కినప్పుడల్లా కొంచెం సేపు నడవడం, మీకు నచ్చిన సంగీతం వినడం, చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదించడం ద్వారా మీరు మునుపటి కన్నా ఎక్కువ ఉల్లాసంగా ఉండగలరు. వీటికి తోడు బాగా నిద్రపోవడం, దేని గురించీ ఎక్కువగా ఆలోచించకపోవడం వల్ల ఒత్తిడికి దూర౦ ఉండి మునుపటి అందాన్ని పొందవచ్చు.

Leave a Reply

%d bloggers like this: