మీకు-ఎవరూ-చెప్పని-ప్రసవసమయంలో-జరిగే-5-విషయాలు

కొత్తగా తల్లి అయ్యే వారికి ప్రసవ సమయంలో జరిగే కొన్ని విషయాల గురించి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా చెప్పకపోవచ్చు. అయితే అవి చిన్న విషయాలే అయినప్పటికీ వాటి గురించి తెలుసుకోవడం వల్ల మీకు ప్రసవం గురించి మరింత అవగాహన వస్తుంది. . అవేంటంటే,

ప్రణాళికాబద్ధంగా జరగకపోవడం

మీరు గత 9 నెలలుగా అలా ప్రసవం జరగాలి, ఇలా ప్రసవం జరగాలని అనుకొని ఉంటారు. అయితే ఒక్కోసారి మీరు ఊహించినది జరగకపోవచ్చు.  మీకు నొప్పులు మొదలైన సమయంలో మీ చుట్టూ ఎవరూ లేకపోవచ్చు, మీరు ఆసుపత్రికి చేరుకొనేసరికి అక్కడ డాక్టర్ లేకపోవచ్చు, మీకు కావాలనుకున్న రూమ్ మీకు దొరకకపోవచ్చు లేదా అనుకోని సమయంలో మీకు ప్రసవం జరగవచ్చు. కాబట్టి ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఫేస్ చేసే విధంగా మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకోండి.

మీరు తినడానికి  అనుమతించకపోవడం

ప్రసవ సమయంలో మీరు ఎలాంటి ఆహారాన్ని తీసుకోరాదు. ఒకవేల ఆహారం తీసుకుంటే మీకు సిజరింగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరూ కూడా మీరు ఆహారాన్ని తీసుకోడానికి ఒప్పుకోరు. మీకు మరీ ఆకలిగా ఉంటే కేవలం పళ్ళ రసాలను మాత్రమే ఇస్తారు అది కూడా చాలా తక్కువ మోతాదులో. కాబట్టి ఆకలిగా ఉన్నా కూడా సర్దుకుపోయే విధంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.

మీ సున్నిత భాగాలను  చాలా మంది వైద్యులు పరిశీలించడం

ప్రసవ సమయంలో మీ సున్నిత భాగాలను చాలా మంది వైద్యులు మరియు నర్సులు పరిశీలిస్తారు. నిముష నిముషానికి పరిశీలించినప్పుడు, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మీకు కొత్త ప్రక్రియ అయినా వైద్యులకు సాధారణ విషయమే. పుట్టబోయే బిడ్డ ఎంతవరకు బయటకు వచ్చింది, ఎంతసేపు పట్టవచ్చు అన్న విషయాలను బేరీజు వేయడానికే వారు అలా పరిశీలిస్తారు. ఈ విషయం కూడా చాలా మంది కొత్తగా తల్లయ్యే మహిళలకు తెలియదు.

ఎక్కువసేపు పుష్ చేయాల్సి రావడం

కొత్తగా తల్లయ్యే వారు ప్రసవం చాలా తక్కువ సమయంలో అయిపోతుందని అనుకుంటారు అయితే కొన్నిసార్లు 3 నుండి 4 గంటల సమయం పట్టవచ్చు. ప్రసవ సమయంలో పొట్ట భాగాన్ని చాలా సార్లు పుష్ చేయాల్సి రావచ్చు. సినిమాల్లో చూపించిన విధంగా కేవలం పది సార్లు పుష్ చెయడం ద్వారా బిడ్డ బయటకు రాదు. కాబట్టి మీరు ఎక్కువ సమయం పడుతుందని అనుకొని దానికి తగినట్లు ముందే ప్రిపేర్ అవ్వండి.

ప్రసవ సమయంలో మోషన్ అవ్వడం

మనం మోషన్ చేస్తున్నప్పుడు ఏ ఖండరాలైతే అత్యంత చురుకుగా ఉంటాయో, ప్రసవ సమయంలో కూడా ఆ ఖండరాలు అంత యాక్టీవ్‌గా ఉంటాయి. కాబట్టి, ఆ సమయంలో మల విసర్జణ జరిగే అవకాశం ఉంది. ఈ విషయం మీకు కొంచెం ఇబ్బంది కలిగించేదే అయినప్పటికీ, ఇది నిజం. ఇది అత్యంత సాధారణ విషయం కాబట్టి ఆందోలన చెందాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని కూడా మీకు ఎవరూ చెప్పరు.

వీటితో పాటు అప్పుడు మీరు పడే బాధ, నొప్పి అనన్యసామాన్యం మరియు వర్ణనాతీతం. మీరు ఎంత ఇబ్బంది పడినా ఒక్కసారి మీకు పుట్టిన బిడ్డను చూసుకుంటే చాలా ఆనందానికి గురవుతారు మరియు బాధను మొత్తం మరిచిపోతారు. కాబట్టి కొత్తగా తల్లయ్యే వారు వీటిని తెలుసుకొని సిద్ధంగా ఉండటం మంచిది.

Leave a Reply

%d bloggers like this: