bhartha-nundi-bharya-korukune-10-chilipi

ప్రతి భార్య తన భర్త రొమాంటిక్ గా చిలిపిగా ఉండాలనుకుంటుంది. రొమాంటిక్ అంటే పెళ్లి రోజు చీర కొనివ్వడమో లేదా నగలు కొనివ్వడమో కాదు.  ప్రతి రోజు తన   భర్త తనని ఎలా చూసుకుంటున్నాడు, తనకు ఎంత సమయం కేటాయిస్తున్నాడు, బాగోగులు ఎలా చూసుకుంటున్నాడు అన్నది ఆలోచిస్తారు. అలా అని చీరలు,  కానుకలు ఇష్ట౦ లేదు అని కాదు. అవి కూడా ఇష్టమే కానీ వాటి కంటే భర్త చేసే చిలిపి చేష్టలు, భర్తతో గడిపే సమయాన్నె ఎక్కువుగా ఇష్టపడతారు. ఇప్పుడు భర్త నుండి  భార్య కోరుకునే 10 చిలిపి (రొమాంటిక్) చేష్టలు గురించి తెలుసుకుందాము.

1.ఇంటి పనుల్లో సహాయం చేయడం

love

ఇంటి పనులు ఏ ఒక్కరి భాద్యత కాదు. ఈ విషయం మీ భర్త అర్థం చేసుకొని ఇంటి పనులలో సహాయం చేస్తే మీకంటే అదృష్టవంతురాలు ఉండదు.  భర్త తనకు ఇచ్చే ప్రేమ, తన పట్ల చూపించే శ్రద్ధకు చలా సంతోషిస్తుంది. కూరగాయలు తెచ్చివడం, పిల్లల విషయంలో కొంచెం సహాయం లాంటి చిన్న పనులు చేసిన చాలు భార్యని ఆనందింపచేయడానికి.

2.చెయ్యి పట్టుకొని నడవడం

love

ఇది చాలా చిన్న విషయమే కాని అత్యంత ముఖ్యమైన విషయం. భర్త భార్య చేతిని పట్టుకుంటే తను సేఫ్ గానే కాదు, విలువ అయినదిగా కూడా భావిస్తుంది. అందరిలో ఉనప్పుడు లేదా బయట వెళ్ళినప్పుడు భర్త తన చెయ్యి పట్టుకొని నడిస్తే భార్య చాలా సంతోషిస్తుంది. చూడముచ్చటగా, అన్యూనంగా కూడా ఉంటుంది.

౩. ఊహించని ముద్దులు

love

ముద్దు కంటే ప్రేమని ప్రదర్శించడానికి మరే మంచి మార్గం లేదు. ముద్దులు చాలా ముద్దుగా ఉంటాయి కదా. అవే ముద్దులు ఊహించకుండా వస్తే కలిగే సంతోషం వర్ణనాతీతం. లేవగానే గుడ్ మార్నింగ్ చెప్తూ ఒక ముద్దు, పడుకునే ముందు గుడ్ నైట్ చెప్తూ ఒక ముద్దు చాల అవసరం. భార్య పని చేస్తుండగా భర్త అకస్మాత్తుగా పెట్టె ముద్దు ఆమెకు చాలా ప్రత్యేకమినది.

4.తన నిర్ణయాన్ని గౌరవించడం

భర్త భార్యను అభిప్రాయం అడిగితేనే చాలా గొప్పగా ఉంటుంది, అలాంటిది తన సలహాలకు నిర్ణయాలకు విలువ ఇస్తే అంతకన్నా ఆనందం ఇంకొకటి ఉండదు. భర్త జీవితంలో తనుకు ఎంత ప్రాధాన్యం ఉందొ తెలుసుకొని మురిసిపోతుంది. భర్త మీద ప్రేమ గౌరవం మరింత పెంచుకుంటుంది. మీరే చెప్పండి, దీని కంటే రొమాంటిక్ గా ఏమైనా ఉంటుందా?

5.ఆమె అవసరాలు తెలుసుకొని తీర్చడం

love

ఇది ప్రతి భార్యా కోరుకునేదే కాదు, భర్త యొక్క భాద్యత కూడా. తన వారందిరిని వదిలేసి వచ్చిన అమ్మాయి అవసరాలు తీర్చడం ప్రతి భర్తా మొదట నిర్వర్తించాల్సిన భాద్యత. కాని తను చెప్పేవరకు ఆగకండి, మీరే అడిగి తెలుసుకోండి. ప్రతి అవసరాన్ని కోరికను తీర్చడానికి ప్రయత్నించండి.  భర్త భార్య చెప్పకుండానే భర్త తన అవసరాలు తెలుసోగాలిగితే వారి వైవాహిక జీవితం మరింత మధురంగా మారుతుంది.

6.కానుకలతో ఆశ్చర్యపరచండి

love

సినిమాలలో చూస్తుంటాం కళ్ళు మూసుకోమని చెప్పి ఒక గిఫ్ట్ ఇచ్చి హీరో హీరోయిన్ ని ఆశ్చర్యపరుస్తాడు. అది చూడడానికి  ఎంత బాగుంటు౦ది కదా! ప్రతి వైవాహిక జీవితంలో భర్తే హీరో భార్యే హీరోయిన్. కాబట్టి ఇలాంటివి కూడా ట్రై చేయండి. తను చాలా సంతోషిస్తుంది.

7. టైం దొరికినప్పుడల్లా ఆమెతో మాట్లాడండి

సాధారణ౦గా ఇంట్లోనే గడిపే ఆడవాళ్ళు తన భర్త తనతో రోజులో కొంతసేపు అయినా మాట్లాడాలి అనుకుంటారు. కాని చాల మంది మగవాళ్ళు ఇంటికి వెళ్ళగానే టీవీ కి అత్తుక్కుపోతుంటారు. అలా కాకుండు భార్యతో ప్రేమగా కొంత సేపు కబుర్లు చెప్పితే తను చాలా సంతోషిస్తుంది. సరదాగా టీ తాగుతూ నవ్వుకుంటూ మాట్లాడుకోవడం ఊహించకో౦డి. ఎంత రొమాంటిక్ గా ఉంది కదా!

8.ఒక రోజు సెలవు తీసుకోండి

భార్యతో గడపడానికి భర్త సెలవు తీసుకున్నాడు. ఇదది వినడానికే చాలా బాగుంది. నిజంగా జరిగితే ఆ భార్య పొందే ఆనందం అంత ఇంత కాదు. వీలుదోరికినపుడల్లా భార్యతో గడపడం ద్వార మీ బంధం మరింత బలపడుతుంది.

9.ఆమెకు ఆరోగ్యం బాగోలేకపోతే అమ్మలా చూసుకోండి

love

అనారోగ్యంతో బాధపడుతున్న భార్య మానసికంగా అత్యంత బలహీనంగా ఉ౦టుంది. తన భర్త పక్కనే తోడుగా ఉండాలనుకుంటుంది. అలాంటి సమయంలో వారి పక్కన కూర్చొని ధైర్యం చెప్పడం కంటే రొమాంటిక్ ఏముంటుంది చెప్పండి.

10.మీ ప్రేమను వ్యక్తం చేయండి

స్వతహాగా మగవారు పెళ్లి అయిన తర్వాత ప్రేమను వ్యతం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు. అది తప్పు, మీ ప్రేమను చెప్ప౦డి. చెప్తేనే ప్రేమ ఉన్నట్టు కాదు కాని ప్రేమ ఉంటె చెప్పడంలో తప్పేంటి. రోజు ఇ లవ్ యు చెప్పండి. ఎందుకంటే గొడవ అయినప్పుడు ఈ పదం బాగా ఉపయోగపడుతుంది.

మీ ఆయనకు తప్పకుండా SHARE చేయండి 

ఇవి కూడా చదవండి 

తమ భర్తలు చేసిన మధురమైన విషయాల గురించి మాతో పంచుకున్న ముగ్గురు మహిళలు 

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: