ee-7-kaaranala-valla-garbhavathiga-unnapudu-mee-bhartha-pakkane

అమ్మతనం అనేది దేవుడి ఇచ్చిన గొప్పవరం. కాని మీరు అమ్మ అనే కమ్మని మాట అనిపించుకోవాలంటే   9 నెలలు శిశువును కడుపులో దాచుకోవాలి.  ఈ క్రమంలో  ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదురుకోవాల్సి వస్తుంది. మీరు మానసికంగా కూడా బలహీనంగా ఉంటారు. కడుపుతో  ఉన్నప్పుడు శరీరంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి, హార్మోన్ సమతుల్యత కోల్పోవడం వలన ఆలోచనలు పలు విధాలుగా మారుతుంటాయి. అందువలన మీ భర్త ఎల్లవేళల మీకు అందుబాటులో ఉండటం చాలా అవసరం.  

గర్భవతిగా ఉన్నప్పుడు మీ భర్త పక్కనే ఉండాలి. ఎందుకంటే

1.మీకు మానసికంగా ధైర్యం చెప్పడానికి ఒక మంచి నేస్తం కావలి

కడుపుతో ఉన్నవారి ఆలోచనలు అతి త్వరగా మారుతుంటాయి. కోపం, ప్రేమ, బాధ వంటి ఫీలింగ్స్ అన్నీ ఎక్కువుగా ఉంటాయి. మీ వారు లేక బంధువులు చేసిన చిన్న తప్పులకే పెద్దగా అరిచేయడం లాంటివి చేయవచ్చు. అప్పుడు మీ భర్త అర్థం చేసుకొని సర్దిచెప్పడానికి మీ పక్కన ఉండడం అవసరం. మానసికంగా కూడా మీకు మద్దత్తు తెలుపుతూ కడుపుతో ఉనన్ని రోజులు మిమ్మల్ని సంతోషంగా చూసుకోవాలి. 

2.శారీరకమైన సహాయం అవసరం

గర్భవతిగా ఉన్న సమయములో మీరు మానసికంగానే కాదు, శారీరకంగా కూడా బలహీనంగా ఉంటారు. శరీరం నొప్పికి మరియు ఒత్తిడికి లోనవుతుంది. అలాంటి సమయంలో మర్దన చేసుకుంటే ఒత్తిడి నుండి కొంచెం ఉపసమనం పొందవచ్చు. మీ భర్త ఈ అవసరం గ్రహించి మీకు తోడుగా ఉండాలి. అంతే కాకుండా, గర్భిని స్త్రీలు బరువులు మోయడం, కష్టమైన పనులు చేయడం వంటివి అస్సలు చేయకూడదు. కాబట్టి మీ వారు సమయం దొరికినప్పుడల్లా మీకు ఇంటి పనుల్లో సహాయం చేయవలసిన ఆవశ్యకత ఉంది.

౩. నమ్మదగిన ఒక తోడు కావలి

శరీరంలో కలిగే మార్పుల వలన మీకు ఆత్రుత, ఆందోళన అధికముగా ఉంటాయి. అందుచేత మీ పక్కన ఈ భావాలు పంచుకోవడానికి ఒక నమ్మకమైన తోడు ఉంటె బాగుండు అనిపిస్తుంది. భర్త కంటే నమ్మకమైన తోడు ఇంక ఎవరుంటారు? దీనిని అర్థం చేసుకొని మీ వారు అన్నివేళలా ఏదో ఒక విధముగా మీకు అందుబాటులో ఉండాలి. రోజంతా మీతో ఉండడం కుదరదు కాబట్టి కనీసం ఫోన్లో అయినా మీకు అందుబాటులో ఉండాలి.

4.ఆరోగ్యకరమైన కాన్పు కోసం 

ఆరోగ్యకరమైన కాన్పు జరగడం తల్లికి మరియు బిడ్డకి చాలా అవసరం. అల జరగాలంటే మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళు, ముఖ్యముగా మీ భర్త మీ మీద ప్రత్యకమైన శ్రద్ద వహించాలి. భర్త కడుపుతో ఉన్న భార్యను ప్రతి నేలా డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లి చకప్ చేయించాలి. డాక్టర్ల సూచన మేరకు మందులు భార్యకు గుర్తు చేసి మరీ వేయించాలి.

5.ఆరోగ్యకరమైన బిడ్డ కోసం

పుట్టబోయే బిడ్డ యొక్క ఆరోగ్యం తల్లి ఆరోగ్యం మీద ఆధారిపడి ఉంటుంది. అందుకే, కడుపుతో ఉన్న వారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి, భర్త అందుకు సహకరించాలి. భార్యని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుకోవడం భర్త యొక్క ప్రధమ భాద్యత. ముఖ్యంగా ఇలాంటి సమయంలో భార్య మీద సాధారణంగా చూపించే శ్రద్ద కంటే ఎక్కువ శ్రద్ద వహించాలి.

6.నవ మాసాలు బిడ్డను కడుపులో మోయడము అంత సులువు కాదు

ఈ 9 నెలలు తల్లి బిడ్డను కడుపులో పెట్టుకొని చూసుకుంటే, భర్త భార్యని కళ్ళలో పెట్టుకొని చూసుకోవాలి. మరీ ముఖ్యంగా నెలలు నిండిన సమయములో ఎల్లప్పుడు మీ భర్త తోడుగా ఉంటూ తగిన సేవలు చేయాలి. మీతో మాట్లాడటం, మీ పనుల్లో సహాయం చేస్తుండాలి.

7.ఎందుకంటే పుట్టబోయేది తన బిడ్డ కూడా కాబట్టి

కడుపుతో ఉన్నవారి భర్త  పక్కనే ఎందుకు ఉండాలంటే,  పుట్టబోయేది తన బిడ్డ కూడా కాబట్టి. నవ మాసాలు భార్య  కష్టపడుతుంటే, భర్త చేయగలిగిందల్లా తనకి తోడుగా ఉండడమే. ఎలాగో ప్రసవ బాధని భర్త పంచుకోలేడు కనీసం బాధలో ఉన్న భార్యకి భరోసాగా అయిన తప్పనిసరిగా పక్కనే ఉండాలి.

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Leave a Reply

%d bloggers like this: