ee-8-lakshanalu-mee-bharthalo-unte-meeru

మీ వివాహ బంధం బాగుండాలంటే మీ ఇద్దరికీ, ఒకరి మీద ఒకరికి మంచి అవగాహన ఉండాలి, అర్థం చేసుకోగలగాలి మరియు  అపారమైన నమ్మకం ఉండాలి.  ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీభర్త సపోర్ట్ చేయాలి. ప్రతి విషయాన్ని పంచుకుంటూ ఒక స్నేహితునిగా, మంచి భర్తగా, మీ ఆత్మగా ఉండాలి.  మీ భర్త మీ విషయంలో ఉత్తమమైన వ్యక్తి అని చెప్పడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. అవేంటంటే,

మీ హృదయాన్ని గెలవడానికి ప్రయత్నిస్తుండటం

స్వతహాగా అబ్బాయిలు అమ్మాయిలను ఇంప్రెస్ చెయడానికి ట్రై చేస్తుంటారు. అలాగే మీ భర్త కూడా ఎప్పుడైనా మీ కోసం త్వరగా లేచి బ్రేక్‌ఫాస్ట్ చేయడం, ఆఫిస్ నుండి ఇంటికి తొందరగా రావడం, మీరు ఎంతగానో ఇష్టపడే క్యాండిల్ లైట్ భోజనానికి తీసుకెళ్ళడం వంటివి చెయడం ద్వారా మీ మనసు గెలుచుకోవడానికి  ప్రయత్నం చేస్తుంటాడు. అంతేకాక, అతనిలో ఉన్న రొమాంటిక్ యాంగిల్‌ను తరచూ బయటకు తీస్తూ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తూ ఉండాలి..

అతను మంచి శ్రోత అయివుండాలి

వివాహ బంధం అన్యోన్యంగా ఉండాలంటే మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. మీ భర్త ఏదైనా సమస్యలలో ఉంటే అతనికి మీరిచ్చే సలహా వల్ల సమస్య నుండి బయటపడితే మీ ఇద్దరి మధ్య బాండ్ మరింత బలపడుతుంది. మీ భర్త ఎప్పుడూ  మీ సలహాలను స్వీకరిస్తుంటే మీరు చాలా లక్కీ. దీని వల్ల మీ బంధం మరింత మెరుగవుతుంది.

మిమ్మల్ని అప్పుడప్పుడు పొగుడుతూ ఉండటం

పొగడ్త ఎలాంటి మనిషికైనా ఆనందాన్ని కలిగిస్తుంది. అలాంటిది మీకు ఇష్టమైన మనిషి మిమ్మల్ని పొగిడితే మీ ఆనందం రెట్టింపు అవుతుంది. మీ భర్త కూడా మిమ్మల్ని, మీరు చేసే పనులను పొగుడుతున్నట్లైతే, అతను మిమ్మల్ని అర్థం చేసుకున్నాడని ఆనందించండి. మీరు అతనికి దొరకడం అతని అదృష్టంగా బావిస్తే, అది మీకు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది.

ఎప్పుడు చేతులు పట్టుకొని ఉండటం

చాలా మంది మగవారు తమ ఫీలింగ్స్‌ను నోటి ద్వారా వ్యక్తపరచలేరు కానీ తమ చేతల ద్వారా బహిర్గత పరుస్తారు. మీ భర్త ఎప్పుడూ  మీ చేతులను పెనవేసుకోవాలని ప్రయత్నిస్తుంటే, మీ మీద ప్రేమ చూపిస్తున్నాడని అర్థం. మీకు ఏమి జరిగినా నేనున్నాను, ఎలాంటి సమయాలలోనైనా తోడుగా ఉంటాను అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు బావించండి.

మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు చేయకపోవడం

మీ భర్త మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మీకు నచ్చినట్లుగా ఉండాలి. మిమ్మల్ని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ మీకు చిరాకు కలిగించే విషయాలను అసలు ప్రస్తావించకుండా ఉండాలి. అంతేకాక, ఆడవారి సమస్యలను అర్థం చేసుకొని, అందుకు తగ్గట్లుగా ప్రవర్తి౦చాలి.

అప్పుడప్పుడు ఇంటిని శుభ్రం చేయడం

మీకు ఎక్కువ ఇంటి పని ఉన్నప్పుడు అతను మీకు ఇంటిపనిలో సహాయం చేస్తే అతను మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాడని అర్థం. ఇంటిని శుభ్రం చేయడం, తన వస్తువులను తనే క్రమ పద్దతిలో ఉంచుకోవడం, పిల్లలకు స్నానం చేయించడం  ద్వారా అతను మీమీద ప్రేమను చూపిస్తుండాలి.

మీ వంటను అమితానందంగా తినడం

మీకు పెళ్ళి అయిన కొత్తలో వంట సరిగ్గా చేయడం రాకపోయినా మిమ్మల్ని అర్థం చేసుకొని, మీ వంటను పొగుడుతూ తినడం వల్ల మీకు అతను గౌరవం లభిస్తుంది. మీరు మాట్లాడే మాటలను అదేపనిగా వింటూ మీకు నైతిక మద్ధతును ఇస్తుండాలి. ఇదంతా మీ కోసమే అని మీరు గుర్తించాలి.

మీరు మంచి వ్యక్తిగా మారడానికి తోడ్పడటం

ఎవరూ కూ డా ఫర్ఫెక్ట్‌గా ఉండరు చిన్న చిన్న తప్పులు చేయడం సహజం. అలాంటప్పుడు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, మీకో మంచి వ్యక్తిత్వం వచ్చేలా మీ భర్త సహాయం చేయాలి. మీతో ఎంతో నిజాయితీగా ఉంటూ, మిమ్మల్ని ఎప్పుడూ ఆనందంగా ఉండేలా చూసుకోవాలి. మీ కోసం అతను చేసే ప్రతి పనీ మిమ్మల్ని ఆనందింపచేయడంతో పాటూ మీ హృదయాన్ని గెలిచుకొనేలా ఉంటుంది.

మీ భర్తలో కూడా ఇలాంటి లక్షణాలు ఉంటే మీకు చాలా లక్కి అనుకోవచ్చు.

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: