pelli-ayina-tarvatha-edurayye-5-rakaala

మీరు చేసుకున్న వివాహం ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే మిమ్మల్ని అర్థం చేసుకొనే భర్తతో  పాటూ మిమ్మల్ని కూతురిలా చూసుకొనే  అత్తగారు దొరికినప్పుడే. మీరు  పెళ్ళి చేసుకున్న తర్వాత మీ భర్తతో ఎంత ఆనందంగా ఉంటారో, మీ అత్తగారి నుండి అన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగని అందరూ అలాగే ఉంటారని చెప్పలేము. ఉండరని చెప్పలేము. కాని ఎక్కువ శాతం మంది అత్తలు కోడలిని కూతురిల కాకుండా కాంపిటీషన్ లా ఫీల్ అవుతారు.  స్వతహాగా మనకు నిజజీవితంలో ఎదురయ్యే 5 రకాల అత్తగార్ల గురించి మీకు తెలియజేస్తున్నాము.

అసూయ చెందే అత్తగారు

ఆమె నుండి తన కొడుకుదూరం అవుతున్నాడు అని బావించే అత్తగారిలో అసూయ పాళ్ళు ఎక్కువ ఉంటాయి. వీరిలో అభద్రత భావం కూడా ఎక్కువగా ఉండి మిమ్మల్ని పీడించే అవకాశం ఉంటుంది. ఆమె ఎప్పుడూ మిమ్మల్నీ విమర్శిస్తూ ఉంటుంది. అన్ని పనులు తనకి మాత్రమే తెలుసు అనుకొని మీ పనులను తప్పుపడుతూ ఉంటుంది. అంతేకాక, తన బంగారు కొడుక్కి మీరు అస్సలు సరితూగరని ఆమె బావిస్తుంటారు.

అనవసర విషయాలలో జోక్యం చేసుకొనే అత్తగారు

కొంత మంది అత్తలు తమ కోడలు గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆరాటపడతారు. అది చిన్న విషయమా లేక పెద్ద విషయమా, అవసరం ఉందా లేక అనవసరమైనదా అన్న కనీస స్పృహ లేకుండా ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటారు. మొదట్లో ఇది బానే ఉన్నా నిదానంగా మీకు చిరాకు పుట్టే అవకాశం ఉంది. మీ గురించి అన్ని తెలుసుకొని మీమీద పైచేయి సాధించాలని వారి ఆత్రుత.కాని అది అత్యసేలే౦డి, మనం మాత్రం ఎన్ని రోజులని సైలెంట్ గా ఉంటాము, ఛాన్స్ వచ్చినప్పుడు చెలరేగిపోము.

కొడుకును మార్చడానికి ప్రయత్నించే అత్త

కొంతమంది అత్తగారు పెళ్ళి అయిన తర్వాత కూడా తన కొడుకును తమ చేతుల్లోనే ఉంచుకోవాలని చూస్తారు. ఎమోషన్ బ్లాక్‌మెయిల్ చేస్తూ తమకు నచ్చిన పనులే తన కొడుకు చేసే విధంగా అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇలాంటి కొడుకులు అమ్మను కాదనలేక, భార్యను కాదనలేక సతమతమౌతుంటారు. ఇలాంటి అత్తగారి వల్ల మీకు చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. వీరికి కొడుకు మీద ప్రేమ అనుకోవాలో లేక మీ కోడలి మీద అసూయ అనుకోవాలో అర్థం కాదు. మొత్తంగా ఎప్పటికీ తనే ఇంటికి మహారాణిలా ఉండాలి అనుకుంటుంది.

తమ మీద ఆధారపడాలని కోరుకొనే అత్తగారు

కొంతమంది అత్తలు, తమ కోడలు పూర్తిగా తమ పైనే ఆధారపడాలని అనుకుంటారు. ప్రతి చిన్న విషయంలో కూడా తన నిర్ణయం ఉండాలని అనుకుంటారు. మీరు ఇంట్లో సోఫా ప్లేస్ మార్చాలన్నా, దేవుని గదిని చేంజ్ చేయాలన్నా, ఏదైనా వస్తువుని కొనాలన్నా తమను అడాగాలని వారు అనుకుంటారు. ప్రతి విషయాన్ని నాకు చెప్పు అని వారు బయటకు అనరు కానీ లోపల తన నిర్ణయం తీసుకోవాలనే ఆరాటం ఉంటుంది. ఇలాంటి వారు మీకు సన్నిహితంగా ఉండాలని అనుకుంటారు అలాగే, మీమీద ఆధిపత్యం చెలాయించాలనీ అనుకుంటారు. ఇలాంటి అత్తగార్ల వల్ల మీకు కంఫ్యూజన్‌తో  పాటూ చిరాకు కూడా వస్తుంది.

మీకు మద్ధతుగా నిలిచే అత్తగారు

కొంతమంది అత్తలు, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అర్థం చేసుకుంటారు. మీ పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. మీకంటూ కొంచెం స్వేచ వారు కల్పిస్తారు. మీరు ఏదైనా తప్పు చేసినా సున్నితంగా మందలిస్తారే కానీ మీ మీద ఎలాంటి కోపం పెట్టుకోరు. మీకు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైతే ఆమె మీకు అన్ని విధాలా మద్ధతు ఇస్తారు. వినడానికే ఎంత బాగుంది కదా. ఇలాంటి అత్తగారు నిజంగానే ఈ భూమి మీద ఉంటె ఇంకా ఎంత బాగుండేదో. ఒకవేల మీకు ఇలాంటి అత్తగారు ఉంటే మీరు చాలా లక్కీ, ఇలాంటి అత్తగారిని ఇచ్చినందుకు దేవునికి కృతఘ్నతలు తెలుపుకోండి.

Leave a Reply

%d bloggers like this: