mee-pasikanduku-gas-samasya-poorthi-nivarana

పెద్ద వాళ్ళకి మాత్రమే కాదు చిన్న పిల్లలకి కూడా గ్యాస్ సమస్య ఉంటుంది. ఈ సమస్య చిన్న పిల్లలను చాలా ఇబ్బందికి గురి చేస్తుంది.   పిల్లలు ఇబ్బందికి గురితే మనం తట్టుకోగలమా. అందుకే తల్లిదండ్రులుగా ఈ సమస్యను గుర్తించడం మన భాద్యత. కాని ఎలా? మనకి పిల్లలు గ్యాస్ తో బాధపడుతున్నారు అని ఎలా తెలుస్తుంది అనే కదా మీ సందేహం. గ్యాస్ సమస్యలతో బాధ పడే పిల్లలు కొన్ని లక్షణాలను ప్రదర్శిస్తారు. అవి ఏమిటో తెలుసుకుంటే మీరు సులువుగా గ్యాస్ సమస్యను గుర్తించవచ్చు. ఇప్పుడు ఆ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాము.

  1. పెద్దల్లో లానే చిన్న పిల్లలు కూడా గ్యాస్ సమస్యతో బాధపడుతుంటే పిత్టడం, తే౦పడం లాంటివి చేస్తుంటారు.
  2. అంతే కాకుండా, వారి పొట్ట గట్టిగా కొంచం ఉబ్బినట్టు ఉంటుంది.
  3. గ్యాస్ సమస్యతో బాధపడే పిల్లలు తరుచుగా ఏడుస్తుంటారు. ఈ ఏడుపు ఆకలిలా కాకుండా బాధ కలగడం వచ్చిన ఏడుపులా ఉంటుంది.
పిల్లలకు గ్యాస్ సమస్య రాకుండా చూసుకోవడం ఎలా?

ఎప్పుడు అయినా ఒక సమస్య వచ్చిన తరువాత బాధపడే కంటే అస్సలు సమస్య రాకుండా చూసుకోవడం మేలు. పిల్లలకి గ్యాస్ సమస్య రాకుండా ఉండాలి అని అంటే ఈ జాగ్రతలు తీసుకోండి.

  • పిల్లలకి ఎలాంటి ఆహరం ఇవ్వాలో డాక్టర్ ని అడిగి అలాంటి ఆహరంనే ఇవ్వండి. పొరపాటున కూడా పిల్లల జీర్ణ శక్తి పెరిగే వారు డాక్టర్ సిఫారసు చేయని ఆహరం పెట్టకపోవడం మంచిది.
  • అంతే కాకుండా, పిల్లలకి ఆహరం సరైన యా౦గిల్ మరియు సరైన పద్దతిలో ఇవ్వండి. పాలు ఇచ్చేటప్పుడు మీరు సౌకర్యంగా కూర్చోని ఇవ్వడం మంచిది. ముఖ్యంగా పిల్లలకు తొందర తొందరగా తినిపించకండి. నిదానముగా వారికి కావాల్సిన సమయము ఇస్తూ తినిపించండి.
  • చివరగా వారి కడుపు నిండిన తరువాత సాధ్యమైన౦త వరకు తే౦పు తెప్పించడానికి ప్రయత్నించండి. తే౦పు రప్పించడానికి మీ బాబు వీపు మీద సున్నితంగా తట్టి, మెల్లగా నిమరండి.
ఒక వేల మీ బిడ్డ ఇప్పటికే గ్యాస్ సమస్యతో బాదపడుతుంటే నివారించడం ఎలా?

గ్యాస్ సమస్యను ప్రమాదకరం ఏమి కాదు, సులువుగా తగ్గించ వచ్చు. కాబట్టి భయపడకండి.  మీ బిడ్డ గ్యాస్ సమస్యతో బాధపడుతున్నాడు అని మీకు అనిపిస్తే ఈ విధంగా చేయండి.

  • బాబు లేదా పాప పొట్టను మరియు వీపును సున్నితంగా నిమరండి. ఇలా చేయడం వలన శరీరం లో ఉన్న గ్యాస్ బయట వచ్చే అవకాశాలు పుష్కలం.
  • కాళ్ళను చేతులను సున్నితంగా తీడడం ద్వార పేగుల్లో కదలిక మొదలయ్యి గ్యాస్ బయట వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇలా చేసినా తగ్గకపోతే డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళండి. పెద్దల్లో లా గ్యాస్ సమస్య పిల్లల్లో ఏమంత ప్రమాదం కాదు. వారి జీర్ణ శక్తి పెరుగుతూ ఉంటుంది కాబట్టి తగిన మందులు వేసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. 

Leave a Reply

%d bloggers like this: