mee-pillalu-sarigga-nidrapovadam-leda-karanalu-parishkaralu

పిల్లలని పెంచడంలో అత్యంత ముఖ్యమైన మరియు కష్టమైన పని ఏమిటంటే అది పిల్లలను నిద్రపుచ్చడం. పసి తనంలో పిల్లలకి ఎక్కువ సేపు నిద్ర చాలా అవసరం  ఎందుకంటే వారి పెరుగుదల అప్పుడే జరుగుతుంది కాబట్టి. అందువలన పిల్లలకి ప్రశాంతమైన నిద్రని కల్పించడం తల్లిదండ్రులుగా మన భాద్యత. కాని, పిల్లలకు ఒక క్రమ పద్దతిలో నిద్రను అలవాటు చేయడం అంత సులువు కాదు. ఈ విషయంలో అందరు తప్పులు చేస్తుంటాం. పిల్లలకు నిద్రను అలవాటు చేసే క్రమంలో  మనం చేసే తప్పులు ఏంటో తెలుసుకుని సరిదిద్దుకుంటే వారికి సుఖమైన నిద్రను అందించగలము. అవేంటంటే…

1. నిద్రకు సరైన ప్రణాళిక లేకపోవడం

ఏ పనికి అయిన ఒక ప్రణాళిక అవసరం. మీ పిల్లలు ఎంతకి పడుకోవాలో, ఎంత సేపు పడుకోవలో ఒక ప్రణాళిక వేసుకోండి. రోజు క్రమం తప్పకుండా ఆ ప్రణాళిక ప్రకారం పిల్లలని నిద్రపుచ్చండి. కొన్ని రోజులకి ఆ ప్రణాళిక ప్రకారం పిల్లలకే నిద్ర అలవాటు అయిపోతుంది. ఇలా చేయడం అత్యంత అవసరం ఎందుకంటే, వాళ్ళు టైం కి నిద్రపోవడమే కాదు, జీవితాంతం సరైన టైం కి నిద్రపోయి సరైన టైం కి లేస్తారు.

2. ఊపుతూ నిద్రలోకి పంపడం

ఊగుతూ ఉంటె తొందరగా నిద్ర పట్టేస్తుంది. అందుకే మనం బస్సుల్లో, కారులో ప్రయాని౦చేటప్పుడు నిద్రపోతాం. కాని ఇది పిల్లలకి ఉపయోగపడే ప్రశాంతమైన నిద్ర కాదు. ఊపుతూ నిద్రలోకి పంపడం ద్వారా పిల్లలకు సుఖమైన నిద్ర దొరకదు. కాబట్టి, ఉయ్యాలో ఊపి నిద్ర తెప్పించండి కానీ వారు నిద్రలోకి జారుకున్నాక బెడ్ మీద పండేయండి. అవసరమైతేనే ఉయ్యాలలో ఊపండి. ఒక్కసారి ఇది క్లిక్ చేయండి.. నిద్ర వలన కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు 

3. రాత్రుళ్ళు ఎక్కువసేపు మేలుకోనివ్వడం

పిల్లలను ఎట్టి పరిస్తితులలో రాత్రి పూట ఎక్కువ సేపు నిద్ర మేల్కొనివ్వకూడదు. ఎదో ఒక రోజు అయితే పర్లేదు కాని అది అలవాటుగా మాత్రం అస్సలు మారకూడదు. పిల్లలు లేటుగా నిద్రపోవడం వళ్ళ బద్ధకం పెరుగడమే కాకుండా జీవితాంతం అలానే అలవాటు అయిపోయే ప్రమాదం కూడా ఉంది. మనకు చాల మంది రాత్రి పూట పడుకుంటానే నిద్ర రాదు అని చెప్తుంటారు. వాళ్ళకి అలా జరగడానికి కారణం చిన్నతనం నుండి టైం కి పడుకోవడం అలవాటు లేకపోవడం మూలానే.

4. నిద్రపోవడానికి సరి అయిన వాతావరణం లేకపోవడం

మంచి వాతావరణం లేకపోతే నిద్ర అంత సులువుగా రాదు. చుట్టూ ధ్వనులు వస్తున్నా, రాత్రి పూట కూడా వెలుతురు వస్తున్నా నిద్రపోవడం కష్టం. అందకే పిల్లలు నిద్రపోవడానికి మనం మంచి వాతావరం కల్పించాలి. ఇంట్లో పిల్లలు పడుకునే సమయానికి లైట్లు, టీవీ ఆపేసి వారికి ప్రశాంతమైన నిద్రను అందించాలి.

5. నిద్రపోయారా లేదా అని చూస్తూ ఉండడం

వినడానికి విద్దురంగా ఉన్నా ఇది నిజం. మనం మన పాప బాగా నిద్రపోతుందో లేదో అని తరచూ చూడడానికి ప్రయత్నించినప్పుడు,  మన కదలిక వాళ్ళ పిల్లల నిద్రకు భంగం కదులుతుంది. అంతే కాక వాళ్ళు నిద్ర లేచి ఏడ్చే అవకాసము కూడా ఉంది. అలా అని పిల్లలను అస్సలు చూడకండి అని కాదు… చూడండి కాని వాళ్ళు డిస్టర్బ్ కాకుండా చూసుకోండి.

6. ఏడుస్తూ నిద్రపోన్నివడం

ఇది అస్సలు చేయకూడని పని. పిల్లలు ఏడుస్తూ నిద్రపోతే వారికి సుఖమైన నిద్ర రాదు. కాబట్టి వాళ్ళను ఏడుస్తూ మాత్రం నిద్రపోనివ్వకండి. వీలైనంత వరకు పిల్లలు ఏడుస్తుంటే బుజ్జగించి తరువాత వారిని నిద్రపుచ్చండి.

Leave a Reply

%d bloggers like this: