pillalaku-istamina-mariyu-arogyakaramina-3-aaharalu-tayaru-cheyu-vidhanam

 బిడ్డ 4-6 నెలల వయస్సు రాగానే ఘన పదార్థాలు తినడానికి సిద్దపడుతాడు. మొదటిగా మనం పిల్లలకి తినిపించే ఘన పదార్థాలు  మృదువుగా, పలుచగా, ఆరోగ్యకరముగా మరియు రుచికరముగా ఉండేలా చూసుకోవాలి. ఒకటే సారి పూర్తి ఘన పదార్థములు కాకుండా కొంచెం పలుచగా అంటే గుజ్జులాగా, తినడానికి సులువుగా ఉండే ఆహారము ఇవ్వడం మంచిది. ఇలాంటి ఆహరం ఇవ్వడం ద్వారా పిల్లలకి ఎలాంటివి నచ్చుతున్నాయి, ఎలాంటివి తింటే ఎలర్జీలు వస్తునాయి అని గ్రహి౦చి జాగ్రత్త పడడానికి వీలు ఉంటుంది.

అరటి ప౦దు, క్యారెట్ మరియు ఆపిల్ గుజ్జుని పిల్లలు ఇష్టంగా తింటారు. అంతే కాకుండా వాటిలో ఉన్న పోషక విలువలు బిడ్డకి కావాల్సిన శక్తిని అందించి ఎదుగుదలకు తోడ్పడుతాయి. వీటిని నున్నగా గుజ్జు లా చేయడం ద్వార పిల్లలు సులువుగా తింటారు మరియు జీర్ణ సమస్యలు కూడా రావు. ఇప్పుడు తాయారు చేశా విధానము చూద్దాం.

1. క్యారెట్ గుజ్జు

క్యారెట్ లో గల సహజ రుచి, రంగు మరియు పోషక విలువలు వలన క్యారట్ గుజ్జుతో మీ పిల్లలకి ఘన పదార్థము పరిచయం చేయడం మంచిది. క్యారట్ లో ఉండే యాంటిఆక్సిడెంట్ బీటా కేరోటిన్ మరియు విటమిన్ A సుగుణాలు పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది.

కావలసిన పదార్థములు

6 పెద్ద తాజా క్యారెట్లు. వీటి పొట్టు జువిరి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఉంచుకోండి.

తయారు చేయు విధానము

పైన చెప్పిన క్యారెట్లను వెజిటేబల్ స్టీమర్ లో 20 నిమిషాల పాటు ఉంచాలి. ఒక వేల వెజిటేబల్ స్టీమర్ లేకపోతే ఒక పాత్రలో నీరు పోసి క్యారెట్లను అందులో ఉడికించండి. అవి మృదువుగా సున్నితంగా అయిన తరువాత ఫుడ్ ప్రసేసోర్ లో పెట్టి మీకు కావాల్సిన మందం వచ్చే వరకు నీళ్ళు కలపండి

చిట్కా: మంచి పలితం కోసం పొడవుగా ఉన్న పెద్ద క్యారెట్లను ఎంచుకోండి. చిన్న క్యారట్లో కంటే పెద్ద వాటిలో పోషకాలు అదికంగా ఉంటాయి.

2. అరటి పండు గుజ్జు

వీటిలో ఉన్న పొటాషియం ఫైబర్ కారణంగా అరటి పండును అందరూ ప్రధమ ఆహారం అంటారు. అరటి పండు గుజ్జు సులువుగా జీర్ణం అవుతుంది. కాబట్టి కొత్తగా ఘన పదార్థము తినడం మొదలు పెట్టిన పిల్లలకి ఇది చాలా మంచిది. కానీ, దీనిని పిల్లలకు ఎక్కువగా తినిపించకండి, మల బద్ధకం వచ్చే అవకాశం ఉంది.

కావలసిన పదార్థములు

బాగా పండిన అరటి పండు, ఒక టీ స్పూన్ నీళ్ళు లేదా రొమ్ము పాలు

తయారు చేయు విధానము

అరటి పండుని ఒక గిన్నెలో తీసుకొని స్పూన్ తో లేదా చేతితో నున్నగా అయ్యేంత వరకు నలపండి. నలుపుతున్నపుడు ఒక టీ స్పూన్ రొమ్ము పాలు కాని నీళ్ళు కాని కలిపితే అరటి గుజ్జు మరింత మృదువుగా మారుతుంది.

౩. ఆపిల్ గుజ్జు

అందరికీ తెలిసిన విషయమే, రోజు ఒక ఆపిల్ తింటే ఏ అనారోగ్య సమస్యలు రావు అని.   అందుకే పిల్లలకు కూడా ఆపిల్ గుజ్జు తినిపించడం మంచిది.  సహజంగానే ఆపిల్ రుచిగా, తియ్యగా ఉంటుంది కాబట్టి పిల్లలు దీనిని ఇష్టంగా తింటారు.

కావలసిన పదార్థములు

సన్నగా తరిగిన ఆపిల్ ముక్కలు

తయారు చేయు విధానము

సన్నగా తరిగిన ఆపిల్ ముక్కలను వెజిటేబల్ స్టీమర్ లో 12 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత దీనిని ఫుడ్ ప్రసేసోర్ లో నున్నగా అయ్యేంత వరకు ఉంచాలి.

ఈ మూడు గుజ్జులు 4 నుంచి 6 నెలల పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ వయస్సు లో ఎదుగుదల ఆరోగ్యం అత్యంత అవసరము కాబట్టి మంచి ఆహారం ఇవ్వడం శ్రేయస్కరం.

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Leave a Reply

%d bloggers like this: