kothaga-thalli-ayina-prathi-mahila-thelusukovalasina-11-vishyalu

ప్రతి మహిళ తల్లి అయినా తరువాత తన జీవితంలో మరో కొత్త అంకాన్ని మొదలుపెడుతుంది. కానీ పిల్లలు పుట్టిన వెంటనే ప్రతి మహిళ గొప్ప తల్లి అయిపోయే  ఉత్తమ ప్రక్రియ ఏది లేదు.మొదట ఏమీ చేయాలో తోచక , చిన్న చిన్న తప్పులతో మొదలుపెట్టి ,నిర్ణయాల కోసం తర్జన భర్జన పడుతూ మాతృత్వం లోకి అడుగుపెట్టడం అతి సహజం .పిల్లలను పెంచడానికి పుస్తకాలలో ఉన్నట్టు సులువైన చిట్కాలు,సూత్రాలు ఏమివుండవు , స్వీయానుభవంతో తపోప్పులు చేస్తూ  ఎవరికి  వారు నేర్చుకోవలసిందే.అలా నేర్చుకునే ప్రక్రియలో గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన పదకొండు విషయాలు.

1.తల్లిపాలు పట్టించడం

గర్భం దాల్చిన మొదటి రోజు నుంచి తల్లిపాల గురించి అనేక విషయాలు వింటూనే ఉంటాం.కానీ మొదట తెలుసుకోవలసింది బిడ్డకు తల్లిపాలు  పట్టించడం అంత సులువైన విషయం కాదు.మొదటి ప్రయత్నంలోనే పాలు పట్టించడం కొందరికి వెంటనే సాధ్యం కాకపోవచ్చు, .అంతమాత్రాన తల్లిగా విఫలమైనట్టు కాదు. బిడ్డతో సంబంధాన్ని మెరుగుపరుచుకుంటూ ఓపికతో ప్రయత్నిస్తే కొంతకాలానికి సులువు గానే అలవాటవుతుంది.

2.మాతృత్వ లక్షణాలు

బిడ్డ పుట్టిన వెంటనే మాతృత్వ లక్షణాలు సహజంగా కలగకపోవచ్చు.పిల్లలను జాగర్తగా ఎత్తుకోవడం,నిద్రపుచ్చడం,ఆడించడం మొదట్లో కష్టంగానే ఉంటుంది.కొంతకాలానికి నిదానంగా అలవాటవుతాయి.అంతవరకు పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.

3.ప్రణాళికలు మారిపోవచ్చు

పిల్లలను పెంచడానికి పుస్తకాల నుంచి చాల సమాచారాన్ని తెలుసుకుని,వాటినిబట్టి ప్రణాళికలు ఏర్పరుచుకుంటాం.కానీ నిజానికి పిల్లలకి ఆకలివేసే ,నిద్రపోయే సమయాలు రోజు మారిపోవచ్చు. అలాంటప్పుడు హడావడిపడకుండా పిల్లలకు అనుగునంగా మీ ప్రణాళికను మార్చుకోవడం అవసరం.

 4.వత్తిడికి దూరంగా ఉండండి 

పిల్లలు పుట్టాక అనేక రకాల వత్తిడులకు లోనవుతాం .కొన్నిసార్లు పిల్లలను విసుక్కోవడం తిట్టడం అందరూ తల్లులు సహజంగా చేస్తూనేవుంటారు.అలాంటి సమయాలలో నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ఇలాంటి విషయాల గురించి ఇతరులతో మాట్లాడి సలహా తీసుకోవడం అవమానంగా భావించాల్సిన అవసరం లేదు.

5.మీ గురించి కూడా పట్టించుకోండి.

పిల్లలను ఆలనాపాలనా చూస్తూ మన గురించి ఆలోచించడం పూర్తిగా మర్చిపోతాం.మనం సంతోషంగా లేకపోవడం కుటుంబం మీద,పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది.అందుకే మీకంటు కొంత ప్రత్యేక సమయం వుండేటట్టు చూసుకోవడం మంచిది.చదవడం,సంగీతం వినడం,యోగ ,వ్యాయామం లాంటివి చేస్తూ వీలైనంత ఆహ్లాదంగా,సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి.

6.పోల్చుకోవడం మానేయండి

“మా పిల్లలు త్వరగా ఎదుగుతున్నారు,చాలా తెలివైన వాళ్ళు ” లేద “మా పిల్లాడు 8నెలలకే నడవడం మొదలుపెట్టాడు”.పిల్లలను పెంచే క్రమం లో వేరే పిల్లల గురుంచి ఇలాంటి అనేక విషయాలు వింటూవుంటాం. ఈ విషయాలను మీ పిల్లలతో పోల్చుకుని బాధపడడం మంచిది కాదు ఎదుగుదల అందరి పిల్లలలో ఒకే విధంగా ఉండకపోవచ్చు .దానికి అనేక కారణాలు ఉంటాయి .మీరు గుర్తించుకోవలసింది మీ పిల్లలకు మీరు ఎంత ప్రేమ ఇవ్వగలరు అన్నది మాత్రమే.

7.బొమ్మలు

బొమ్మలు పిల్లలకు చాల ఇష్టమైనవి .పిల్లలను బొమ్మలతో ఆడుకోనివ్వడం మంచిదే .కానీ పిల్లలకు పళ్ళు వచ్చే దశలో ప్రతి వస్తువును కొరకడానికి ప్రయత్నిస్తారు .ఆ సమయంలో పిల్లలు ఆడుకోడానికి ప్రమాదకరమైన రంగుల కల బొమ్మలను వాడకూడదు..అలాగే మొబైల్,కళ్ళధ్ధాలు,కారు తాళాలు లాంటి వస్తువులను పిల్లలకు దూరంగా ఉంచి కాపాడుకోవడం మంచిది.

8.ప్రతిసారి లొంగిపోకూడదు 

పిల్లలు తమకు కావలసింది దక్కించుకోడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తారు.కావాల్సినవి అవసరమైన మేరకు ఇస్తూనే వాళ్ళని నియంత్రిచడానికి ప్రయత్నించాలి .పిల్లలు చేసే మారముకి ,ఏడ్పులకు ప్రతిసారి లొంగిపోకూడదు.ఆలా చేయడం పిల్లలను కొంచెం భాదించిన మెల్లగా అలవాటవుతారు.

9.బరువు తగ్గడం

పిల్లలు పుట్టిన తరువాత బరువు పెరగడం సహజం..దాని గురించి అతిగా భాధపడాల్సిన అవసరం లేదు.ఆ బరువు తగ్గడం అనే ప్రక్రియ చాల నిదానంగా జరుగుతుంది.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ,వీలున్నప్పుడు వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి.కాస్త ఎదిగి నడవడం మొదలుపెట్టాక పిల్లల వెనకాల తిరుగుతూ ఏలాగైనా భరువు తగ్గడం ఖాయం.

10.ఎప్పుడు మీతోనే ఉంచుకోండి

వీలునంత వరకు పిల్లలను మీతోనే వుంచుకోడానికి ప్రయత్నించండి .నిద్రపోయేటప్పుడు పిల్లలను మీకు దగ్గరగా పడుకోపెట్టుకోండి.ఆలా చేయడం ఒక అద్భుతమైన అనుభూతి.పెద్దయ్యాక పిల్లలతో అవన్నీ కోల్పోతారు .అందుకే వాళ్ళు బుజ్జాయిలుగా వున్నపుడే ఆ అందమైన అనుభూతులన్నీ పొందుపరుచుకోండి.

11.త్వరగా ఎదిగిపోతారు

 పిల్లలను ఎదిగే క్రమంలో మీ నిద్రలేని రాత్రులు,వత్తిడి,విసుగు , ఇవన్నీ మెల్లగా తగ్గిపోతాయి. మీకు కొంత భారం తగ్గినా,చిన్న చిన్న అనుభూతులకు దూరం అవుతారు.ఎప్పుడెప్పుడు ఎదుగుతారో అని అనుకునే మీరే ,ఒకసారి వాళ్ళు ఎదగడం మొదలు పెట్టాక అప్పుడే ఎదిగిపోయారా అని అనుకుంటారు.అందుకే బుజ్జి పాదాలతో మొదటి అడుగులు,ముద్దు ముద్దు తొలిపలుకులు  ఇలా ప్రతి అందమైన సందర్భాన్ని జ్ఞాపకంగా మలుచుకోడానికి ప్రయత్నించండి.

Leave a Reply

%d bloggers like this: