mee-pillalaku-roju-cheppalsina-7

మనం రోజు పిల్లలకి ఎన్నో మాటలు చెప్తుంటాము. పదే పదే ఆ మాటలు విని పిల్లలు కూడా అప్పుడప్పుడు చిరాకు పడుతుంటారు.  కొంచెం పెద్ద పిల్లలలో ఈ  ధోరణి మరింత ఎక్కువుగా కనపడుతుంటుంది. కాని మనం చెప్పడం మానగలమా? లేదు. కాబట్టి వాళ్ళకి బోర్ కొట్టకుండా షార్ట్ అండ్ స్వీట్ గా మనం  చెప్పాలనుకున్నది చెప్పాలి.

మనకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ, జాగ్రత్త వలన పిల్లలకి ఎన్నో విషయాలు చెప్పలనుకుంటాం.  కాని పిల్లలు మన ఆరాటం అర్థం చేసుకోలేరు. ఎందుకంటే, వాళ్ళు పిల్లలు కాబట్టి. ఇన్నేళ్ళ మన అనుభవంతో చెప్పే మాటలు చిన్న పిల్లలకి అర్థం కావు. కాబట్టి మనం చెప్పే మాటలు ఎంత ముఖ్యమో తెలియ చెప్పాలి. వాటి వలన కలిగే ఉపయోగాలు వివరించాలీ. వాటిని అనసరిస్తే గొప్ప వాళ్ళు ఎలా అవుతారో ఉదాహరణతో చెప్పడం మారీ మంచిది.  ఇప్పుడు రోజు పిల్లలకి చెప్పాల్సిన 7 విషయాలు తెలుసుకుందాము.

1. నీలాగ నువ్వుండు

ఒకరిని అనుకరించడం అనుసరనిచడం రెండూ తప్పే. మనకంటూ ఒక వ్యక్తిత్యం ఉండాలి. ఇది పిల్లలకి చెప్పాల్సిన చాలా ముఖ్యమైన మాట. వ్యక్తిత్వం అనేది చిన్న వయస్సు నుండి పిల్లలకి ఏర్పడడం అత్యంత అవసరం. ఇన్ని మాటలు వాళ్ళకి రోజు చెప్తే విసుకుంటారు కాబట్టి సింపుల్ గా సారాంశం అంతా గుర్తొచ్చేల “నీలాగ నువ్వుండు” అని చెప్పండి.

2. వెళ్ళగానే ఫోన్ చెయ్

ఈ మాట పిల్లలకే కాదు మనం ప్రేమించే అందరికి చెప్తాము. పిల్లలు విషయంలో మాత్రం వాళ్ళు ఒంటరిగా వెళ్తే జాగ్రత్తగా వెళ్ళారో లేదో అని భయపడుతుంటాము. వాళ్ళు వెళ్ళే లోపే ఫోన్ చేసి చేసి వారికి ఇబ్బంది పెట్టేస్తుంటాము. అలా కాకుండా వెళ్ళగానే ఫోన్ చెయ్ అని చెప్పండి. ఇంత టైం కి చేరుతాడు అని తెలుసుకొని ఆ టైం అయినా తరువాత ఫోన్ చేస్తే పిల్లలు ఇబ్బంది పడరు.

3. ఈరోజు ఎలా గడిచింది

పిల్లలకి పెద్దలకి తేడ లేకుండా ఈ మాట అడగవచ్చు. పిల్లలు రోజంతా ఏమి చేశారు, ఏమి నేర్చుకున్నారు అని కనుక్కోవడం ద్వార వాళ్ళకు మరింత విలువైన విషయాలు తెలుపవచ్చు. తప్పు చేస్తుంటే వారి నడవడదికను మార్చవచ్చు.

4. అన్నం పరబ్రహ్మ స్వరూపం

ఈ ఒక్క మాట పిల్లలు విని ఆచరించే వరకు చెప్పాలి. ఒక బియ్యపు గింజ తాయారు అవ్వాలి అని అంటే 3 నెలల సమయం పడుతుంది.ఎంతో మంది మూడు నెలలు కష్టం వలన మనము అన్నం చేసుకోగలుగుతాము. అంతేనా, బియ్యం కొనడానికి మనం ఎంత కష్టపడుతున్నాము. ఈ మాటలు అంతా ఒక రోజు పిల్లలకి వివరించండి. అర్థం చేసుకోగల్గినంత అర్థం చేసుకుంటారు. కాని, వాళ్ళు అన్నం వృధా చేయకుండా రోజు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని గుర్తు చేస్తూ ఉండండి.

5. పిల్లల ఇష్టాలు కోరికలు అడిగి కనుక్కోండి

ఈ ప్రశ్న వేయడం ప్రమాదకరమే కాని తప్పక వాళ్ళ ఇష్టాలు కోరికలు తెలుసుకోవాలి. మా బాబు అయితే చిన్నప్పుడు నిజం విమానం కావాలని పట్టు బట్టి ఏడ్చాడు. నేను పెద్దయ్యాక కొనిస్తా, ఇప్పుడు నడపలేవు అని చెప్పా.మనం తీర్చలేని కోరికలు వాళ్ళు అడుగుతారు, మనం సర్దిచెప్పాలి కాని అసలు వాళ్ళ కోరికలు ఏంటో మాత్రం తెలుసుకోకుండా ఉండకూడదు.

6. ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోవద్దు, ప్రయత్నం ఎన్ని కష్టాలు వచ్చినా ఆపకు

ఈ మాట పిల్లల జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. “నా వల్ల కాదు అని అనుకోవడం కంటే అంగవైకల్యం లేదు” అన్నాడు ఒక మహా కవి. పిల్లలకి ఒక లక్షం నిర్దేశించికోమని చెప్పండి. లక్ష్యం ఎంత పెద్దదయినా సరైన మార్గం లో ప్రయత్నిస్తే సాధించడం సులువే అని చెప్పండి. ఎన్ని ఆటంకాలు ఎదురైన ప్రయత్నం మాత్రం మాన రాదు అని వివరించాల్సిన ఆవశ్యకత యెంత అయినా ఉంది.

7. ఐ లవ్ యూ

ఈ మూడు అక్షరాలు రోజు కి ఎన్ని సార్లు పిల్లలకి చెప్పినా తక్కువే. ఉదయం లేవగానే, స్కూల్ కి ప౦పుతున్నప్పుడు, తిరిగి వచ్చినప్పుడు మరియు పడుకునే ముందు ఇలా ఎన్ని సార్లు ఈ మాట చెప్పినా బోర్ కొట్టడు పైగా ప్రేమ పెరుగుతుంది.

ఈ విషయాలు అన్నీ మీకు తెలిసినవే. మేము మా వంతుగా గుర్తు చేసాం అంతే. మీకు పిల్లల్ని పెంచడంలో సహాయం చేయడమే మా ఉద్దేశం. మీ మరియు మీ పిల్లల మంచి భవిష్యత్తే మా ఆకాంక్ష. ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: