మీ-పిల్లలకు-సరైన-డే-కేర్-ఎంచుకోడానికి-ముఖ్యమైన-సూచనలు–xyz

మీ పిల్లలకు సరైన డే కేర్ ఎంచుకోడానికి ముఖ్యమైన సూచనలు

పిల్లలు పుట్టాక తిరిగి ఉద్యోగానికి వెళ్లడం అంత సులువైన విషయంకాదు.ఆ నిర్ణయం తీసుకున్నాక మనల్ని వేదించే ముఖ్యమైన సమస్య పిల్లలను ఎవరి దగ్గర వదిలి వెళ్ళాలి అన్నదే.ఇంట్లో పెద్దలెవరు లేనప్పుడు అనేక అవకాశాలను పరిశీలించాక అందరు తల్లులు ఎంచుకునే చివరి ఎంపిక డేకేర్.కానీ ఎలాంటి డే కేర్ లో మీ పిల్లలు జాగర్తగా వుంటారు ? డేకేర్ ను ఎంచుకునే ముందు ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి?లాంటి ప్రశ్నలు మీకు కలుగుతాయి.ఎప్పుడైనా సరైన డే కేర్ కొన్ని ప్రమాణాలను పాటించాలి.అలాంటి వాటిలో ప్రధానమైనవి ….

పిల్లలు ఎవరితో సమయం గడుపుతున్నారు.

పిల్లలను డేకేర్ లో చేర్చే ముందు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.వీలైతే వాళ్ళతో మాట్లాడి,వాళ్ళు పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించాలి.వాళ్ళు పిల్లలతో ఏమాత్రం దురుసుగా ఉన్నట్టు మీకనిపించినా,ఆ డేకేర్ ని మీ జాబితాలోంచి తొలగించండి.

ఇతర తల్లితండ్రుల సలహాలు తీసుకోండి

ఏప్పుడైనా ఒక మంచి డేకేర్ గురించి ఆ ప్రాంతంలో వున్న తల్లితండ్రులకు తెలిసేవుంటుంది.మీరు డే కేర్ ను ఏంచుకునే ముందు అక్కడ పిల్లలను చేర్చిన తల్లితండ్రులతో మాట్లాడి వాళ్ళ సలహ తీసుకోండి.మీరు కూడా చూసాక అక్కడి వాతావరణం,పని తీరు మీకు నచ్చితే మీ పిల్లలను చేర్చండి.

పిల్లల భద్రత

డేకేర్ ఎంచుకునే ముందు ముఖ్యంగా ప్రాముక్యత ఇవ్వాల్సింది మీ పిల్లల భద్రత గురించి.అక్కడ పర్వేక్షణ కేమరాలు ఎప్పుడు పనిచేస్తున్నాయా?ఆట స్థలంలో ఏమైనా ప్రమాదకరమైన వస్తువులున్నాయా?ఫస్ట్ ఎయిడ్ అందుబాటులో వుందా ?అక్కడ పనిచేస్తున్న వాళ్ళు పిల్లలను జాగర్తగా పర్వేక్షిస్తున్నారా ?ఇలాంటి ప్రశ్నలకు మీకు సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చే డే కేర్ ను ఎంచుకోండి.

శుభ్రత

డేకేర్ ను ఎంచుకునే ముందు అక్కడి పరిసరాలు ,వాతావరణం పరిశుభ్రంగా వుండేటట్టు చూసుకోండి.పిల్లలు కోసం వాడుతున్న టవల్స్ ,పాత్రలు శుభ్రమైనవి వాడుతున్నారా? గమనించండి.మీరు ఎంచుకునే డేకేర్ పరిశుభ్రతా ప్రమాణాలు పాటించడం చాల అవసరం.ఎందుకంటే పరిశుభ్రత లేని చోట పిల్లలు అనారోగ్యాలకు లోనయ్యే ప్రమాదం వుంది.

ఆరోగ్యకరమైన ఆహారం

మీరు పిల్లలు విషయంలో తీసునే జాగర్తల్లో ప్రధానమైనది ఆహారం.మీరు ఎంచుకునే డేకేర్ పిల్లలుకు సరైన బలవర్ధకమైన ఆహారం అందించాలి.మీరు ఏ ఆహారం ఐతె పిల్లలకు రోజు అందిస్తారో ,ఆ ఆహారం డే కేర్ లో కూడా ఎప్పుడు తాజాగా అందుబాటులో ఉండాలి. పిల్లలకు తినిపించేటప్పుడు అక్కడి సిబ్బంది ప్రేమ పూర్వకంగా ఉంటున్నారా లేదా? గమనించండి.

వ్యక్తిగత పర్వేక్షణ

డే కేర్ లో పిల్లలకి వ్యక్తిగత పరివేక్షణ చాల అవసరం.పిల్లలు ఆడుకుంటూ ఏదైనా ప్రమాదానికి లోనయ్యే ప్రమాదముంది.అక్కడి సిబ్బంది పిల్లలందరని నిరంతరం జాగర్తగా గమనిస్తూవుండాలి .పిల్లందరిని వ్యక్తిగతంగా పర్వేక్షించేంత సిబ్బంది డే కేర్ లో ఉండాలి.

తెలివితేటలు పెంపొందించడం

పిల్లలు చిన్న వయసులో చాల చురుకుగా వుంటారు.అన్ని విషయాలను తెలుసుకోవాలనే ఉత్సాహం చూపిస్తారు.రోజులో ఎక్కువ భాగం మీ పిల్లలు డే కేర్ లోనే ఉంటారు .కాబట్టి అక్కడ పిల్లల కి ఏమి నేర్పిస్తున్నారు? అవి మీ పిల్లల తెలివి తేటలను పెంపొందించే విధంగా ఉన్నాయా లేదా ?ఎలాంటి ఆటవస్తువులు , పుస్తకాలు వాడుతున్నారు ? డే కేర్ ను ఎంచుకునేముందు ఇలాంటి విషయాల మీద శ్రద్ధ వహించండి .

Leave a Reply

%d bloggers like this: