సిజేరియన్-ఆపరేషన్-గురించి-తెలుసుకోవలసిన-5-నిజాలు–xyz

మహిళల జీవితంలో బిడ్డకు జన్మనివ్వడం తమ జీవితాన్ని మార్చేసే అనుభవం. ఆ తరువాత వారు పూర్తిగా ఒక కొత్త జీవితం లోకి అడుగుపెడతారు. కాని ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ప్రసవం గురించి అనేక రకాలుగా ఆలోచిస్తారు. డెలివరీ నార్మల్ అవుతుందా.. ఆపరేషన్ అవుతుందా.. అనే ఆందోళన చాలామందిలో ఉంటుంది.కొన్నిసార్లు సిజేరియన్ ఆపరేషన్ తప్పక జరగాల్సిన అవసరం ఏర్పడచ్చు. నార్మల్ డెలివరీ తో పోల్చుకుంటే సిజేరియన్ డెలివరీ లో 30% రిస్క్ ఎక్కువుంటుంది. ఆపరేషన్ జరిగిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తల మీద అనేక భయాలు. అనుమానాలు ఉండడం సహజం. సిజేరియన్ ఆపరేషన్ జరిగాక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన 5 విషయాలు…..

1.కొన్ని వారాలవరకు పని చేయకూడదు

నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు కోలుకోవడానికి కేవలం కొన్ని రోజులు సరిపోతాయి. కానీ సిజేరియన్ జరిగిన వాళ్ళకి కొన్ని వారాలు పట్టచ్చు. ఆ సమయంలో వాళ్ళు ఏ పని చేయలేని పరిస్థితిలో వుంటారు. అలాంటప్పుడు బలవంతంగా ఏ పని చేయడానికి ప్రయతన్నించకూడదు. వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి. కొన్నిసార్లు మీరంతట మీరు చిన్నగా కదలడానికి కూడా ఇబ్బందిగా ఉండచ్చు. అలాంటప్పుడు భారంగా కదలడానికి ప్రయత్నించకుడదు. మీతోపాటు వున్నా వాళ్ళ సహాయం తప్పకుండ తీస్కోండి.

2.బిడ్డకు పాలుపట్టడం కష్టమవుతుంది

సిజేరియన్ ఆపరేషన్ జరిగిన తల్లులు, బిడ్డకు పాలు పట్టడంలో కొంత సమస్యను ఎదురుకోవాలి. రొమ్ముల్లో పాలు పట్టడానికి కూడా కొంత ఆలస్యమవుతుంది. బిడ్డకు రొమ్ము ద్వారా పాలు తాగడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు సక్క్షన్ పద్దతిని వాడాలి. రొమ్ములోని పాలు పిండి ఏదైనా డబ్బా ద్వారా బిడ్డకు తాపించడం మంచిది. ఈ పద్దతిలో కొంత నొప్పిని భరించాల్సి ఉంటుంది.

3.కుట్లతో జాగర్తగా ఉండాలి

ఆపరేషన్ జరిగాక కొన్ని రోజుల వరకు కూర్చోడానికి ప్రయత్నించినప్పుడు కుట్లు వున్న భాగంలో నొప్పిగా ఉంటుంది. అలాంటప్పుడు బలవంతంగా ప్రయత్నించకూడదు. కుట్లనుంచి చీము రావడం జరుగుతుంది. డాక్టర్ సూచించిన యాంటిసెప్టిక్ క్రీం క్రమం తప్పకుండా వాడాలి. కొన్ని సార్లు నెలల పాటు కుట్లనుంచి చీము రావడం కొనసాగుతుంది. కుట్లు మానిపోయే సమయంలో ఆ ప్రాంతం లో కొంతకాలం పాటు దురదగా ఉంటుంది. మరీ ఇబంధికరంగా వుంటె డాక్టర్ సలహాతో ఎదైనా క్రీం వాడండి.

4.మలబద్దకం

సిజేరియన్ ఆపరేషన్ జారిగాక అందర్నీ బాధించే సమస్య మలబద్దకం. మూత్రానికి వెళ్ళేటప్పుడు మంటగా కూడా ఉంటుంది. సహజంగా కొన్ని రోజులు గడిచాక మలబద్దకం నయమవుతుంది. కాని అవసరమైతె గైనకాలజిస్ట్ సలహా తీసుకోవడానికి ఆలోచించకండి. కొన్ని నెలలు వరకు తేలికగా జీర్ణమైయ్యే ఆహారం తీసుకోండి. పీచుపదార్ధాలు ఎక్కువగా తీసుకోడానికి ప్రయత్నించండి.

5.బరువులు ఎత్తకూడదు

నార్మల్ డెలివరీ అయినా వాళ్ళు కూడా కొంత కాలం వరకు బరువులు ఎత్డకూడదు. సిజేరియన్ జరిగిన వాళ్ళు ఇంకాస్త జాగ్రత్తగా వుండాలి.ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు. వంగడం, బలవంతంగా లేవడం లాంటివి కూడా చేయకూడదు.

Leave a Reply

%d bloggers like this: