ee-7-vishayalalo-nanna-ammani-maripinch

పిల్లలను పెంచడ౦లో అమ్మకు సాటి ఎవ్వరూ రారు, రాలేరు. పిల్లలు నిద్రలేచిన సమయం నుండి తిరిగి నిద్రపోయే వరకు వాళ్ళకి ఏమి కావాలో అమ్మకు మాత్రమే తెలుసు. కానీ, అమ్మ ప్రేమ వెనుక నాన్న సహాయం ఉంటుంది. అమ్మ గుండీ అయితే నాన్న దారం లాంటి వాడు. ప్రేమ అనే చొక్కా పిల్లలు ధరించాలి అంటే అమ్మ అనే గుండీ ఎంత అవసరమో నాన్న అనే దారం కూడా అంతే అవసరం. ఎన్ని చెప్పినా అమ్మ ని నాన్న ఎప్పుడూ మించలేదు కానీ మరిపించే సందర్భాలు

మాత్రం కొన్ని ఉన్నాయి. అవేంటంటే,

1. ఏనుగు ఏనుగు నల్లన

నాన్న భుజాల మీదకు ఎత్తుకొని ఆడించగలడు. పిల్లలు బాధగా ఉంటె నాన్న వెంటనే వాళ్ళని ఆనందపరచాగలడు. పిల్లలు అడ్డుకోవాలంటే నాన్న కూడా మరో పిల్లాడిలా మారిపోగలడు. జూ కి వెళ్ళినప్పుడు పిల్లలకి జంతువులు కనపడవు. పర్లేదు నాన్న భుజం మీదకి ఎత్తుకొని చూపించగలడు. పిల్లవాడికి ఏనుగు ఎక్కాలని ఉంటే నాన్న వీపు ఉంది కదా. 

ఏనుగు ఏనుగు నల్లన, ఏనుగు కొమ్ములు తెల్లన, అమ్మ మనసు చల్లన, నాన్న లేకుండా సంతోషం ఉండునా?

2. ఆడుకోవడం

నాన్న కంటే ఎవ్వరూ బాగా పిల్లలతో ఆడలేరు. ఎందుకంటే నాన్న తో ఆడిన ప్రతి సారి పిల్లలే గెలుస్తారు కాబట్టి. సహజంగానే నాన్నలో ఒక పిల్ల వాడు దాగి ఉంటాడు. అతను పిల్లలతో ఆడే అప్పుడు బయట వచేస్తాడు. పిల్లలతో సమానంగా కుప్పి గంతులు వేస్తూ ఆనందిస్తాడు.

3. హోం వర్క్

మనం చిన్నగా ఉన్నప్పుడు అమ్మ ఎంత చెప్పినా హోం వర్క్ చేయము. అదే నాన్న బైక్ శబ్దం వినగానే హోం వర్క్ రాయడానికి కూర్చుని రాసేస్తం. అంతేనా… నాన్న ఎంత అలసిపోయి ఉన్న మన౦ హోం వర్క్ చేసే సమయములో సందేహాలు తీర్చడానికి ఎల్లపుడూ సిద్దంగానే ఉంటాడు.

4. పెద్దరాయుడు

అమ్మ పిల్లల చేత ఒక పని చేయించాలి అంటే వంద సార్లు చెప్పాలి, అరిచి గీ పెట్టాలి. అదే నాన్న అయితే ఒక కనుసైగ చాలు. నాన్న ఉంటె చాలు, పిల్లలు అన్ని పనులు చక చకా చేసేస్తారు. అదేంటో, నాన్నకు ఎప్పుడు ప్రేమగా ఉండాలో ఎప్పుడు క్రమశిక్షనతో ఉండాలో భలే తెలిసిపోతుంది. పెద్దరయుడికి తీర్పు ఇవ్వడం తెలిసినట్టు. అమ్మ మాత్రం దూరంగా ఉండి ఈ విడ్డూరాన్ని మొత్తం నవ్వుతూ చూస్తుంటుంది.

5. భోజనం, నిద్ర

అమ్మ ఎంతో కస్టపడి పిల్లల ప్లేట్ నింపుతుంది. కానీ ఆ ప్లేట్ పూర్తిగా కాలి అవ్వాలి అని అంటే నాన్న పక్కన ఉండాల్సిందే. మీ బాబుకి మీరు చేసిన కాకరకాయ కూర నచ్చలేదా, వాళ్ళ నాన్నని పిలచండి, మీ బాబు లొట్టలేసుకుంటూ తింటాడు. అంతేనా, పిల్లలను నిద్రపుచడ్డం నాన్నకు వెన్నతో పెట్టిన విద్య. అబ్రకదబ్ర అంటారో, మరో కొత్త మంత్రం చదువుతారో కానీ పిల్లలను వెంటనే నిద్రలోకి పంపగలరు.

6. బెస్ట్ ఫ్రెండ్

అమ్మ ఇంట్లో లేకుంటే నాన్న బెస్ట్ ఫ్రెండ్ అయిపోతాడు. అడగన్నే ఐస్ క్రీం కొనిస్తాడు, ఆడకుండానే బొమ్మలు కొనిస్తాడు, నచ్చిన ఆహారం తినిపిస్తాడు. అదే అమ్మ అయితే ఐస్ క్రీం వద్దు జలుబు, బొమ్మలు అన్ని ఎందుకు అని ఏవేవో చెప్తుంది. అమ్మ చెప్పింది మంచి కోసమే, మరి నాన్న చేసేది? అప్పుడప్పుడు మంచిగా ఉండకపోవడమే మంచిది. ఎందుకంటే అతి సర్వత్ర వర్జయేత్… అంటే అతి మంచి కూడా మంచి కాదు అన్నమాట.

7. హీరో

ప్రతి బిడ్డకీ వాళ్ళ నాన్నే హీరో, నాన్నే ఇన్స్పిరేషన్. హీరో ఎలా అయ్యాడు. అమ్మ ఇల్లు శుభ్రం చేసే అప్పుడు ఒక బొద్దింక కనపడితే చాలు, చుట్టూ పక్కన వాళ్ళు దద్దరిల్లి పోయేలా అరుస్తుంది. ఇంట్లో వాళ్ళు అందరూ కంగారు పడతారేమో కాని నాన్న కాదు. నాన్న కూల్ గా లేచి రూమ్ లో కి వెళ్లి బొద్దింక మీసాలు పట్టుకొని బయట విసిరేసి ఇంట్లోకి వస్తాడు. కాదు, హీరో లా వస్తాడు. ఇది చిన్న ఉదాహరణ మాత్రమే, నాన్న హీరోలాంటి వారు అనడానికి. తప్పు, తప్పు, నాన్న హీరో లాంటి వారు కాదు, హీరోనే.

ఇలా పిల్లలని పెంచడంలో నాన్న పాత్ర చాలానే ఉంది. అందుకే అంటారు,  నాన్న అమ్మను మించలేడెమో కాని, అమ్మను మరిపించగలడు.

Leave a Reply

%d bloggers like this: