ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం అత్యంత అవసరం. సంవత్సరం దాటినా పిల్లలకు ఎముకలు గట్టి పడడటం, శరీరాభివ్రుద్ది మొదలవుతుంది. అందుకే వారికి ఆ వయస్సులో అత్యంత పౌస్తికరమైన ఆహారం అందించడం తల్లిద్ర౦డ్రులుగా మన ప్రధమ కర్తవ్యం. పౌస్తికాహారమే కాకుండా రుచికరమైన ఆహారం ఉంటె పిల్లలు ఇష్టం గా తింటారు.
భోజనం చేయమంటే మీ పాపా కూడా ఇలానే ఎక్స్ప్రెషన్ ఇస్తుందా?
ఎదిగే పిల్లలు అన్నం తినడానికి మారం చేస్తారు. వాళ్ళకి రుచిని పసిగట్టడం అపుడప్పుడే పూర్తిగా తెలుస్తూ ఉంటుంది. అందువలన, కొంచెం బాగాలేకపోయినా పిల్లలు తినడానికి ఇష్టపడరు. దీనిని గమనించి, పిల్లల ఎదుగుదలకి ఉపయోగ పడే 3 రుచికరమైన మరియు అద్బుతమైన ఆహార౦ కింద వివరించాము.
1. అవిస గింజలు (ఫ్లాక్స్ సీడ్స్)
అవిస గింజల యొక్క గొప్పదనం ఇప్పుడప్పుడే గుర్తించడం మొదలు పెట్టారు. ఇవి ప్రపంచంలోనే అత్యధిక ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటి. వీటి లో ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ మెదడు యొక్క చురుకుదనాన్ని పెంచుతాయి. కనుక వీటిని పిల్లల ఆహారంలో భాగం చేయడం వలన పిల్లలు తెలివితేటలకు అవధులుండవు.
2. చిలకడ దుంప (స్వీట్ పొటాటో)
చిలకడ దు౦పను చాలా మంది అంతగా పట్టించుకోరు. కాని దానిలో ఉండే పోషక విలువలు మరే దు౦పలోను ఉండవు. విటమిన్ A మరియు యాంటీ అక్సిడెంట్ విలువలు చిలకడ దుంపలో అపారముగా ఉంటాయి. విటమిన A పిల్లల కంటి చూపు మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా, చిలకడ దుంప సహజంగానే రుచిగా ఉండడంతో పిల్లలు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. చిలకడ దుంపను ఉడకపెట్టి బెల్లం పాకంలో కలఫై పిల్లలకి తినిపించవచ్చు లేదా వాటితో వేపుడు చేయవచ్చు.
3. బ్లాక్ బీన్స్
బ్లాక్ బీన్స్ లో పిల్లలకు ఎదుగుదలకు కావలసిన ప్రోటీన్లు, పీచు పదార్థం మరియు కాల్షియం విలువలు పుష్కలంగా ఉంటాయి. వీటిని పిల్లల ఆహరంలో భాగం చేస్తే గుండె జబ్బులు, అధిక కొవ్వు వంటివి దరి చేరవు. పిల్లలు అధిక కొవ్వు, గుండె జబ్బులు ఏమిటి అనుకుంటున్నారా? ఈ రోజుల్లో 6 – 7 సంవస్తరాల పిల్లలకి కూడా ఇలాంటి జబ్బులు వస్తున్నాయండి. జాగ్రత్తగా ఉండాలి.