makeup-lekunda-mukanni-kanthivantham-cheyadaniki-10

అందంగా కనిపించాలనుకోవడం అందరికి సాధారణంగా వుండే కోరిక. కానీ అందంగా కనపడటానికి మేకప్ ఒక్కటే పరిష్కారం కాదు.  కొంతసేపు ముఖానికి మేకప్ వేసుకొని అందంగా ఉన్నామనిపించినా, తర్వాత కళ లేకుండా పోతుంది. ముఖంలో ఉండే తాజాదనం, కాంతి నిజమైన సౌందర్యానికి కారణాలు.  ఈ సహజమైన లక్షణాలను కాపాడుకుంటే మేకప్ లేకుండానే అందంగా కనిపించచ్చు. అందుకోసం ఈ 10 చిట్కాలు తెలుసుకోండి.

1.తగినంత నీరు తాగడం

మీ చర్మం తాజాగా ఉండాలన్నా, చర్మం ఎల్లప్పుడూ తేమగా ఉండాలన్నా మీరు ఎక్కువగా నీళ్లు త్రాగాలి. ముఖంలో తాజాదనం కోల్పోకుండా ఉండాలంటే శరీరాన్ని ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. నీరు ఎక్కువగా తీసుకోవటం హైడ్రేటెడ్ గా ఉండటానికి గొప్ప పరిష్కారం. రోజుకు కనీసం 2 లీటర్ల  నీరు తాగాలి. అలాగే ముఖంలో చాయ ప్రకాశవంతం చేయడానికి కొబ్బరినీరును వీలున్నప్పుడల్లా ఎక్కువగా తాగుతువుండాలి.

2.ఆరోగ్యకరమైన ఆహారం

మనం తీసునే ఆహారం ముఖం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. వేపుళ్ళు ,ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, చిప్స్, లాంటి వాటిని తినడం మెల్లగా తగ్గిస్తూ పూర్తిగా మానేయడానికి ప్రయత్నించండి. విటమిన్లు, పోషకాలు, ఎక్కువగా వున్నా స్ట్రాబెర్రీస్, బ్రోకోలి, ఆకుకూరలు మరియు నిమ్మకాయ వంటి ఆహారం తీసుకోవడం వల్ల కొత్త చర్మ కణాలు ఉత్పత్తి అవుతాయి. సమతుల్యమైన ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం ద్వారా మన చర్మ సౌందర్యం పై ఎన్నో అద్బుతమైన ఫలితాలు ఉంటాయి.

3.సరైన నిద్ర

నిద్ర శరీరం లో జరిగే అన్ని క్రియలతో పాటు ముఖ సౌందర్యం పై కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖం కాంతివంతంగా, తాజాగా ఉంచుకోడానికి సరైన నిద్ర చాల అవసరం. తగినంత నిద్ర లేకపోతె చర్మం ఒత్తిడి మరియు అలసటకు గురి అవుతుంది. ఒక క్రమ పద్ధతిలో నిద్ర ఉంటె మీ చర్మం ఆరోగ్యంగాను మరియు యవ్వనంగాను ఉంటుంది. అంతే కాకుండా ముడుతలు మరియు వృద్ధాప్య ఛాయలను నిరోధిస్తుంది.

4.ఫేస్  మాస్క్

చర్మ సౌందర్యానికి ఫేస్ ప్యాక్ లు ఒక మంచి పరిష్కారం. చర్మాన్ని తేమగా ఉంచే సహజమైన ఫేస్ మాస్కుల్లో పెరుగు, పసుపు, పాలు, క్రీమ్ మరియు రోజ్ వాటర్ వంటివి బాగా సహాయపడుతాయి. ఈ ఫేస్ ప్యాక్ లు మీ చర్మాన్ని బిగువుగా చేస్తాయి. అలసిన చర్మాన్ని తిరిగి పునరుత్తేజం చేసి, ముఖంలో కాంతిని నింపుతాయి

5.ఉప్పు తగ్గించండి

అధికంగా ఉప్పు తినడం వల్ల శరీరంలో నీరు తగ్గిపోయి డీహైడ్రేషన్ కు గురిచేసి, మీ చర్మాన్నిచాలా త్వరగా పొడిబారేలా చేసి, డల్ గా మార్చుతుంది. ముఖ్యంగా మీరు అధిక ఉప్పు తినడం వల్ల కళ్ళు కూడా ఎప్పుడూ ఉబ్బినట్లు కనబడుతాయి. కాబట్టి ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించి, కళ్ళ చుట్టూ ఉబ్బును తగ్గించండి. దాంతో కళ్ళ చుట్టూ చర్మం బిగువుగా ఉండేందుకు సహాయపడుతుంది.

6.ఎక్సఫ్లోయేట్ (డెడ్ స్కిన్ సెల్స్ తొలిగించడం)

ముఖం పై డెడ్ సెల్స్ అలాగే ఉండిపోతాయి. ఎక్సఫ్లోయేట్ చేయడం, అంటే ముఖానికి స్కర్బ్ చేయడం, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది మరియు కొత్తగా ప్రకాశించే చర్మాన్ని రివీల్ చేస్తుంది. వారానికి ఒకసారి పాటించగలిగే ఒక బెస్ట్ స్కిన్ కేర్ చిట్కా ఇది.

7. సన్ స్క్రీన్  లోషన్ వాడండి

ఎండలో బయటకు వెళ్లడం తగ్గించండి. ఒకవేళ తప్పని సరి పరిస్థితుల్లో వెళ్ళవలసినప్పుడు సన్ స్క్రీన్ లోషన్ ఖచ్చితంగా వాడండి. అతి నీల లోహ కిరణాలు (UV rays) చర్మానికి హాని కలిగించకుండా సన్ స్క్రీన్ లోషన్ రక్షిస్తుంది. మార్కెట్ లో చాలా రకాల సన్ స్క్రీన్ లోషన్స్ వున్నా అన్ని అంత గొప్ప ఫలితాలను చూపించవు. ఎప్పుడైనా SPF 15 వున్న సన్ స్క్రీన్ లోషన్ వాడండి.

8.వ్యాయామం

మీ శరీరం ఎంత ఫిట్ గా ఉంటె, ముఖం అంత తాజా గా ఉంటుంది. వ్యాయామం చేసేటప్పుడు శరీరంలో వున్నా వ్యర్ధ టాక్సిన్స్ చమట రూపంలో బయటకు వెళ్లిపోతాయి. చర్మ సౌందర్యానికి ఆరోగ్యకరమైన ఆహారం తో పాటు సరైన వ్యాయామం కూడా అవసరం. వ్యాయామాన్ని తప్పకుండ మీ దినచర్యలో భాగం చేసుకోండి.

9. పండ్ల రసాలు

ఆరెంజ్, క్యారెట్, బీట్ రూట్, దానిమ్మ ఇలాంటి పండ్ల రసాలను తీసుకోవడం చర్మ సౌందర్యానికి చాలా మంచిది. ఆరెంజ్ జ్యూస్ లో ‘విటమిన్ సి’ ఎక్కువగా ఉండడం వల్ల ఇది సూర్యుని నుండి వచ్చే కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. క్యారెట్ జ్యూస్ లో ‘విటమిన్ ఏ’ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. దానిమ్మ జ్యూస్‌ను రెగ్యులర్‌గా తాగడం వల్ల గ్లోయింగ్‌ స్కిన్‌ పొందవచ్చు. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది.

10.ఎప్పుడు నవ్వుతూ వుండండి

చివరగా ఎన్ని చేసిన మీ సౌందర్యాన్ని వేయిరెట్లు పెంచేది చిన్న చిరు నవ్వు. మీ నవ్వే అన్నిటికి మించిన గొప్ప అలంకారం. మీ ముఖం లో చిన్న నవ్వు మీతో పాటు మీ చుట్టు వున్న అందర్ని సంతోష పరుస్తుంది.  అప్పుడు మీరు అందరికి అందంగా కనిపిస్తారు. అన్ని విషయాలలో వత్తిడికి లొనవకుండా  జీవితాన్ని పాజిటివ్ కోణంలో చూడడానికి ప్రయత్నించండి. ఏదిఏమైన మీ నవ్వును వదులుకోవద్దు.

Leave a Reply

%d bloggers like this: