పిల్లలు-బరువు-పెరగడానికి-కావాల్సిన-7-ఆహారాలు-xyz

పిల్లలకి ఎలాంటి ఆహారం ఇవ్వాలో అంత సులువుగా అర్థం అయ్యే విషయం కాదు. ముఖ్యంగా పసి పిల్లలకి ఎందుకంటే వారు గట్టిగా ఉండేవి పెట్టలేము, పలచగా ఉండే ఆహారంలో కావలసిన పోషకాలు ఉన్నాయో లేదో తెలీదు. ఇలాంటి సమయములో పిల్లల బరువు పెంచే ఆహారం కనుక్కోవడం మరింత కష్టం అయిపోతుంది. మీ కోసమే, పిల్లలు బరువు పెరగడానికి కావాల్సిన 7 ఆహారాలు గురించి చెప్తున్నాము. ఈ ఆహార పదార్థాలు తినడం ద్వారా పిల్లల బరువు పెరగడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

1. తల్లి పాలు

6 నెలల లోపు పిల్లలకు తప్పనిసరిగా తల్లి పాలు ఇవ్వడం శ్రేయస్కరం. తల్లి పాలు మించిన పోషక ఆహారం పిల్లలకు మరొకటి ఉండదు. తల్లి బాదం పప్పు, తృణ ధాన్యాలు, గింజలు వంటివి తినడం ద్వారా పాల నాణ్యత పెరుగుతుంది. పిల్లలకు మరింత పౌష్టికాహారం లభిస్తుంది. 6 నెలల తరువాత మీరు సెమి సాలిడ్ ఆహారం ఇవ్వడం ప్రరంభావించవచ్చు.

2. అరటి పండ్లు

అరటి పండ్లలో పొటాషియం మరియు కార్బోహైడ్రేట్స్ విలువలు అధికంగా ఉంటాయి. ఒక్క అరటి పండులోనే 100 కు పైగా కాలోరీలు ఉన్నాయంటే నమ్మగలరా. ఇవి సహజంగానే రుచిగా ఉండే కారణంగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతే కాకుండా, అరటి పండ్లు సులువుగా దొరుకుతాయి. పిల్లలకి అరటి పండును గుజ్జులా చేసి ఇవొచ్చు లేదా పాలల్లో కలిపి జ్యూస్ చేసి ఇవ్వచ్చు.

3. నెయ్యి

పిల్లల బరువు పెరగడంలో నెయ్యి ఎంతగానో సహాయం చేస్తుంది. నెయ్యిలో కొవ్వు విలవలు మరియు పోషక విలువలు అధికంగా ఉంటాయి. నెయ్యి వలన తెలివి తేటలు కూడా పెరుగుతాయి అని పరిశోధకులు చెప్తారు. కానీ కొంత మంది పిల్లలకు నెయ్యి పడదు. మొదటి సారి మీ బిడ్డకు నెయ్యి తినిపించినప్పుడు ఒంటి మీద ఎలర్జీలు వచ్చాయేమో చుడండి. వచ్చుంటే మాత్రం నెయ్యిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచండి.

4. పెరుగు

పెరుగులో కాల్షియమ్, కొవ్వు మరియు అనేక పోషకాలు నిలువ ఉంటాయి. పిల్లల బరువు పెంచడంలో పెరుగు ముఖ్య పాత్ర పోషిస్తుంది. రోజు ఆహారంలో భాగంగా పెరుగుని ఇవ్వడం ద్వారా పిల్లల బరువుతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతే కాకుండా, విరోచనాలు, అజీర్తి వంటి వాటి నుండి కూడా విముక్తి కలిగిస్తుంది.

5. కంది పప్పు

ప్రోటీన్లు, కాల్షియమ్ మరియు ఆరోగ్యకరమైన ఫాటీ ఆసిడ్స్ కంది పప్పులో పుష్కలంగా ఉంటాయి. మనం రొజూ పప్పు తింటాము కాని చిన్న పిల్లలకు కూడా మెత్తగా ఉడికి౦చి తినిపించవచ్చు.

గమనిక: పప్పును పెరుగులో కలిపితే వాటి పోషక విలువలు తగ్గుతాయి.

6. బంగాళ దుంపలు

బంగాళ దుంపల్లో అత్యధికంగా పిండి పదార్థము ఉన్న కారణంగా వీటిని తింటే పిల్లలు త్వరగా బరువు పెరుగుతారు. కాని వీటిని వేపుడు రూపంలో కాకుండా ఉడకపెట్టుకుని తింటే మంచిది. అల చేస్తే పిల్లలకు జీర్ణం సులువుగా అవుతుంది, అధిక నూనె లేకపోవడం వలన ఇతర సమస్యలు రావు.

7. వోట్స్ మరియు రాగి

వోట్స్ మరియు రాగి తక్కువ ధరలో దొరకే అత్యదిక పౌష్టికాహారం. వోట్స్ లో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది అది మలబద్దకం మరియు అజీర్తి సమస్యలు రాకుండా చేస్తుంది. అందులో ఉండే విలువలు పిల్లల బరువుని పెంచుతాయి. రాగి సంగతి చెప్పనవసరం లేదు. అందులో ఐరన్, ప్రోటీన్, పీచు పదార్థం, మరెన్నో పోషక విలువలు ఉంటాయి. పిల్లలకు రాగి తినిపిస్తే వారి శరీరం గట్టి పడుతుంది మరియు బరువు కూడా పెరుగుతారు.

Leave a Reply

%d bloggers like this: