pillalu-mi-pai-premanu-vyakthaparachadaniki-enchukune-10

మన పిల్లలు మన గురించి ఏమి ఆలోచిస్తారు? ఎంత ప్రేమిస్తారు? అని తెలుసుకోవాలనే కుతూహలం అమ్మలందరికి ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లలు మనకు  స్పందించక పోతే, వాళ్ళకి మనం అంటే ఇష్టం లేదేమో అని అనుకుంటాం. పిల్లలకు మీకు మధ్య ఏర్పడే అనుబంధం గురించి మీకు అనుమానాలు ,భయాలు ఉండచ్చు. కానీ పిల్లల్ని మీరు ఎంత ప్రేమిస్తారో వాళ్ళు మిమ్మల్ని అంతే ప్రేమిస్తారు. వ్యక్తపరిచే మార్గాలు భిన్నంగా ఉంటాయి.

1.చూపులు కలుపుతారు

మీరు పాలు పట్టించేటప్పుడు , లేదా వడిలో పడుకోపెట్టుకుని జో కొట్టేటప్పుడు. చిన్న కళ్ళతో సూటిగా మిమ్మల్నే చూస్తూవుండడం ఎప్పుడైనా గమనించారా. అది మీతో మాట్లాడడానికి వారు చేసే ప్రయత్నం. అప్పుడు మీరు మాట్లాడితే ఏదైనా కదలిక ద్వారా మీకు సమాధానం చెప్తారు.

2.నవ్వుతారు

పిల్లలు 6-8 వారాల తరువాత నవ్వడం ప్రారంభిస్తారు. మిమ్మల్ని చూసిన వెంటనే ఆ నవ్వులు ఇంకాస్త పెరుగుతాయి. మీ గుండెను కదిలించే ఈ బోసి నవ్వులన్నీ మీ పై ప్రేమను వ్యక్త పరచడమే. మీరంటే తన కిష్టమని, మీరెప్పుడు తనతోనే ఉండాలని, మీతో చెప్పడానికి ప్రయత్నించడమే.

3.గుర్తుపడతారు

కేవలం కొన్ని వారాల్లోనే పిల్లలు మిమ్మల్ని గుర్తుపడతారు. మీ ముఖాన్ని, మాటల్ని గుర్తుపెట్టుకుంటారు. మీ మాటలు వినపడిన వెంటనే మీకోసం వెతుకుతారు. ఎవరైనా ఎత్తుకున్నపుడు మీరు కనపడితే మీ దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తారు.

4.స్పందిస్తారు

మీరంటే తనకు ఇష్టం అనడానికి రుజువుగా , మీరు తన కోసం చేసే ప్రతి పనికి ఆనందంగా స్పందిస్తారు. పాలు పట్టించడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసిన వెంటనే వళ్లంతా కదుపుతారు. అది వాళ్ళు వ్యక్తపరిచే సంతోషం.

5.అందుకోవాలని ప్రయత్నిస్తారు

పిల్లలు మీ పై ప్రేమను వ్యక్త పరిచే ఇంకో మార్గం, తమ బుజ్జి చేతులు చాచి మిమ్మల్ని అందుకోడానికి ప్రయత్నిస్తారు. మీరు ఎత్తుకోవడమాన్నా, మీతో ఉండడమన్నా వాళ్ళకి చాలా ఇష్టం. తమకి ఇష్టం లేని వాళ్ళు ఎత్తుకుంటే ఏడవడం మొదలు పెడుతారు.

6.ఊ కొడుతారు

పిల్లల్ని ఎత్తుకొని ఏదైనా మాట్లాడినప్పుడు, ఊ కొడుతారు. మీరు కనిపించేంత దగ్గరగా ఉండి, వాళ్ళను గమనించక పోతే, మిమ్మలి పిలవడానికి అస్పష్టమైన శబ్దాలు చేస్తారు. మీరు వాళ్ళతో వున్నపుడు సంతోషాన్ని వ్యక్త పరచడానికి ముసిముసిగా నవ్వుతారు.

7.అనుకరిస్తారు

మీరు వాళ్లకు నచ్చారు అన్నదానికి సూచనగా, మిమ్మల్ని అనుకరిస్తారు. మీరు మాట్లాడే విధానాన్ని, మీ ముఖ కవలికల్ని, మీరు చేసే పనులను అనుకరించడానికి ప్రయత్నిస్తారు.

8.విడిచి ఉండలేరు

మీరు కాసేపు కనపడక పోయిన పిల్లలు దిగులు పెట్టుకుంటారు. మిమ్మల్ని విడిచి ఉండలేరు. ఎప్పుడు మీతోనే లేదా మీకు దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతారు. మీరు ఎత్తుకున్నపుడు సరదాకైనా సరే ఎవరైనా వాళ్ళని మీ దగ్గర్నుంచి తీసుకోడానికి ప్రయత్నిస్తే బిగ్గరగా ఏడుస్తారు.

9. ముద్దులు పెడుతారు

కొంచెం ఎదిగాక మీ పై వాళ్ళు దాచుకున్న ప్రేమనంతా వ్యక్త పరచడానికి, బుల్లి పేదాలతో మిమ్మల్ని ముద్దులతో ముంచెత్తుతారు. మీరు కూడా మీ ప్రేమను దాచుకోవద్దు. మీరు మిమ్మల్ని ముద్దు పెట్టుకోవడం మీ మధ్య ఆత్మీయతను పెంచుతుంది. ఇది చదివేటప్పుడు మీ చిట్టితల్లులు మీ పక్కనే ఉంటె ముద్దుపెట్టుకోండి.

10.మీ దగ్గరకు వచేస్తారు

పిల్లలు దొగాడడం మొదలు పెట్టాక,  ఎక్కడికంటే  అక్కడికి వెళ్ళిపోడానికి ప్రయత్నిస్తారు. ఇల్లు మొత్తం తిరుగుతారు. కానీ మీరు పిలవగానే ఎక్కడున్నా మీ దగ్గరకు వచ్చేస్తారు. అది వాళ్ళు మీ పై చూపించే ప్రేమ.

Leave a Reply

%d bloggers like this: