sisuvu-garbhamlo-unappudu-chesa-12-adbutha

అమ్మ కడుపులో అత్యంత హాయి గా పెరుగుతున్న శిశువు ఏమి చేస్తుంటుంది? ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటుందా? లేదు.గర్భంలో ఉనప్పుడు పిల్లలు చేసే  పనులు తెలుసుకుంటే కచ్చితంగా ఆశ్చరానికి మరియు ఆనందానికి లోనవుతారు. అవేంటో తెలుసుకుందాం పందండి.

1. మీరు తుమ్మితే శిశువు ఉలిక్కిపదుతుంది

మీకు తెలుసా తుమ్మితే గర్భంలో ఉన్న బిడ్డ భయపడుతాడు అని? తెలీదు కదా. నిజమండి, ఏదైన పెద్ద శబ్దం విన్నా, దగ్గరగా కుక్క అరిచినా గర్భంలో బిడ్డ ఉలిక్కిపదుతుంది. గమ్మతుగా ఉంది కదా!

2. బటను వేలు నోట్లో పెట్టుకోవడం (భంగి)

ఈ భూమి మీదకు రాక ముందే బిడ్డ ఒక పని నేర్చుకునేశాడు చూసారా. అవును, గర్భంలో ఉనప్పుడే పిల్లలు నోట్లో వేలు పెట్టుకుని సప్పరిస్తారు. ఒక సారి దీనిని ఊహించుకోండి. భలే ఉంది కదా.

3. ఎక్కిళ్ళు కూడా వస్తాయి

కడుపుతో ఉన్న వారి కడుపు అప్పుడప్పుడు కదిలినట్టు అనిపిస్తుంది. కారణం మీకు పుట్టబోయే బాబుకి/పాపకి ఎక్కిళ్ళు రావడం. మీరు తలుచుకోవడం వలనేమో మరి బిడ్డకు ఎక్కిళ్ళు వస్తున్నాయి. బాగుంది కదా.

4. దుర్వాసనకు దూరం

త్రిమాసకం ముగిసేసరికి శిశువునకు వాసన తెలుస్తుంది. దుర్వాసన వలన కొంచెం ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతాడు. ఎంత విచిత్రంగా ఉంది కదా. అందుకే కడుపుతో ఉంటె చెడు వాసనకు దూరంగా ఉండండి లేదంటే మీ బిడ్డ బయట వచ్చాక మీ సంగతి చెప్తాడు.

5. ఆవలించడం. గర్భంలో ఉండి ఉండి బోర్ కొడుతుందేమో

పిల్లలు ఆవలించడమే చాలా అందంగా ఉంటుంది, అలంటిడి గర్భంలో ఆవలించడం ఇంక ఎంత చూడముచ్చటగా ఉంటుందో ఊహించుకోండి. పాపం, గర్భంలో ఉండి ఉండి బోర్ కొట్టి ఆవలింతలు కూడా వస్తున్నాయి.

6. కలలు కంటారు

పరిశోధకులు పూర్తిగా నిర్దారించా లేదు కానీ, గర్భంలో పిల్లల కంటి రెప్పలు పదే పదే ఆడించడం గమనించి, వారు కలలు కంటున్నరేమో అని అభిప్రాయపడుతున్నారు. కాని, నాకో సందేహం. అసలు ఏమి తెలీని వాళ్ళు దేని గురించి కలలు కంటారబ్బా… మీకు తెలుసా? గెస్ చేయండి. కామెంట్ చేయండి.

7. రుచికరమైన ఆహారాన్నే తింటారు

15 వారల వయస్సు గల శిశువు రుచికరమైన ఆహారాన్ని ఎక్కువగా స్వీకరిస్తాడంట. తీపి పదార్థాలు అయితే ఎక్కువ, చేదు, పిల్లవి తక్కువ స్వీకరిస్తాడ౦ట. కాబట్టి, మహిళలు మీకు నచ్చే ఆహారమే కాకుండా పుట్టబోయే పిల్లలకు నచ్చే ఆహారం కూడా తినండి మరి.

8. కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉంటాడు.

గర్భం దాల్చిన 28 వారాలకు మీకు పుట్టబోయే బిడ్డ మొట్టమొదటి సారి గర్భంలో కళ్ళు తెరుస్తాడు. ఇంకా గమత్తు ఏంటో తెలుసా, శిశువు మీ అంటే కడుపు మీద లైట్ పడితే పక్కకి జరగడానికి అనట్టు కొంచెం కదులుతాడు అంట.

9. పుట్టాక బెడ్ మీదే కాదు గర్భంలో ఉనప్పుడు కూడా పాస్ పోసేస్తాడు

మొదటి త్రిమాసికం పూర్తయ్యే సరికి శిశువులో పాస్ తాయారు అవడం మొదలవుతుంది. పాపం, బయట వచ్చే వరకు ఆగలేడు కదా అందుకే లోపల పోసేసాడు. హాహా…

10. చిరు నవ్వు

పుట్ట బోయే పిల్లల మనం చిరునవ్వు కోసం ఎంతగా ఎదురు చూస్తూ ఉంటాం. అందుకే, మనకు మంచి చిరునవ్వుని చూపించాలి అని కడుపులోనే ప్రాక్టీసు చేస్తారు. అవునండి, కడుపులో ఉనప్పుడు శిశువు చిరునవ్వులు కూడా చిందిస్తుంది.

11. మీ మాటలు వింటూ ఉంటారు

గర్భం చివరి రోజుల్లో శిశువు మీ మాటలు వింటూ ఉంటారు. వారికి అర్థం కాదు కాని అత్యంత శ్రద్ద తో వింటూ ఉంటారంట.

12. ఏడుస్తారు కూడా

ఈ విషయం మీకు అంతగా నచ్చకపోవచ్చు కానీ శిశువు భూమి మీదకు రాక ముందే ఏడవడం జరుగుతుంది. సరదాగా చెప్పాలి అంటే, పిల్లలకు ఏడ్పు అనేది అతి పెద్ద ఆయుధం కదా, అందుకే దానిని బాగా నేర్చుకొని గర్భంలోనే బాగా నేర్చుకొని వస్తారు.

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: