గర్భంతో-ఉన్నపుడు-ఆరోగ్యం-కోసం-తినాల్సిన-5-ఆహారాలు–xyz

సాధారణంగా కంటే గర్భంతో వున్నపుడు తీసుకునే ఆహారం విషయంలో ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. గర్భం ధరించిన తర్వాత కడుపులో పెరిగే బిడ్డతో సహా, తల్లికి కూడా అనేక రకాల విటమిన్స్ పోషకాలతో కూడిన ఆహారం అవసరం ఉంటుంది. మీరు తీసుకునే ఆహారం కడుపులో శిశువు పెరుగుదల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి విటమిన్లు, అధిక పోషక విలువలు వున్న ఆహారాన్ని మీ డైట్ లో చేర్చుకోవాలి. అలాంటి తప్పకుండా తినాల్సిన 5 ఆహారాలు.

తృణ ధాన్యాలు (హోల్ గ్రైన్స్)

గర్భంతో ఉన్నప్పుడు అధికంగా కార్బోహైడ్రేట్’ లు వున్న ఆహారం తీసుకోవాలి.ముఖ్యంగా ఐరన్, విటమిన్ ‘B’ కాంపెక్స్, అన్ని రకాల పోషకాలను కలిగి ఉన్న ఆహర పదార్థాలు కూడా తీసుకోవాలి. ఇవన్నీ పుష్కలంగా దొరికే ఓట్మీల్, హోల్ గ్రైన్స్, పాస్తా మరియు వీట్ బ్రెడ్’లను తినండి. గర్భంతో ఉన్న ఆడవారికి ఎక్కువ మొత్తంలో ఐరన్, ఫైబర్, ఫోలిక్ ఆసిడ్’లు చాలా అవసరం. హోల్ గ్రైన్స్ బ్రెడ్, పుష్కలమైన ఫోలిక్ ఆసిడ్, ఐరన్ ,ఫైబర్’ను కలిగివుంటాయి.

పాల ఉత్పత్తులు

చీస్, యొగ్ర్ట్, పాలలో ఎక్కువ మొత్తంలో కాల్షియం ఉంటుంది. శిశువు యొక్క ఎముకలు, దంతాలు మరియు కండరాల ఆరోగ్యం కోసం తప్పని సరిగా తగిన మొత్తంలో కాల్షియం తీసుకోవాలి. ఒకవేళ గర్భిణులు సరైన మొత్తంలో కాల్షియం తీసుకోకపోవటం వలన శిశువు, తల్లి శరీరంలో ఉండే కాల్షియం వినియోగించుకొని, భవిష్యత్తులో ‘ఒస్టియోపోరోసిస్'(osteoporosis) అనే వ్యాధి కలిగే అవకాశం ఉంది.

గుడ్లు

గుడ్లలో అధిక మొత్తంలో ప్రోటీన్’లు ఉంటాయి. వీటి వలన శరీరానికి కావలసియన అమైనో అసిడ్’లని పొందవచ్చు. గుడ్డు నుండి విటమిన్, మినరల్ మాత్రమే కాకుండా, గర్భంలో ఉండే శిశువు మెదడు అభివృద్ధికి కావలసిన ‘కోలిన్’ కూడా వీటి నుండే పొందవచ్చు. పచ్చి గుడ్లను, సరిగా ఉడకని గుడ్లను తినకూడదు.

చిలకడ దుంప

చిలకడదుంపలో బీటా కెరోటిన్(Beta-Carotene) అధికంగా ఉంటుంది. శరీరం బీటా కెరోటిన్ ను, గర్భం లో పిండం ఎదగడానికి ఉపయోగపడే విటమిన్ A గా మారుస్తుంది. రోజు 100-150 గ్రాముల చిలకడదుంప తీసుకోవడం శరీరంలో విటమిన్ A శాతాన్ని 10%-40% పెంచుతుంది. చిలకడ దుంపలో పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అరుగుదలను కూడా పెంచుతుంది. రక్తంలో చక్కర శాతాన్ని తగ్గిస్తుంది.

డ్రై ఫ్రూప్ట్స్

డ్రై ఫ్రూప్ట్స్ లో వివిధ రకాల విటమిన్లు, మినరల్స్, అధిక కెలొరీస్, ఫైబర్ ఉంటాయి. గర్భంతో ఉన్నపుడు ఎండు ద్రాక్ష, బాదాం, ఖర్జురం, పిస్తా, జీడీపప్పు రోజు ఆహారంలో తీసుకోవాలి. వీటిలో వుండే పొటాషియం, ఐరన్ ప్రసవం అప్పుడు నొప్పులు తగ్గిస్తాయి. ఎండు ద్రాక్షా, ఖర్జురం లాంటి వాటిలో చక్కర ఉంటుంది కాబట్టి మరి ఎక్కువగా కూడా తీసుకోకూడదు.

Leave a Reply

%d bloggers like this: