iap-sipharsu-meraku-india-lo-pillalaku-tappakunda-veyinchalsina

పిల్లలు పుట్టిన తరువాత వారికి సంబంధించిన అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటాం.   కానీ అన్నిటిలో ముఖ్యంగా తీసుకోవలసిన జాగ్రత్త వాక్సిన్ (టీకాలు)   వేయించడం. పుట్టినప్పటి నుండి ఎప్పటి టీకాలు అప్పుడు వేయించడం ద్వారా, డిప్తీరియా,  మంప్స్, ధనుర్వాతం (టెటానస్), పొంగు వంటి అనేక జబ్బులను రాకుండా నివారించుచ్చు. మన దేశంలో సైంటిఫిక్ కమిటీల సిఫార్సుల మేరకు, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (Indian Academy of Pediatrics-IPA), ఏయె వయసుల్లో ఎయె టీకాలు వేయించాలో సిఫార్సు చేసారు. వాటి గురించి తెలుసుకోండి.

అసలు వాక్సిన్’స్ ఎలా పని చేస్తాయి?

రోగాలకు కారణమైయ్యే సుక్ష్మ జీవిని పూర్తిగా బలహీనంగా చేసిగానీ, లేదా హనిచేయని మృత సూక్ష్మజీవినిగానీ టీకా రూపంలో ఇస్తారు. దీని వలన మన శరీరంలోని రోగ నిరోధక శక్తి వాటితో పోరాడటం ప్రారంభించే క్రమంలో కొన్ని యాంటీబాడీస్ ను తయారు చేసుకుంటుంది. ఎప్పుడైనా ప్రమాదవశాత్తు మళ్ళీ ఆ రోగ కారక సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించినప్పుడు. దాన్ని శరీరం (ఇమ్యూనలాజికల్ మెమరీ) గుర్తించి, దాంతో పోరాడి, దాని కారణంగా వచ్చే జబ్బును నివారిస్తుంది. ఇలా వాక్సిన్’స్ మనకు రక్షణ కలిగిస్తుంది.

తప్పకుండా వేయించాల్సిన టీకాలు

1.ఓరల్ పోలియో వాక్సిన్ (Oral Polio Vaccine OPV)

పిల్లలకు ఈ టీకాను ఐదేళ్ల వరకు క్రమం తప్పకుండా వేయించాలి. పక్షవాతం, కాళ్ళు వంకర పోవడం లాంటివి జరగకుండా పిల్లలను రక్షిస్తుంది. OPV ని ప్రభుత్వం ఉచితంగా పంపిని చేస్తుంది.

2.బాసిల్లస్ కాల్మెట్టే గురిన్ వాక్సిన్ (Bacillus Calmette Guerin Vaccine,BCG)

ఈ టీకా వేయించడం ద్వారా క్షయ వ్యాధిని నిరోధించే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఐదేళ్ల వరకు పిల్లలకు క్రమం తప్పకుండా ఈ టీకా వేయిస్తే పదిహేనేళ్ల వరకు రోగ నిరోధక శక్తిని అందిస్తుంది.

3.మిజల్స్ మంప్స్ రుబెల్లా వాక్సిన్ (Measles Mumps Rubella Vaccine,MMR)

పిల్లలు పుట్టిన 9 నెలలకి ఫస్ట్ డోస్ వేయించాలి, తరువాత మొదటి సంవత్సరం నిండిన 3 నెలల లోపు సెకండ్ డోస్ వేయించాలి. ఈ టీకా కొన్ని రకాల భయంకరమైన వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

4.డైఫ్ తిరియా టెటానస్ పెర్టుసిస్ వాక్సిన్ (Diphtheria Tetanus Pertussis Vaccine,DPT)

ఈ టీకాను మొదటి సంవత్సరం తరువాత 5 నెలల లోపు వేయించడం మొదలుపెట్టి పది సంవత్సరాలు వచ్చేంతవరకు వేయించాలి. ఈ టీకా కొన్ని ప్రాణాంతకమైన జబ్బులను నివారిస్తుంది.

5.రోటా వైరస్ (Rotavirus)

పిల్లలకు ఆరు నెలలు వచ్చే లోపు ఈ వాక్సిన్ వేయించాలి. ఈ వాక్సిన్ పిల్లలకు అతిసార వ్యాధి రాకుండా నివారిస్తుంది.

6.హెపటైటిస్ బి వాక్సిన్ (Hepatitis B Vaccine)

అప్పుడే పుటిన పిల్లలలో కాలేయ సంబంధిత వ్యాధులు రాకుండా నివారిస్తుంది.  ఈ టీకాను పిల్లలు పుట్టిన వెంటనే వేయించాలి.

 పిల్లలకు వాక్సిన్ వేయించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1.ఒక్కసారి వాక్సిన్ వేయించడం మొదలు పెట్టాక క్రమం తప్పకుండా వేయించాలి.

2.ఏ రకమైన వాక్సిన్ అయనా వేయించేటప్పుడు వైద్యుల పర్వేక్షణ అవసరం.

3.ఎంత డోస్ ఎప్పుడెప్పుడు వేయించాలి అన్నది వైద్యుల సలహా మేరకే జరగాలి.

4.వాక్సిన్ వేయించిన తరువాత ఏదైనా రియాక్షన్ జరిగితే వెంటనే వైద్యులను  కలవడానికి ఆలస్యం చేయద్దు.

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: