మీరు ప్రగ్నెంట్ అని విన్నప్పటి నుండి తెలియని అనుభూతికి లోనవుతూ ఉంటారు. మీ జీవితంలో అత్యంత అనందమయ క్షణాలలో ఇది కూడా ఒకటి అవుతుంది. కడుపులోని మీబిడ్డ ప్రతి కదలికను కూడా మీరు ఆస్వాదిస్తారు. మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడం ద్వారా గర్భవతి అయ్యారో లేదో తెలుసుకోవచ్చు. మొదటి 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రగ్నెంట్ మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, కడుపులోని బిడ్డ ఎలా ఎదుగుతారో అన్న దాని గురించి మీకు పూర్తిగా తెలిసుండకపోవచ్చు. కడుపులోని బిడ్డ నెలవారీగా ఎలా ఎదుగుతారని మేము మీకు తెలియజేస్తున్నాము.
మొదటి నెల
అండంతో కలిసిన శుక్రకణం చిన్న చిన్న భాగాలుగా ఏర్పడి చెస్ట్, చేతులు, కాళ్ళు, తల లాగా మారుతాయి. అప్పటి నుండి పిండం వృత్తాకార పరిమాణంలో ఎదుగుతుంది.
రెండవ నెల
ఈనెలలో మీ బిడ్డ మూత్రపిండం తయారవుతుంది. కాబట్టి, ఈ నెలలో మీరు శక్తివంతంగా ఉంటూ మంచి ఆహారం తీసుకోవాలి.
మూడవ నెల
ఈ నెలలో బిడ్డ రెండు నుండి మూడు అంగుళాల పరిమాణం పొందుతాడు. ఈదశలో వారి వేళ్ళు, వేలిముద్రలు తయారవుతాయి. ఈ నెల నుండి మీ బాబు/పాప యొక్క గుండె కొట్టుకొనే శబ్ధాన్ని మీరు కొద్దిగా వినగలుగుతారు.
నాల్గొవ నెల
ఈనెలలో మీ యుటెరస్ భాగం పెద్దదిగా అవుతుంది దీనికి కారణం మీ బిడ్డ పరిమాణం పెరుగుతూ ఉండటమే. ఈదశలో బిడ్డ యొక్క ఎముకలు, శరీరం యొక్క ఆకారం వంటివి ఏర్పడుతాయి. మీ పొట్టలో బిడ్డ ఉన్నట్లు ఇతరులు గుర్తించగలుగుతారు. మీ బాబు/పాప 142 గ్రాముల వరకు పెరుగుతారు.
అయిదవ నేల
ఈదశలో మీ బాబు/పాప కాళ్ళు సాగడం ప్రారంభమౌతాయి దీంతో బిడ్డ 27 సెంటీమీటర్ల మేర పెరిగే అవకాశం ఉంది. మీ బాబు యొక్క కనుబొమ్మలతో పాటు, కనురెప్పలు రూపాన్ని సంతరించుకుంటాయి. ఈ నెలలో మీ బాబు/పాప కదలికలు మీకు స్పష్టంగా అర్థముతాయి.
ఆరవ నెల
ఇప్పటి వరకు మీ గర్భంలోని శిశివు ఒక రూపాన్ని పొంది ఉంటారు. ఈనెలలో మీరు అల్ట్రాసౌండ్ స్కాన్ తీసుకొని మీ బాబు/పాప రూపాన్ని మొదటిసారి చూసి ఆనందించవచ్చు.
ఏడవ నెల
ఈనెలలో మీ బాబు/పాప బరువు దాదాపుగా 600 గ్రాముల వరకు ఉండవచ్చు. మీ బిడ్డ శరీరం ఈనెలలోనే ఏర్పడుతుంది కాబట్టి మీరు శక్తివంతంగా ఉండాలి. మీ బిడ్డ కదలికలు ఈనెలలో ఎక్కువవుతాయు. మీ బిడ్డ తాకడం/తన్నడం వంటి వాటిని మీరు అస్వాదించవచ్చు.
ఎనిమిదవ నెల
8వ నేల వచ్చేసరికి మీ బిడ్డ పూర్తి మనిషి రూపాన్ని సంతరించుకొని ఉంటాడు. ఒక్కోసారి, ముందస్తు ప్రసవం వల్ల ఈనెలలోనే ప్రసవం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏవరైనా పర్యవేక్షణలో ఉండటం చాలా మంచిది. ఈనెలలో మీ బేబీ రెండు కేజీల వరకు బరువు ఉంటాడు.
తొమ్మిదవ నెల
ఈనెల వచ్చేసరికి, మీబిడ్డ పూర్తిగా తయ్యారయ్యి ఉంటాడు. మీరు ఏ సమయంలో అయినా బిడ్డకు జన్మనివ్వచ్చు. ఈ నెల ప్రారంభంలో వైద్యుని దగ్గరకు వెళ్ళి పరీక్ష చేయించుకోవడం వల్ల ప్రసవ తేదీని పొందవచ్చు. తద్వారా మీరు ముందస్తుగా ప్రిపేర్ అవ్వవచ్చు.
ఇలా మీ కడుపులోని బిడ్డ ఒక్కో నేలలో ఒక్కో విధంగా పరిణామం చెందుతుంటాడు. ఈ సమయంలో మీరు మంచి ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం వంటివి చేయడం వల్ల పంటంటి బిడ్డకు జన్మనివ్వచ్చు.