pregnancy-samayamlo-vakshojalalo-vachhe-7-bhayankaramyna

పిల్లలు పుట్టబోవడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. అయితే గర్భధారణ సమయంలో, అతి తక్కువ కాలంలో మీ శరీరంలో చాలా మార్పులు వచ్చే అవకాశం  ఉంది. ఒక్కోసారి మిమ్మల్ని మీరే నమ్మలేనంత మార్పులు కూడా సంభవించవచ్చు. మీ సున్నితమైన భాగాలలో ఒకటైన వక్షోజాలలో కూడా  భయంకరమైన మార్పులు వస్తాయి.  ఆ మార్పులు ఏవంటే,

వక్షోజాలు పెద్దగా అయ్యే అవకాశం ఉంది

మీ వక్షోజాలు సాధారణ సైజు కన్నా చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. మీరు 5-6నెలల గర్భిణిగా ఉన్నప్పుడు వక్షోజ పరిమాణం బాగా పెరగడం మీకు కనిపిస్తుంది. వక్షోజాలు పెరగడం వల్ల చర్మం సాగి అక్కడ దురద పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఎక్కువ గీరుకుంటే వక్షోజాల మీద మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది కావున గీరుకోకపోవడం మంచిది.

నల్లగా అయ్యే అవకాశం ఉంది

మీ వక్షోజాలు పెద్దగా అవ్వడమే కాక మీ నిపుల్స్ నల్లగా మారే అవకాశం ఉంది. పాప/బాబు పాలు తాగడానికి అణువుగా మీ నిపుల్స్ మారుతాయి. ఇంకో భయపెట్టే విషయం ఏమిటంటే, మీ వక్షోజాలను గమనిస్తే ఆకుపచ్చ రంగులో ఉండే నరాలు కనిపిస్తాయి. ఇలా మీకు కొత్త అనుభవాలు ఎదురవుతాయి, కాని భయపడకండి, అది సహజమే.

నిపుల్స్ దగ్గర చిన్న బుడపలు

నిపుల్స్ చుట్టూ ఉండే భాగంలో చిన్న చిన్న బుడపలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఉండే గ్రందుల వల్ల ఈ బుడపలు వస్తాయి. ఈ బుడపల నుండి ఒక రకమైన ఆయిల్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఆయిల్ బయటకు రావడం వల్ల మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికీ, ఈప్రక్రియ వల్ల మీకు ఎలాంటి ప్రమాదం జరగదు అని గుర్తించండి.

స్తనాల నుండి ఆయిల్ కారడం

ఒక జీవికి ప్రాణం పోయడమనేది సాధారణ విషయం కాదు. ఈ ప్రక్రియలో మీకు ఎన్నో కొత్త విషయాలతో పాటూ కొత్త అనుభవాలు ఎదురవుతాయి. మీరు మూడో నెల గర్భంతో ఉన్నప్పుడు మీ స్తనాల నుండి పసుపుపచ్చ రంగులో ఒక లిక్విడ్ కారుతుంది. బిడ్డ కడుపులో ఎదుగుతున్నాడని ఇదో సూచనగా బావించవచ్చు.

స్తనాలు బాగా ఇబ్బంది పడటం

ప్రగ్నెన్సీ సమయంలో మీ స్తనాలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీ స్తనాల చుట్టూ చిన్న పుళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇది పిల్లలకు పాలు ఇచ్చేవరకు ఉండవచ్చు. అప్పటి వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులను సంప్రదిస్తే వీటి కోసం మందులు కూడా ఇస్తారు.

చాతీ పరిమాణంలో హెచ్చుతగ్గులు

ప్రగ్నెన్సీ సమయంలొ, పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో మీ స్తనాల పరిమాణంలో తేడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీపాప ఎప్పుడు ఒకే స్తనం నుండి పాలు తాగడానికి ఇష్టపడవచ్చు. అలాంటి సమయంలో తక్కువ పరిమాణం ఉన్న బ్రెస్ట్ నుండి మీ పాపకు పాలు పట్టే విధంగా చర్యలు తీసుకుంటే రెండూ సమాన స్థితిలోకి వచ్చే అవకాశం ఉంది.

చాతీలో గడ్డలు

మీ స్తనాలలో గడ్డలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఈ సమస్య ఎక్కువగా మీ పాపకు సరిగ్గా పాలు పట్టించనప్పుడు వస్తుంది. కాబట్టి మీ పాప/బాబుకు కచ్చితంగా పాలు పట్టించండి. ఇలా చేయడం వల్ల మీ పాప ఆకలి తీరడమే కాక మీ ఆరోగ్యానికి కూడా మంచిది.

దీనిని బట్టి మనకు అర్థం అయింది ఏమిటంటే, తల్లి అవ్వడం లేదా మరో జీవిని సృష్టించడం అన్నది చాలా కష్టమైన పని. మీరు ఈ ప్రక్రియలో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, మీ పాప/బాబు ముఖాన్ని చూస్తే అన్నీ మర్చిపోయి ఆనందిస్తారు.

Leave a Reply

%d bloggers like this: