stretch-marks-charmapu-chaaralu-tagginchadaniki-5-suluvina

మహిళల్లో స్ట్రెచ్ మార్క్స్ (చర్మపు చారలు) అతి పెద్ద సమస్య. సాధారణంగా ప్రసవం తరువాత చాలా మంది మహిళలకు ఏర్పడుతాయి.  చర్మపు చారలు ముఖ్యంగా కడుపు మీద, భుజాల దగ్గరా, కాళ్ళ పైభాగం లో ఏర్పడుతాయి. ఇవి ఏర్పడటానికి ప్రసవం ముఖ్య కారణం కాగా, తొందర తొందరగా బరువు  తగ్గడం, వేగంగా ఎదుగుదల, ఒత్తిడి వంటివి కూడా కారణాలు కావచ్చు.

చర్మపు చారలు శరీరం మీద ఏర్పడటం మూలాన మన సౌందర్యం తగ్గిందేమో, అసహ్యంగా కనపడుతాయేమో అన్న సందేహాలు రాక మానవు. కాని,  అదృష్టం కొద్దీ వీటిని సులువుగా ఇంట్లో వాడే పదార్థాలతోనే పూర్తిగా తగ్గించుకోగలము.

1. చక్కర

సహజంగా చర్మపు చారలు తగ్గించే పదార్థాలలో చక్కర కూడా ఒకటి. చక్కరని ఆల్మండ్ ఆయిల్తో కలిపి వాడితే ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి. ఇప్పుడు ఎలా వాడలో తెలుసుకుందాము.

1. ముందుగా చక్కరని తీసుకొని, అందులో కాసింత ఆల్మండ్ ఆయిల్ మరియు రెండు చుక్కలు నిమ్మరసవేసి బాగా కలపాలి.

2. చక్కర పూర్తిగా కరిగాక స్ట్రెచ్ మార్క్స్ మీద పూయాలి. సున్నితంగా ఆ భాగాన్ని కాసేపు మర్దనా చేయాలి. కాసేపటి తరువాత ఆ ప్రదేశాన్ని కడగడం కాని స్నానం  చేయడం కాని చేయాలి.

3. ఇలా రోజు ఒక నెల పాటు చేస్తే చర్మపు చారలు దాదాపుగా కనిపించకుండా పోతాయి.

2. కలబంద (అలో వీర)

చర్మ సమస్యలను నిర్మూలించడంలో మరియు చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో అలో వీర కంటే గొప్పది లేదు అనడంలో అతిశయోక్తి కాదు. వీటి లోని సహజ గుణాలు స్ట్రెచ్ మార్క్స్ ని కూడా పూర్తిగా నిర్మూలించగలవు.

1. సహజంగా దొరికే అలో వీర గుజ్జు కాని మార్కెట్ లో దొరికే అలో వీర జెల్ ని కాని చారల మీద పూసి మృదువుగా మర్దన చేయండి. 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. లేదా

2. పావు కప్పు అలో వీర జెల్ లో విటమిన్ E క్యాప్సూల్స్, విటమిన్ A క్యాప్సూల్స్ లోని నునే వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చరలకు పూసి ఆరే అంత వరకు వేచి ఉండాలి. కాసేపటి తరువాత స్నానం చేయాలి. ఇలా రోజు ఒక నెల పాటు చేయాలి.

 గమనిక: విటమిన A మరియు విటమిన్ E క్యాప్సూల్స్ అన్ని మెడికల్ షాప్స్ లో లభిస్తాయి.

3. బంగాళ దుంప రసం

బంగాల దుంపలలో విటమిన్ C, పొటాషియం, రైబోఫ్లావిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు చర్మ కణాలను వేగంగా ఉత్తేజ పరుస్తాయి. కాబట్టి ఇవి చర్మానికి మంచిది.

1. బంగాల దుమ్పని మంద పాటి ముక్కలుగా కోయండి.

2. ఒక ముక్కను తీసుకొని చారల మీద రుద్దండి. తడి ఆరే వరకు ఉండి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి.

4. నిమ్మ రసం

స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడానికి మరొక సులువైన మార్గం ఏమిటంటే నిమ్మరస౦ పూయడం. నిమ్మరసం మొటిమలను కూడా తగ్గించగలదు. నిమ్మరంని చారాల మీద పూసి కాసేపు మర్దన చేసి కడిగేయాలి. ఇలా రోజు చేయడం ద్వార చారలు అతి తక్కువ కాలంలోనే తగ్గిపోతాయి. కీర రాసం నిమ్మ రసం తో కలిపి వాడితే మరింత ప్రయోజనం ఉంటుంది.

5. గుడ్డు లోని తెల్ల సోన

గుడ్డు లోని తెల్ల సోన చర్మానికి చాలా మంచిది. వీటిలో చర్మ కాంతికి ఉపయోగపడే అమినో ఆసిడ్స్ మరియు ప్రోటినులు ఉంటాయి కనుక చారలు తగ్గించడంలో లో ఉపయోగపడుతాయి.

1. ముందుగా చారలు ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. తరువాత వాటి మీద తెల్ల సోన రాయాలి.

2. పూర్తిగా ఆరిపోయిన తరువాత కొంచెం ఆలివ్ ఆయిల్ దాని మీద రాయాలి. 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి.

3. ఇలా రోజు చేస్తే రెండు వారాలలోనే పలితం కనిపిస్తుంది.

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: