thallithandrulu-pillalatho-kalisi-thappakunda-chudavalasina-5-goppa-telugu-cinemalu

సినిమాలను చూడడం ఎప్పుడు ఒక అనుభూతి. కానీ ఒక మంచి సినిమాను పిల్లలతో కలిసి చూడడం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది.  పిల్లలతో కలిసి చూడదగిన  మంచి తెలుగు సినిమాలు ఎమున్నాయి అని ఆలోచిస్తున్నారా?  మీరు పిల్లలతో కలిసి తప్పకుండా చూడవలసిన అలాంటి 5 గొప్ప తెలుగు సినిమాలు.

1.లిటిల్ సోల్జర్స్

“I am very good girl….” అంటూ లిటిల్ సోల్జర్స్ సినిమా లో బేబీ కావ్య చేసిన అల్లరి అందరికి గుర్తుండే ఉంటుంది. అమ్మా నానల్ను చంపిన విల్లన్ లని తమ తెలివి తేటలతో ముప్పు తిప్పలు పెట్టె అన్న చెల్లల కథే ఈ సినిమా. పాటలు కూడా పిల్లలకు నచ్చుతాయి. మీ చిన్ననాటి జ్ఞాపకాల్లో ఒకటైన ఈ  సినిమాను మీ పిల్లలకు కూడా చూపించండి.

2.సిసింద్రి

“చిన్ని కన్నా నిను చూడగా….” ఈ అద్బుతమైన పాటని ఎన్నేళ్ళైనా మర్చిపోగలమా. తనను కిడ్నాప్ చేసిన బూచాళ్లనుంచి తప్పించుకోడానికి సిసింద్రీ చేసే సాహసాలన్నీ చూసి తీరాల్సిందే. నాగార్జున తన కొడుకు అఖిల్ తో కలిసి సినిమాలో నటించడం, క్లైమాక్స్ లో ఒక పెద్ద గొరిల్లా సిసింద్రిని కాపాడడం పిల్లలకు చాలా నచ్చుతాయి.

3.అంజలి

“అంజలి..అంజలి..అంజలి..నవ్వుల పువ్వుల కుసుమాంజలి…” మీ బంగారు తల్లి నవ్వడం చూసినసినప్పుడు మీకు ఈ పాట పాడాలనిపించలేదా? మతిస్థిమితం లేని చిన్న పాప తన అన్న అక్కతో కలవడానికి ప్రయత్నించడం, సినిమా చివర్లో చనిపోవడం చిన్న పిల్లల చేత కూడా కంట తడి పెట్టిస్తుంది. మీ పిల్లల్లోని భావోద్వేగాలను కొంచెం తట్టి లేపడానికి ఈ సినిమా చూపించండి.

4.మాతృదేవోభవా

ఈ సినిమాని అప్పట్లో థియేటర్ లో చూసి ఎవడవకుండా బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఇంత విషాదాన్ని పిల్లలకు ఎందుకు చూపించాలి అని అనుకుంటున్నారా. తను చనిపోతూ పిల్లలకు భవిష్యతునివ్వడానికి ఒక అమ్మ పడే తపన, చేసే త్యాగం పిల్లలు చూడాలి. మాతృదేవో భవ అంటు దేవుడి కన్నా ముందు అమ్మను ఎందుకు పూజిస్తామో పిల్లలకు  తెలియాలి.

5.మాయాబజార్

“వివాహ భోజనంబు…వింతైన వంటకంబు…” పాట లేకుండా తెలుగు వారి భోజనం పూర్తవదు. మాయాబజార్ పేరు లేకుండా తెలుగుజాతి చరిత్ర పూర్తవదు. శశిరేఖ చేసే అల్లరి, కృష్ణుడు చూపించే చతురత, ఘటోద్గచుడు చేసే మాయ, సరదా పాటలు, సన్నివేసాలు ఇప్పటి పిల్లలకి కూడా నచ్చుతాయి. తెలువారికి మరపురాని ఈ చిత్రాన్ని, మీ చిన్నపుడు అమ్మ నాన్నలతో కలిసి చూసేవుంటారు ఇప్పుడు మీ పిల్లలతో కలసి ఇంకోసారి తప్పకచుడండి.

మీకు నచ్చితే తెలుగువారందరికి Share చేయండి…..  

Leave a Reply

%d bloggers like this: