pelli-ayina-tarvatha-mee-ammani-miss-ayye-10

పెళ్ళి అనేది చాలా గొప్ప ఫీలింగ్! కానీ చాలా మంది మహిళలు హోమ్‌సిక్ కూడా ఫీలవుతారు. తమ కుటుంబాన్ని, ఇల్లుని, వదలడంతో పాటూ తమ అమ్మను వదలడం  మరింత బాధిస్తుంది. చాలా మంది అమ్మాయిలు వాళ్ళ అమ్మ ప్రేమను తమకు పెళ్ళైన తర్వాతనే అర్థం చేసుకుంటారు. ఈ క్రింది సంధర్భాలలో పెళ్ళైన మహిళలు తమ అమ్మను మిస్ అవుతారు. అవేంటంటే,

ప్రతిదీ చెప్తూ ఉండటం

మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి పని గురించీ, మీరు ఏదైనా తప్పు చేస్తే మీ అమ్మ చెప్తూ ఉంటారు. మీరు ఇంటికి లేట్‌గా వచ్చినా, మీరు ఎక్కువ సేపు ఫోన్ వాడుతున్నా మిమ్మల్ని వారిస్తూ ఉంటారు. ఇలాంటివి ఎవరూ చెప్పనప్పుడు, మీకు పెళ్ళైన తర్వాత మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉండే అమ్మ దూరం ఆయ్యారని మీరు బాధపడతారు.

మంచి ఆహారాన్ని మిస్ అవడం

మీకు పెళ్ళి కాకముందు మీకు నచ్చిన వంటకాన్ని మీ అమ్మకు చెప్తే, వెంటనే మీకు నచ్చే విధంగా ఆ పధార్థాన్ని తయారు చేస్తారు. కానీ ఇప్పుడు మీకు ఆహారం కావాలంటే మీరే చేసుకోవాలి పైపెచ్చు మీ కుటుంభానికి కూడా ప్రిపేర్ చేయాలి. ఇలాంటి సమయాలలో కూడా మీరు మీఅమ్మను బాగా మిస్ అవుతారు.

గాసిప్స్ మిస్ అవడం

మీరు ఏ విషయాన్నైనా, ఎవరి గురించైనా స్వేచ్చగా మాట్లాడగలిగేది మీ అమ్మతోనే. మీరు చెప్పే ప్రతి విషయం కూడా ఆమె జాగ్రత్తగా వింటూ మీకు మంచి గాసిప్ పార్ట్నర్‌గా ఉంటుంది. కానీ ఇప్పుడు మీ పరిస్థితి భిన్నం. మీరు ఏవైనా పంచుకోవాలన్నా మీ చుట్టూ ఉన్నవారు అంతగా శ్రద్ధ పెట్టకపోవచ్చు.

తల్లి స్పర్శ మిస్ అవడం

మీరు ప్రతిసారీ ధైర్యంగా ఉండలేకపోవచ్చు, కొన్నిసార్లు డీలా పడిపోవచ్చు. అలాంటి సమయాలలో మీ అమ్మ కౌగలించుకోవడం, ముద్దు పెట్టడం, ధైర్యం చెప్పడం ద్వారా మీరు తొందరగా కోలుకోవచ్చు. కానీ పెళ్ళైన తర్వాత ఇలాంటివి ఉండకపోవడంతో, మీరు మీఅమ్మను మిస్ అయినట్లు ఫీలవుతారు.

మంచి వైధ్యురాలిని మిస్ అవడం

మీ ఒంట్లో ఏకాస్త బాగలేకపోయినా మీ అమ్మ వెంటనే పసిగట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా మీ రోగాన్ని నయం చేస్తుంది. మీరు నిద్రపోయే వరకు మీ పక్కనే ఉండి మీకు సపర్యలు చేస్తుంది. కానీ మీకు పెళ్ళి అయిన తర్వాత అలా చూసుకొనే వ్యక్తి లేకపోతే మీకు మీఅమ్మ గుర్తుకు వస్తుంది.

మీకు పూర్తి స్వేచ్చ ఉండకపోవడం

మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఇష్టం వచ్చిన విధంగా ఉంటారు. మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చు, మీకు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు కానీ పెళ్ళి అయిన తర్వాత మీకు మునుపటి స్వేచ్చ ఉండకపోవచ్చు.

షాపింగ్స్, సినిమాలు మిస్ అవడం

పెళ్ళి కాకముందు మీకు ఎప్పుడు సినిమాకు వెళ్ళాలనిపిస్తే మీఅమ్మను తోడు తీసుకొనే వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు మీకంటూ ఒక కొత్త లైఫ్‌స్టైల్ వచ్చేసింది. కాబట్టి మీరు మునుపటిలా షాపింగ్స్, సినిమాకు వెళ్ళడం, బయటకు వెళ్ళడం వంటి వాటిని ఎంజాయ్ చేయలేరు.

మీనిద్రను మిస్ అవడం

మీరు ఇప్పుడు అలార్మ్ పెట్టుకొని మరీ నిద్ర లేస్తుంటారు కానీ పెళ్ళి కాకముందు మీకు ఎప్పుడు లేవాలనిపిస్తే అప్పుడే లేస్తారు. మీ అమ్మ మాటే మీకు అలారంలా ఉండింటుంది. కానీ ఇప్పుడు మీ పరిస్థితి పూర్తి భిన్నం. ఇలాంటి సమయాలలో మీ అమ్మ మీకు గుర్తుకు రావచ్చు.

కాఫీ తాగుతూ చాట్ చేయడం

మీకు పెళ్ళి కాకముందు కాఫీ తాగుతూ మీ అమ్మతో  మాట్లాడి ఉంటారు . ఆ సమయంలో మీకు మీఅమ్మకు మంచి బాండ్ ఏర్పడి ఉంటుంది కానీ ఇప్పుడు మీకు అలా మాట్లాడే వ్యక్తులు లేనప్పుడు మీ అమ్మ గుర్తుకు వచ్చే అవకాశం ఉంది.

మీకు నప్పే బట్టలు గురించి చెప్పడం

మీరు ఏ కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో మీ అమ్మకు బాగా తెలుసు. ఆమె మీకు ఎలాంటి బట్టలు నప్పుతాయో కరెక్ట్‌గా చెప్పగలదు. కానీ మీకు పెళ్ళి అయిన తర్వాత అలా చేప్పేవాళ్ళు ఉండరు.

పై సంధర్భాలలో మీకు మొదటి స్నేహితురాలైన మీఅమ్మను మిస్ అయినట్లు మీరు బావిస్తారు.

Leave a Reply

%d bloggers like this: