మొదటి-ఏడాది-పిల్లల-ఎదుగుదలను-గుర్తించడానికి-అతిముఖ్యమైన-3-కొలతలు-xyz

మొదటి ఏడాది పిల్లల ఎదుగుదలను గుర్తించడానికి అతిముఖ్యమైన 3 కొలతలు 

మొదటి సంవత్సరం పిల్లలను క్లినిక్ కు తీసుకువెళ్లడం తప్పనిసరి. మీరు క్లినిక్ కు తీసుకు వెళ్ళాక డాక్టర్ పరీక్షలు చేసి పిల్లల ఎదుగుదల నార్మల్ గా ఉందా లేదా చెప్తారు. ఎదుగుదల ఎంత శాతం (percentile) ఉందొ చెప్తారు. అసలు ఎదుగుదలను  శాతాలలో (percentile) చెప్పడం అంటే ఏంటి?

మీ పిల్లల వున్న ఎత్తు, బరువును సాధారణంగా ఉండాల్సిన సగటు ఎత్తు, బరువు తో పోల్చి శాతాన్ని లెక్క కడతారు. వీటిని పోలచ్చడానికి ఎత్తు, బరువు ఛార్ట్స్ ఉంటాయి. మగ పిల్లల ఎదుగుదల ఆడ పిల్లల కన్నా త్వరగా జరుగుతుంది. అందుకె మీ పాప, బాబు కు వేరు వేరు ఛార్ట్స్ ఉంటాయి. అలా కొలిచే ముఖ్యమైన మూడు విషయాలు ఇవే.వాటి గురించి తెలుసుకోండి.

1.బరువు పెరగడం

ముందు మీరు తెలుసుకోవలసిన విషయం ఒకే వయసు పిల్లందరిలో బరువు పెరగడం ఒకే విధంగా జరగదు. మీరు మీ పిల్లలను మిగతా పిల్లల్తో పోల్చుకుని కంగారు పడిపోకండి. బరువు పెరగడం మీద భిన్నమైన అంశాలు ప్రభావం చూపిస్తాయి.

డాక్టర్లు చెప్పే లెక్కల ప్రకారం, పిల్లలు పుట్టినప్పుడు ఉన్న బరువు, నాలుగు నెలలకి రెండింతలు అవ్వాలి. మొదటి ఏడాదికి మూడింతలు అవ్వాలి. సాధారణంగా ఎక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో మొదటి సంవత్సరం, బరువు పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది, అంటే ఉండాల్సిన సగటు బరువును నిదానంగా చేరుకుంటారు. తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో పెరుగుదల రేటు ఎక్కువగా ఉంటుంది.

2.ఎత్తు

మొదటి సంవత్సరం పిల్లలలో ఎత్తు పెరిగే రేటు సగటున 10ఇంచులు ఉంటుంది. తరువాత 18 సంవత్సరాలు వరకు ఎత్తు పెరిగే రేటు 2.5 ఇంచులు మాత్రమే ఉంటుంది. తల్లి తండ్రులు, లేదా కుటుంబంలోని వారి జన్యువులను(genes) బట్టి పిల్లలు ఎత్తు పెరుగుతారు. క్లినిక్ లో ఎత్తు కొలిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు కదులుతున్నపుడు తీసుకున్న కొలతలు తప్పుగా రావచ్చు. రెండు మూడు సార్లు అయినా ప్రయత్నించి కొలతలు సరిగా తీసుకోమని చెప్పండి .

3.తల చుట్టుకొలత

పిల్లల బరువు, ఎత్తు కాకుండా ఎదుగుదలను లెక్కకట్టడానికి, డాక్టర్లు కొలిచే ఇంకో అంశం తల చుట్టూ కొలత. తలచుట్టు కొలత కొరకు చెవుల పైన తల భాగాన్ని కొలుస్తారు. మెదడు ఎదుగుదల గురించి తెలుసుకోడానికి తల చుట్టూ కొలత అవసరం. చుట్టు కొలత పెరిగే రేటు సరిగా లేకపోతే అది మెదడు సమస్యలకు సూచన. లేదా పెరిగే రేటు సాధారణం కన్నా ఎక్కువగా ఉంటె అది ప్రుర్రే ను దెబ్బతీస్తుంది. ఈ కొలత ప్రకారం డాక్టర్లు ఇచ్చే సూచనలను పాటించండి. తలచుట్టు కొలతను మొదటి సంవత్సరం మాత్రమే కొలుస్తారు. 

Leave a Reply

%d bloggers like this: