cesarean-gurinchi-meeku-andharu-cheppe-ee-4-asathyalanu-nammadhu

మీకు సిజేరియన్ జరిగింది అని ఎవరికైనా చెప్పగానే,..మిమ్మల్ని భయపెట్టే విషయాలు చాలా చెప్తారు. వాటిలో చాలా వరకు అసత్యాలే.  మీరు ఈ అసత్యాల  గురించి అలోచించి, భయపడి సమస్యను ఇంకా జటిలం చేసుకోవద్దు. సిజేరియన్ గురించి అందరూ మీకు సహజంగా చెప్పే ఈ 4 అసత్యాలను నమ్మద్దు.

1.తల్లిపాలు ఇవ్వలేరు

సిజేరియన్ జరిగిన వాళ్ళు బిడ్డకు తల్లిపాలు ఇవ్వలేరు అని మీకు ఎవరైనా చెప్తే అసలు నమ్మదు. అది అసత్యం. సిజేరియన్ అయినా,మాములు డెలివరీ అయినా 3 నుంచి 24 నెలల వరకు రొమ్ముల్లో పాల ఉత్పత్తి, పెరుగుదల ఒకే విధంగా ఉంటుంది. సిజేరియన్ అయిన వాళ్ళు పిల్లలను ఎత్తుకొని పాలు ఇచ్చేటప్పుడు గాయం అయిన చోట ఒత్తిడి వలన నొప్పిగా ఉండచ్చు. డాక్టర్ తో సంప్రదించి మీకు అనువైన ఎత్తుకునే పద్దతిని తెలుసుకోండి చాలు.

2.ఇక నార్మల్ డెలివరి జరగదు

ఇది అందరూ చెప్పే పెద్ద అసత్యం, మీరు అసలు నమ్మదు. C-section జరిగిన ఎవ్వరికైనా, రెండో సారి మాములు కాన్పు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది సిజేరియన్ అయిన మహిళలను నార్మల్ డెలివరీ కోసం టెస్ట్ చేసినప్పుడు 60%-80% మందికి నార్మల్ డెలివరీ జరిగే అవకాసం వుంది అని తేలింది. సిజేరియన్ తరువాత నార్మల్ డెలివరీ జరగడాన్ని VBAC (Vaginal Birth After Cesarean) అంటారు. సిజేరియన్ తరువాత నార్మల్ డెలివరీ జరుగుతుందా లేదా? అని తెలుసుకునే పద్దతిని TOLAC (Trail Of Labour After Cesarean) అని అంటారు .

3.త్వరగా రికవర్ అయిపోతారు

నార్మల్ డెలివరీ జరిగిన వాళ్ళ లాగే మీరు కూడా త్వరగా రికవర్ అయిపోతారు అని ఎవరైనా చెప్తే నమ్మదు. అలా జరగడం మంచిదే అయినా, అలా జరగదు అది అసత్యం. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు 4-5 రోజులు ఆసుపత్రి లో ఉంటె చాలు. తర్వాత 3-4 వారాలలో రికవరీ అయిపోతారు. కానీ సిజేరియన్ జరిగిన వాళ్ళ విషయంలో కోలుకునే సమయం కొన్ని వారాలు ఎక్కువ ఉండచ్చు. కొంచెం ఓపిక తో నిదానంగా ఉండండి. తొందరపడి బరువైన, కష్టమైన పనులు చేయద్దు.

5.సిజేరియన్ తో పురిటినొప్పులు తప్పించుకోవచ్చు

ఈ మధ్య చాలా మంది పురిటి నొప్పులు ఉండవని, లేదా తము అనుకున్న మూర్తంలోనో, రోజులోనో పిల్లలు పుట్టాలని, అవసరం లేకున్నా సిజేరియన్ చేయించుకుంటున్నారు. ఇది చాల మూర్ఖమైన ఆలోచన. ఎప్పుడైనా నార్మల్ డెలివరీ తరువాత పెద్ద సమస్యలు ఏమి ఉండవు. కానీ సిజేరియన్ లో అనేక సమస్యలు ఉంటాయి, కోలుకోవడానికి సమయం కూడా ఎక్కువ. తప్పని సరి పరిస్థితిలో తప్ప సిజేరియన్ కి N O చెప్పండి. ఎవరో చెప్పారు కదా అని నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉన్నా కూడా సిజేరియన్ చేయించుకోవద్దు.

 

Leave a Reply

%d bloggers like this: