pillalalo-food-allergyni-gurthinchadam

పసి పిల్లలకు 6 నెలల తరువాత ఘన పదార్థాలు (solid foods) తినిపించడం మొదలు పెడతాము. కానీ కొంత మంది పిల్లలకు కొన్ని రకాల ఆహారాలకు పడవు, వారికి ఎలర్జీలు వస్తుంటాయి. తల్లిదండ్రులు పిల్లలకు ఏ ఆహారం తింటే ఎలర్జీ వస్తుందో తెలుసుకోవడం అత్యంత అవసరం.  కొత్త పదార్థం ఏమి తినిపించినా పిల్లలకు పడుతుందా లేదా అని గుర్తించాలి. కానీ అసలు సమస్య ఇక్కడే వస్తుంది. చిన్న పిల్లలలో ఫుడ్ ఎలర్జీని గుర్తించడం ఎలా?

ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలకంటే ముందుగా ఫుడ్ ఎలర్జీ అంటే ఏమిటో తెలుసుకోవాలి.

ఫుడ్ ఎలర్జీ అంటే ఏమిటి?

పిల్లల్లో ఉండే రోగనిరోధక శక్తి మంచి పదార్థముని కూడా ప్రమాదకరం అనుకునప్పుడు ఎలర్జీలు వస్తాయి. అంతే కాక, రోగనిరోధక శక్తి ఇంకో సారి అలంటి పదార్థం తిన్నప్పుడు శరీరానికి ఏమి కాకుండా యాంటీ బాడీస్ ని విడుదల చేస్తుంది. దీనిని ఫుడ్ ఎలర్జీ అంటారు. కానీ ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు దీనిని అజీర్తి వలన వచ్చిందనుకుంటారు. అది నిజం కాదు. ఉదాహరణకి బిడ్డ అరటి పండు తిన్నప్పుడు ఎలర్జీ వచ్చిందనుకోండి, అందరు అజీర్తి వలన అనుకుంటారు. కానీ అది రోగనిరోధక శక్తి పొరపాటు వలన కూడా అయ్యుండచ్చు. కావున, ఇలాంటి ఎలర్జీలు వస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి. అంతేకాకుండా కొన్ని నెలల వరకు పిల్లలకు ఆ ఆహారం పెట్టకండి. ఇప్పుడు ఎలర్జీని కింది గుర్తుల ద్వారా గుర్తించవచ్చు.

గుర్తులు

1. దద్దుర్లు నోటి దగ్గర, ముక్కు చుట్టూ రావడం. అవి వ్యాపించవచ్చు కూడా.

2. గురక లేదా శ్వాస తీసుకునే అప్పుడు గుర్రు గుర్రుమని శబ్దం రావడం

3. తీవ్రమైన కడుపు నొప్పి

4. పెదాలు, కాను రెప్పలు, ముఖం కొద్దిగా ఊదడం

5. ముక్కు కారడం, కళ్ళలో నీళ్లు రావడం

6. వాంతులు, విరోచనాలు

7. గొంతు నొప్పి

8. రక్త పోటు తగ్గిపోవడం

ఎలర్జీలు మూడు రకాలు

1. వెంటనే కలిగే ఎలర్జీలు

పిల్లలకు పడనీ ఆహారం పెడితే వారికి వెంటనే అంటే ఒక గంట లోపు ఎలర్జీ లక్షణాలు బాయటపడతాయి. దద్దుర్లు నుండి తీవ్రమైన అల్లెజి వరకు వీటి లక్షణాలు ఉండచ్చు.

2. నిదానముగా తెలిసే ఎలర్జీలు

వీటిని అంత సులువుగా కనుక్కోవడానికి వీలు పడదు. ఈ రకమైన ఎలర్జీలలో లక్షణాలు ఒక రోజులో కానీ ఒక్కొక్క సారి ఒక వారంలో కానీ బయటపడతాయి.

3. తీవ్రమైన ఎలర్జీ (Anaphylaxis)

ఈ రకమైన ఎలర్జీని గురించి చాలా మంది తల్లులు భయపడుతుంటారు. రోగనిరోధక శక్తి అత్యధిక మోతాదులో హిస్టమిన్ అనే దానిని విడుదల చేయడం ద్వారా సంభవిస్తుంది. ఇది కనుక వస్తే మొత్తం శరీరం పైన ప్రభావం ఉంటుంది. అందు వలన దీనిని గుర్తించి వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్లడం మంచిది. దీనిని కనుక్కోవడానికి కొన్ని లక్షణాలు కింద చెప్పబడ్డాయి.

1. వేగంగా నాడి కొట్టుకోవడం

2. కళ్ళు తిరగడం

3. సృహ తప్పి పోవడం

4. చెమట పట్టడం

5. వాంతులు, విరోచనాలు

మంచి విషయం ఏమిటంటే తీవ్ర ఎలర్జీ ఇప్పటి వరకు చాలా తక్కువ మంది పిల్లలకు వచ్చింది. భయపడాల్సిన అవసరం లేదు కానీ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంది.

ఎలర్జీ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1. కనీసం పిల్లలు 6 నెలలు పూర్తి అయ్యేవరకు ఘణ పదార్థాలు పెట్టకండి.

2. గుడ్లు, గింజలు, పుల్లని వస్తువులు పిల్లలు పూర్తిగా ఘణ పదార్థాలు అలవాటు పడే వరకు పెట్టకండి. 

3. కొత్త పదార్ధం పెట్టిన ప్రతి సారి ఏమైనా ఎలర్జీ వచ్చిందేమో అని గమనించండి. మొదట్లో కొన్ని రోజులు ఒకొక్క పదార్థం ఒక్కసారి ఇవ్వండి. రెండు పదార్థాలు ఇస్తే దేని వలన ఎలర్జీ వస్తుందో కనుక్కోవడం కష్టం.

Leave a Reply

%d bloggers like this: