prasava-samayamlo-vennu-noppi-taggadaniki-5-margalu

 వెన్ను నొప్పి మరియు వెన్ను సమస్యలు గర్భంతో ఉన్న మహిళల్లో సర్వ సాధారణం. వెన్ను నొప్పి కలగడానికి అనేక కారణాలు అందులో ముఖ్యమైనవి హార్మోన్ సమతుల్యత కోల్పోవడం మరియు శరీరంలో కలిగే మార్పులు. ఒత్తిడి కూడా వెన్ను నొప్పికి మరో ప్రధమ కారణం. వెన్ను నొప్పి పరిష్కారాలు తెలుసుకునే ముందు కారణాలను క్షున్నంగా తెలుసుకుందాము.

కారణాలు

1. ప్రసవ సమయములో రిలాక్సిన్ అనే ఒక హార్మోన్ విడుదల అవుతుంది. అది వెన్ను పూస స్నాయువులను మరియు కండరాళ్ళను బలహీనం చేస్తుంది. అందు వలన వెన్ను నొప్పి సంభవిస్తుంది. 

2. గర్భవతిగా ఉన్నప్పుడు రెక్టస్ అబ్డోమినల్ మసుల్స్ కొంచెం ఇబ్బంది పడుతాయి. ఇలా గర్భాశయం పెరగడం వలన జరుగుతుంది. ఇలా జరగడం వలన వెన్ను మీద ఒత్తిడి పెరిగి నొప్పిగా ఉంటుంది.

3. సరైన నిద్ర లేకపోవడం లేదా నిద్రలేమి కూడా వెన్ను నొప్పికి మరో ముఖ్యమైన కారణం. గర్భంతో ఉన్నపుడు సరైన రీతిలో పడుకోలేము కనుక వెన్ను నొప్పి కల్గుతుంది.

మాకు ఈ భయకరమైన వెన్ను నొప్పి మరియు దాని వలన కలిగే ఇబ్బందులు తెలుసు. అందుకే దానిని నివారించడానికి 5 మార్గాలు మీకు తెలియ చేస్తున్నాము.

పరిష్కారాలు 

1. హీల్స్ వేసుకొని నడవకండి

ప్రసవ సమయములో శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. కావున, హీల్స్ వేసుకొని శరీరానికి ఇబ్బంది కలిగే లా చేయకండి. వీలైనంత పల్చగా, సమాంతరంగా ఉండే చెప్పులు కానీ షూస్ కానీ వేసుకోండి.

2. జనన పూర్వ యోగ (Prenatal Yoga)

యోగ అనేక రకాలుగా సహాయపడుతుంది. ఈ అపూర్వమైన యోగా ఆధునిక వైద్యులు నయం చేయలేని ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది, నివారిస్తుంది. ఇది మంచి శరీరాకృతుని పెంపొందించుకోవడానికి కూడా ఉపయోగ పడుతుంది. అంతే కాకుండా హార్మోన్ల సమతుల్యతను కూడా పెంపొందిస్తుంది. తద్వారా వెన్ను నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

3. స్క్వాట్స్ (గొంతు కూర్చోవడం)

స్క్వాట్స్ రోజు చేయాల్సిన వ్యాయామంలో ఒక భాగం. కానీ గర్భవతిగా ఉన్న వారు వంగి చేసే స్క్వాట్స్ చేయకూడదు. కాళ్ళు వంచి చేసే స్క్వాట్స్ చేయడం మంచిది. అంతే కాకుండా ఏదయినా బరువైన వస్తువుని ఎత్తుకోవాలంటే నడుము వంచకుండా కాళ్ళు వంచి ఎత్తుకోవడం మంచిది. దీని వలన వెన్ను మీద ఎక్కువ ఒత్తిడి పడదు కాబట్టి వెన్ను నొప్పిని కొంత వరకు నియంత్రించగలము.

4. నిద్రపోయే విధానము

రాత్రంతా వెన్ను మీదనే పడుకుంటే నొప్పి కలిగే అవకాశం ఉంది కాబట్టి పక్కకు వీలైనంత సేపు పడుకోవడం మంచిది. మీ శరీరంలో అధికంగా పెరిగే బరువు వలన వెల్లకిలా పడుకుంటే నడుము నొప్పి వస్తుంది. అందువలన సాధ్యమైనంత వరకు పక్కకు పడుకోవడం మంచిది. ఈ పద్దతిని ఈ రోజు నుంచే అలవాటు చేసుకోండి, ఫలితాన్ని గమనించండి.

5. ఐస్ గడ్డ

నడుము నొప్పి మరియు వెన్ను నొప్పి  అధికంగా ఉంటె ఐస్ గుడ్డతో మర్దనా చేసుకోండి. ఒక కర్చీఫ్ కానీ టవల్ లో కానీ ఐస్ గడ్డని పెట్టి సున్నితంగా వెన్నుకు మర్దన చేసుకుంటే వెంటనే నొప్పి తగ్గిపోతుంది. మర్దనా చేయడానికి మీ భర్త సహాయం తీసుకోండి, మీకు మీరుగా చేయడానికి ప్రయత్నించకండి.

Leave a Reply

%d bloggers like this: