పిల్లలకు 7 నెలలు వచ్చేసరికి వాళ్ళు ఇప్పటికే ఘణ పదార్థాలు (solid foods) తినడం ప్రారంభించివుంటారు. ఎలాంటి ఫుడ్ చార్ట్ కానీ, సలహాలు కానీ ఎప్పుడూ పూర్తిగా సరిపోవు. వీటిని ఆచరిస్తూ పిల్లల అవసరాన్ని, ఆకలిని తెలుసుకొని ఫుడ్ చార్ట్ లో మార్పులు చేసుకుంటూ ఉండాలి. అంతే కాకుండా పిల్లలను గమనించి ఎలాంటి ఆహరం అధికంగా తింటున్నారో, ఎలాంటి ఆహరం వారికి సరిపోతుందో తల్లిదండ్రులు గుర్తించాలి. ఈ ఫుడ్ చార్ట్ కేవలం ఒక ఐడియా మాత్రమే, తగిన మార్పులు చేసుకొని దీనిని పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఈ ఫుడ్ చార్ట్ ఎక్కువ శాతం మంది తల్లులు ఉపయోగపడిందని చెప్పడం తో మీకు కూడా దీనిని అందిస్తున్నాము. ఇప్పుడు రోజు వారీగా పిల్లలకు ఎలాంటి ఆహరం ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకుందాము.
సోమవారం (Monday)
పిల్లలకు తల్లి పాలు ఇవ్వడంతో రోజుని ప్రారంభించండి. టిఫిన్ సమయానికి ఆపిల్ గుజ్జు తినిపించండి, 3 గంటలు తరువాత మళ్ళీ తల్లి పాలు తాగించండి. భోజన సమయానికి రెండు మూడు స్పూన్లు రవ్వ గంజి కానీ, ఆపిల్ గుజ్జు కానీ తినిపించండి. సాయంత్రం, రాత్రి మరియు పడుకునే ముందు తల్లి పాలు తాగించండి.
మంగళవారం (Tuesday)
7 నెలల పిల్లలకి తప్పకుండ రోజు తల్లి పాలు ఇవ్వడమే మంచిది. ఘాణ పదార్థాలు ఇవ్వడం మొదలు పెట్టడంతో పిల్లలు నెమ్మదిగా తల్లి పాలను తగ్గిస్తారు. మంగళవారం పాలు ఇచ్చిన తరువాత టిఫిన్ సమయములో అరటిపండు నున్నగా నలిపి తినిపించండి. మధ్యాహ్నం రవ్వ గంజి తాగించండి. తరువాత, రోజు లగే సాయంత్రం, రాత్రి మరియు పడుకునే ముందు తల్లి పాలు తాగించండి.
బుధవారం (Wednesday)
తల్లి పాలు తాగించిన తరువాత పపాయ గుజ్జుని తినిపించాలి. బుధవారం మధ్యాహ్నం అన్నము నున్నగా గంజి లాగ తయారు చేసుకొని తినిపించండి. 7 నెలల పిల్లలకి మిగిలిన రోజంతా తల్లి పాలు తాగడం కంటే మంచి ఆప్షన్ లేదు.
గురువారం (Thursday)
ముందు రోజు లాగే తల్లి పాలు, పపాయి గుజ్జు ఉదయం ఇవ్వండి. మధ్యాహ్నం కొత్తగా రాగి గంజిని (రాగిని చిక్కగా నీళ్లలో ఉడకపెట్టినది) ఇవ్వడం మొదలు పెట్టండి. రోజు ఒకటే లాంటి ఆహరం తింటున్న బాబు నాలుకకు కొత్త రుచిని పరిచయం చేయండి. తరువాత రోజు లగే సాయంత్రం, రాత్రి మరియు పడుకునే ముందు తల్లి పాలు తాగించండి.
శుక్రవారం (Friday)
ఈ నాలుగు రోజుల ఆహారానికి పిల్లలు అలవాటు పడుతున్నారేమో గమనించండి. అలవాటు పడినట్టు అయితే ఉదయం తల్లి పాలు, పపాయ గుజ్జు తినిపించండి. మధ్యాహ్నం మెత్తగా ఉడికిన అన్నం పెసర పప్పు తో తినిపించండి. ఎప్పటి లాజె మిగిలిన రోజంతా తల్లి పాలు తగ్గించండి.
శనివారం (Saturday)
శనివారం ఉదయం గుమ్మడికాయ పాయసం తినిపించండి. గుమ్మడికాయలో ఉండే పోషక విలువలు పిల్లల ఎదుగుదలకి దోహద పడతాయి. ఎక్కువ మంది అసలు గుమ్మడి కాయను పట్టించుకోరు, కానీ అది చాలా పౌష్టికమైన ఆహారం. మధ్యాహ్నం ఆపిల్ గుజ్జు లేదా హల్వా లాగా చేసి ఇవ్వండి. రోజు పాలు ఇచ్చే టైం లో పాలు ఇవ్వడం మాత్రం మరవకండి.
ఆదివారము (Sunday)
ఉదయం టిఫిన్ కి క్యారట్ గుజ్జు మరియు భోజనానికి అరటి పండు పెట్టండి. రోజు లగే పిల్లలు లేవగానే, సాయంత్రం, రాత్రి మరియు పడుకునే ముందు తల్లి పాలు తాగించండి.
గమనిక: ఇది ఒక టైం టేబుల్ మాత్రమే. ముందుగా చెప్పినట్టు పిల్లల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని మార్చుకోవాలి. నెమ్మదిగా పిల్లలు 8 నెల పూర్తి అయ్యే సరికి మూడు పూటలు ఘణ పదార్థం తినడం ప్రారంభిస్తారు. గుజ్జుని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చదవండి. గంజి ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చదవండి.