delivery-gurinchi-meeku-evvaru-cheppani-7-kotha-vishyalu

 మీరు మొదటి సారి ప్రెగ్నన్సీతో ఉన్నారా? అయితే ముందు ముందు మిమ్మల్ని ఆశ్యర్యపరచడానికి చాలా విషయాలు ఎదురుచూస్తున్నాయి.  9 నెలలు గర్భంతో ఉండి, బిడ్డకు జన్మనివ్వడానికి చేసే డెలివరీ మీద ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు, భయాలు. అమ్మ, డాక్టర్లు, ఇరుగుపొరుగు వారు  డెలివరీ గురించి చాలా విషయాలు చెప్పుంటారు. ఎన్ని విషయాలు తెలుసుకున్న కొన్ని మిగిలే ఉంటాయి. మీకు డెలివరీ గురించి ఎవరు చెప్పని 7 విషయాలు ఏంటో చూడండి.

1.డ్యూ డేట్ (due date) ఖచ్చితం కాదు

గర్భం తో ఉన్న 9 నెలలు, రోజు మీరు ఒక్క రోజు గురించి ఆలోచిస్తుంటారు, ఎదురు చూస్తుంటారు. డ్యూ డేట్.  మీరు అనుకున్నట్టు లేదా డాక్టర్ చెప్పినట్టు డ్యూ డేట్ రోజున డెలివరీ జరగడం ఖచ్చితం కాదు. 7% మహిళల్లో అనుకున్న డ్యూ డేట్ కరెక్ట్ గా ఉండదు. మీ విషయంలో కూడా అలా జరిగితే కంగారుపడకండి. అలా జరగడం సహజం.

2.మత్తు ఇచ్చినప్పుడు పూర్తిగా స్పృహ కోల్పోరు

డెలివరీ జరిగేటప్పుడు మీకు మత్తు ఇస్తారు. ఆ మత్తు ఇచ్చే పద్దతిని ఎపిడ్యూరల్ (epidural) అంటారు. వెన్నులో ఉండే ఎపిడ్యూరల్ స్పేస్ (epidural space) లోకి సూది ద్వారా ఫ్లూయిడ్స్ ను పంపిస్తారు. అయితే అందరూ అనుకునేటట్టు మీరు పూర్తిగా స్పృహ కోల్పోరు. నడుము కింది భాగం లో స్పర్శ ఉండదు, కానీ మీకు జరిగేవి తెలుస్తూనే ఉంటాయి.

3.ఎపిడ్యూరల్ చేసిన తరువాత ఏమి తినకూడదు

ఎపిడ్యూరల్ (మత్తు ఇవ్వడం) చేసిన తరువాత డెలివరీ పూర్తి అయ్యే వరకు ఏమి తినకూడదు. ఒక వేళ ఏమైనా తింటె మత్తు ప్రభావం తగ్గిపోతుంది. అంట్టే మీకు డెలివరీ జరిగేటప్పుడు మీరు కాలీ కడుపుతో ఉండాలి. దీనికోసం ముందే సిద్ధపడి ఉండండి. డెలివరీ కోసం హాస్పిటల్ కు వెళ్లే ముందు ఆహారం తీసుకోడానికి ప్రయత్నించండి.

4.డెలివరీ జరిగేటప్పుడు విరోచనం కావచ్చు

చాలామందికి తెలిసి ఎవరికీ చెప్పని విషయం. డెలివరీ జరిగేటప్పుడు మీ పొట్టమీద ఎక్కువ వత్తిడి ఉండడం వల్ల విరోచనం జరగచ్చు. దానికోసం మీరు అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరంలేదు. అలా జరగడం అందరికి సర్వసాధారణం.

5.బిడ్డ బయటకు రావడం తో డెలివరీ పూర్తయినట్టు కాదు

 అందరూ అనుకునేటట్టు బిడ్డ బయటకు రాగానే డెలివరీ అయిపోయినట్టు కాదు. మీరు పడాల్సిన కష్టం ఇంకొంచెం వుంది. బిడ్డ బయటకు వచ్చిన తరువాత, మాయ(placenta) కూడా బయటకు రావాలి. కొందమందికి సులభంగా బయటకు వస్తుంది. కొంతమందికి కష్టం కావచ్చు.

6.బయటకు వచ్చిన బిడ్డను చూసి కంగారుపడకండి

బిడ్డ బయటకు వచ్చేట్టపుడు వేర్నిక్స్ కాసియోసా (vernix caseosa) అనే జిగట లాంటి పదార్ధం శరీరానికి మొత్తం పూతల ఉంటుంది. శిశువు కడుపులో ఉన్నపుడు హానికర ఆసిడ్స్ నుంచి ఇది రక్షిస్తుంది. బయటకు వచ్చిన వెంటనె మొత్తం జిగటతో ఉన్న బిడ్డను చూసి ఏదో అయ్యిందని భయపడకండి.

7.పిల్లల వళ్లంతా జుట్టు ఉండచ్చు

కొందరు పిల్లలు తల మీదే కాకుండా శరీరంలోని మిగతా భాగాలలో కూడా జుట్టుతో పుడుతారు. ఎదిగే కొద్ది అనవసరమైన చోట జుట్టు తగ్గిపోతుంది.మీరు  బయప డాల్సిన అవసరం లేదు 

Leave a Reply

%d bloggers like this: