ప్రెగ్నన్సీ తరువాత మన శరీరం చాలా మార్పులు, ప్రభావాలకు లోనవుతుంది. అన్నిటికన్నా మనల్ని ఎక్కువ బాధ పెట్టేది మన అందమైన జుట్టు రాలిపోవడం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని చిట్కాలు పాటించినా జుట్టు రాలిపోతూనే ఉందా? అసలు మీరు ఎలాంటి షాంపూ వాడుతున్నారు అనేది కూడా జుట్టు రాలడం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకె మీ జుట్టుకి హాని కలిగించని ఉత్తమమైన షాంపూను ఎంచుకోవాలి. అలాంటి 5 షాంపూలు మీకోసం.
1.గర్నియర్ ఫ్రూక్టీస్ లాంగ్ స్ట్రాంగ్ స్ట్రెంతేనింగ్ షాంపూ
Garnier Fructis Long Strong Strengthening Shampoo

జుట్టు బలహీనంగా ఉండడం, జుట్టు చివర్లు చిట్లిపోవడం లాంటివి జుట్టు పెరగడాన్ని పూర్తిగా ఆపేస్తాయి. మీకు ఇలాంటి సమస్యలు ఉన్నపుడు ఈ షాంపూను వాడండి. మీ జుట్టు మొత్తానికి బలాన్నిస్తుంది.
2.హిమాలయా హేర్బల్స్ ప్రోటీన్ షాంపూ
Himalaya Herbals Protein Shampoo

మీకు ప్రకృతిలో లభించే వాటితో తయారు చేసిన సహజమైన షాంపూ కావాలా? అయితే ఈ షాంపూను ఎంచుకోండి . ఎప్పుడైనా హెర్బల్ ప్రొడక్ట్స్ ఎంచుకోవడం చాలా మంచిది. ఈ షాంపూలో జుట్టు కుదుళ్లకు కావాల్సిన పోషకాలు ఉంటాయి. మీ జుట్టుకు హానికలిగించే ఏ కెమికల్స్ ఉండవు.
3. ట్రిచుప్ హీల్తి లాంగ్ స్ట్రాంగ్ హెర్బల్ హెయిర్ షాంపూ
Trichup Healthy Long Strong Herbal Hair Shampoo

ఈ షాంపూలో అలోవెరా, హెన్నా ఉంటాయి. ఇవి మీ జుట్టుకు బలాన్ని, మంచి కలర్ ని ఇస్తాయి. ఇందులో అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడుతారు. జుట్టుకు ఏ విధమైన హాని కలగదు.
4. ట్రేసమే ఐయోనిక్ స్ట్రెంత్ షాంపూ
TRESemme Ionic Strength Shampoo

ప్రపంచ వ్యాప్తంగా ప్రొఫషనల్స్ అందరూ వాడే, వాడమని చెప్పే షాంపూ. ఇందులో సలోన్ గ్రేడ్ ఐయోనిక్ కాంప్లెక్స్ (salon grade ionic complex) ఉంటుంది. ఇది మీ జుట్టుకు కలిగె ప్రతి నష్టాన్ని నివారిస్తుంది.
5. క్లినిక్ ప్లస్ స్ట్రాంగ్ అండ్ లాంగ్ హెల్త్ షాంపు
Clinic Plus Strong and Long Health Shampoo

మీరు రోజు తలస్నానం చేస్తారా ? అయితే మీరు ఈ షాంపూను ఎంచుకోవడం ఉత్తమం. ఈ షాంపూ అన్ని రకాల జుట్టు మీద పనిచేస్తుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది. జుట్టు చివర్ల వరకు వెళ్లి, మీ జుట్టుకు మంచి బలాన్ని ఇస్తుంది.