samvathsaramlopu-pillalaku-tappakunda-tinipinchalsina-adbhutamaina-9-ahar

ఏడాది వయసులోపు పిల్లలకు ఏమి తినిపించాలి? ఏమి తినిపించకూడదు? అన్నది ఎప్పుడు తల్లులు ఎదురుకునే ఒక పెద్ద సమస్య. అందరూ ఏడాదిలోపు పిల్లలకు తినిపించే ఆహారాలలో కొన్ని ప్రమాదమైనవి కూడా ఉంటాయి. కొన్ని తప్పకుండ తినిపించాల్సినవి ఉంటాయి. అలాంటి తినిపించాల్సిన 9  అద్భుతమైన ఆహారాలు ఇవే …..

1.గుడ్లు

గుడ్లలో మంచి ప్రోటీన్ లు, ఆరోగ్యకరమైన క్రొవ్వు, ఐరన్, విటమిన్ A , D , E లాంటివి పుష్కలంగా ఉంటాయి. గుడ్లలో వున్నా ఇవన్నీ ఏడాది లోపు పిల్లల కంటి చూపును అభివృద్ధి చేస్తాయి. అయితే మీ పిల్లలకు గుడ్లు తినిపించేటప్పుడు ఉడకపెట్టి, మెత్తగా చేసి పెట్టండి.

2.పండ్లు-కూరగాయలు

పండ్లు, కూరగాయలు ఏడాది లోపు పిల్లల శరీర ఎదుగుదలకు చాలా అవసరం.మీ పిల్లలు వివిధ పండ్లు, కూరగాయాలు తప్పనిసరిగా తినేట్లు చూడండి. మామిడి, అవకాడో, అరటిపళ్ళ వంటి పండ్లను గుజ్జుగా చేసి తినిపించండి, అదేవిధంగా కూరగాయలను, ఉడికించి పిల్లలకు పెట్టవచ్చు.

3.చేపలు

చేపలు, చేప నూనె పిల్లల చర్మ ఆరోగ్యానికి, మానసిక ఎదుగుదలకు చాలా ఉపయోగ పడుతాయి. ముఖ్యంగా ట్యూనా, సారడైన్, సాలమన్ లాంటి చేపలలో ఒమెగా 3, DHA లాంటి పోషక పదార్ధాలు ఉంటాయి. పిల్లలకు చేపలు తినిపించేటప్పుడు బాగా ఉడకపెట్టి, నలిపి పెట్టండి. ముల్లు పూర్తిగా తీసేసి పెట్టండి.

4.ఆకుకూరలు

ఆకుకూరల్లో ఉండే ఐరన్ పిల్లలో రక్తం పట్టడానికి చాలా అవసరం. ఆకుకూరలను బాగా ఉడకపెట్టి బజ్జి చేసి తినిపించండి. పిల్లలు ఇష్టపడకపొతె ఆకుకూరలను ఎర్రగడ్డ, వెల్లులితో కలిపి ఉడకపెట్టి తినిపించండి. ఎలాగైనా వాళ్ళు తినేలా చేయండి.

5.మొలక విత్తనాలు

బీన్స్ విత్తనాలు, మినుములు, అలసందలు, గుగ్గులు లాంటి వాటిని నానపెట్టి ఆ మొలకలను పిల్లకు తినిపించండి. వీటిలో వుండే జింక్, ఐరన్, మాంగనీస్, ఫోలేట్ లాంటి పోషకాలు పిల్లలను చురుకుగా చేస్తాయి.

6.మసాలా దినుసులు

పిల్లలకు మసాలా దినుసులు వాళ్ళ ఆహారంలో ఇవ్వడానికి మనం చాలా ఆలోచిస్తాం. కానీ మసాలా దినుసుల్లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ పిల్లలకు మేలు చేస్తాయి. మీరు ఇంట్లో వాడే మసాలా దినుసులను పిల్లలకు తినిపించే ఆహారంలో మెల్లగా అలవాటు చేయండి.

7.పాల ఉత్పత్తులు

పెరుగు, జున్ను, వెన్న లాంటి పాల ఉత్పత్తుల్లో క్యాల్షియం, మంచి క్రొవ్వులు, పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ పిల్లల ఎముకుల ఎదుగుదలకు చాలా అవసరం. పిల్లలకు 8-10 నెలల నుంచి ఇవి తినిపించడం మొదలుపెట్టండి. కొన్ని రోజుల వరకు అరుగుదలను గమనించి పాల ఉత్పత్తులు తినిపించడం కొనసాగించండి.

8.ఓట్స్

పిల్లలు 7 నెలలు వయసు దాటాక ఓట్స్ ను పిల్లల ఆహారంలో చేర్చడం చాలా అవసరం. ఫైబర్, జింక్ , మెగ్నీషియం, ఐరన్ లాంటి పోషకాలను ఓట్స్ అధికంగా కలిగి ఉంటాయి. పిల్లల అరుగుదలను పెంచుతాయి. అందుకె ఓట్స్ మీ పిల్లల ఆహారం లో భాగం చేయండి.

9.డ్రై ఫ్రూప్ట్స్
 

బాదాం, జీడీ పప్పు, పిస్తా లేదా వేరుశనగ పప్పు లాంటి వాటిని పిల్లలకు చిన్నపుడు తినిపించకపోతే. పెద్దయ్యాక అవి తిన్నప్పుడు అలెర్జీలకు గురవుతారు. అందుకె వాటిని మొదటి సంవత్సరం నుంచే పిల్లల ఆహారం లో భాగం చేయాలి.

Leave a Reply

%d bloggers like this: