cesarean-kutlu-tondaraga-nayamavadaniki-7-adbuthamina

మీకు ఈ మధ్యనే సిజేరియన్ ఆపరేషన్ జరుగుంటే కుట్లు నయమవడానికి ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుంది.  సిజేరియన్ మూలంగా లేదా సహజ ప్రసవ సమయంలో సాగడం వలన కుట్లు పడుండచ్చు. ఈ కుట్లు ప్రతి మహిళకి ఒకేలా ఉండవు, వివిధ రకాలుగా ఉంటాయి.  కానీ ఒక విషయం మాత్రం అందరికి ఒకేలా ఉంటుంది అదేంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. లేత కుట్ల మీద మనం సరైన శ్రద్ద వహించకపోతే అవి చీము పట్టి తొందరగా మానవు. ఈ సులువైన చిట్కాలు పాటించడం ద్వారా కుట్లు తొందరగా మానుతాయి.

1. బాత్రూం వెల్లాసి వచ్చినప్పుడు

రోజు బాత్రూమ్కి, పాస్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు కుట్లు బాగా ఇబ్బంది పెట్టవచ్చు. ఈ సమస్యనుండి బయట పడాలంటే, మూత్రాన్ని విలీనం (Dilute) చేయాలి. మూత్రాన్ని డైల్యూట్ చేయాలంటే కాళ్ళ మధ్యన వెచ్చని నీరు పోయండి. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఈ చిట్కా మంచి ఉపశమనం ఇస్తుంది.

2. ప్రసూత మొత్తలు 

ప్రసవం తరువాత రక్తస్రావము అత్యంత సాధారణం కాబట్టి మెటర్నిటీ ప్యాడ్స్ రోజంతా వేసుకోవాలని నిపుణులు సూచిస్తారు. ఈ సమయములో కుట్లు సున్నితంగా ఉంటాయి కనుక యోని ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అత్యంత అవసరం. ఇలా ఉంచుకోవడానికి ప్రతి నాలుగు గంటలకు ఒక సారి ప్యాడ్స్ మార్చుకోండి. సౌకర్యంగా ఉండడం కోసం పేపరు కానీ కాటన్ ప్యాడ్స్ వాడడం మంచిది.

3. ఉప్పు నీటితో స్నానం

ఉప్పు గాయం త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది. అందువలన, స్నానం చేసే సమయములో వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలుపుకొని చేయండి. గమనిక: నీటిలో ఎక్కువ ఉప్పు కలపకండి, ఎందుకంటే మీ చర్మంలో తేమ తగ్గిపోయే అవకాశం ఉంటుంది.

4. తడిగా ఉండనీయకండి

తాడిగా ఉంటె ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి కుట్లను అసలు తడిగా ఉండనీయకండి. స్నానం చేసే అప్పుడు, బాత్రూమ్ వెళ్ళినప్పుడు కచ్చితంగా తడి అవుతాయి. అందువలన వెంటనే కాటన్ తో కానీ మెత్తటి గుడ్డతో కానీ కుట్లు మీద పెట్టి నెమ్మదిగా అదమండి. పొరపాటున కూడా రుద్దకండి.

5. గాలికి ఆరనివ్వండి

ఏ గాయమైన గాలికి ఎంత ఆరితే అంత త్వరగా తగ్గుతుంది. అందువలన కుట్లని కూడా గాలికి ఆరనివ్వండి. కుదిరితే నడుము కింద మరియు కాళ్ళ మధ్యలో దిండు పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా గాలి బాగా అంది కుట్లు తొందరగా తగ్గిపోతాయి. ఈ చిట్కా ఫలితం చూశాక మీరే ఆశ్చర్యపోతారు.

6. మలబద్ధకం దరికి రానివ్వకండి

కుట్లు మీద ఎటువంటి ఒత్తిడి పడినా మంచిది కాదు. కానీ మలబద్ధకం ఉంటె అక్కడ ఒత్తిడి పడనీయకుండా ఉండలేము. కాబట్టి మలబద్ధకం దారికి రానీయకుండా చేయండి. అందుకోసం పీచు పదార్థాలు ఎక్కువుగా ఉన్న ఆహారం తీసుకోండి, వీలైనంత ఎక్కువ నీరు తాగండి.

7. కేగల్ ఎక్సెర్సైజెస్

ఈ ఎక్సెర్సైజెస్ ప్రసవ సమయంలోనే కాదు, కుట్లు మానడానికి కూడా ఉపయోగపడుతాయి. చిన్నపాటి కేగల్ ఎక్సెర్సైజెస్ చేయడం ద్వారా రక్త ప్రవాహం పెరిగి కుట్లు అత్యంత వేగంగా మానిపోతాయి. ఈ ఎక్సెర్సైజెస్ ద్వారా మూత్రం అదుపులో ఉంచుకోలేని సమస్య కూడా తగ్గుతుంది.

Leave a Reply

%d bloggers like this: