pillalu-veganga-podavu-peragadaaniki-kaavalsina-5-adbuthamin

 

మీ పిల్లలు ఆశించినంత పొడవు పెరగడం లేదు అని దిగులు చెబుతున్నారా? బాధపడాల్సిన అవసరం లేదు, ఈ కొన్ని ఆహార పదార్థాలను మీ పిల్లలకు రోజు తినిపిస్తే వాళ్ళు వేగంగా పొడవు పెరుగుతారు. పిల్లలు పొడవు పెరగడానికి అవసరమైన పోషక విలువలు ఉన్న ఆహారం తినడంతో పాటు చిన్నపాటి వ్యాయామాలు చేస్తే పెరుగుదల మరింత వేగంగా జరుగుతుంది. ఇక్కడ వ్యాయామాలు అంటే జిమ్ కి వెళ్లడం కాదు, రోజు కొంత సేపు గ్రౌండ్లో గేమ్స్ ఆడినా సరిపోతుంది. వాలీ బాల్, స్విమ్మింగ్ వంటి గేమ్స్ ఆడితే పిల్లలు పెరుగుదల గొప్పగా ఉంటుందని అంటారు.

2006 లో ప్రచురించబడిన ఒక ఆర్టికల్ ప్రకారం పిల్లల పొడవు 60 నుండి 80 శాతం వారసత్వ లక్షణాల మీద ఆధారపడితే 20 నుంచి 40 శాతం పౌష్టికరమైన ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పెరుగుదలకు కావాల్సిన పౌష్టికారమైన ఆహారం ఏమిటో తెలుసుకుందాము.

1. పాలు

పాలల్లో అధికంగా కాల్షియమ్ విలువలు ఉంటాయి. అవి ఎముకలు గట్టి పడటానికి మరియు పెరగడానికి అత్యంత అవసరం. కాల్షియమ్ మాత్రమే కాకుండా పాలల్లో విటమిన్ A మరియి అనేక ప్రోటీనులు ఉంటాయి. అవి మొత్తం శరీరం కావాల్సిన పోషకాలను అందించి పొడవు పెరిగేలా చేస్తాయి.

2. డ్రై ఫ్రూప్ట్స్

డ్రై ఫ్రూప్ట్స్ తినడం ద్వారా పిల్లల శరీరంలో పొడవు పెరగడానికి కావాల్సిన హార్మోన్లు ఉత్తేజం చెందుతాయి. అంతే కాకుండా వీటిలో ఉండే ఎమినో ఆసిడ్స్ మరియు హెల్తీ ఫ్యాట్స్ నరాలను బాగు పరచగలవు, బాల పరచగలవు. కావున పిల్లలకు బిస్కేట్లు, చాక్లేట్లు ఇవ్వడం కంటే డ్రై ఫ్రూప్ట్స్ ఇవ్వడం మంచిది. అవి రుచిగా ఉండడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి.

3. అరటి పండ్లు

అరటి పండు టిఫిన్ కి మంచి ఆహరం అని అంటారు. దీనిలోని పోటాషియం విలువలు రక్త ప్రవాహం పెంచుతాయి. అంతే కాకుండా ఎముకల మరియు వాటి నరాల పొడవును పెంచడంలో ఎంతగానో దోహద పడతాయి.

4. సోయా బీన్స్

సోయా బీన్స లో ఉండే అన్ని ప్రోటీన్లు మారె ఇతర శాఖాహార పదార్థాలలో ఉండవు. సోయా బీన్స్ లో ఉండే స్వచ్ఛమైన ప్రోటీన్లు ఎముకలు మరియు కండరాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడతాయి. శాఖాహారం వారు శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందడానికి సోయా బీన్స్ తప్పకుండా తినాలి. అంతే కాకుండా సొయా పాలు తాగడం వలన చిన్న పిల్లల మెదడు కూడా చురుకుగా మారుతుంది.

5. గుడ్లు

గుడ్లు విటమిన్ D, కాల్షియమ్, విటమిన్ B2 వంటి ఎన్నో పోషకాలకు ముఖ్యమైన ఆధారం.  ఇవి సులువుగా దొరికే మరియు అత్యంత అవసరమైన ఆహరం. గుడ్డు సోన మాత్రమే తింటే మరీ మంచిది. పిల్లలకు గుడ్డుని ఉడకపెట్టి ఇవ్వడం కానీ ఆమ్లెట్ లాగ కానీ ఇవ్వదండి. పిల్లలు ఇంకా ఇష్టంగా తినాలంటే ఫ్యాన్ కేక్స్ గుడ్డుతో తయారు చేసి ఇవ్వచ్చు.

Leave a Reply

%d bloggers like this: