prathi-bhartha-tana-bharya-gurinchi-bayataku-cheppalanukuni-cheppalekapothunna

భర్తలందరు పిల్లల గురించి, కుటుంబం గురించి, ముఖ్యంగా భార్య గురించి చాలా ఆలోచిస్తారు. చాలా చెప్పాలనుకుంటారు,, చాలా విషయాలు  మీతో పంచుకోవాలనుకుంటారు. కానీ, చెప్తే ఏమవుతుందనో, చెప్పాల్సిన సరైన సమయం కోసం వేచిచూస్తూ అసలు చెప్పాల్సిన విషయం మర్చిపోతారు. ఇక ఎప్పటికి చెప్పరు. కానీ మీరు కొంచెం మనసు పెట్టి మీ ఆయనను గమనిస్తే తన మనసులోని భావాలను అర్ధం చేసుకోవచ్చు. అలా మీ ఆయన మీకు చెప్పాలనుకుని చెప్పలేకపోతున్న 5 విషయాలు ఏంటో చుడండి.

1.ఐ లవ్ యు

ఈ మూడు పదాలు మీ ఆయన మనసులో ఎప్పుడు ఉంటాయి. దాని గురించి ఆయనకు ఏ అనుమానం ఉండదు. కానీ మగవాళ్ళు మనం అనుకున్నట్టు కాకుండా కొన్ని విషయాలలో చాలా ఇన్ సెక్యూర్ గా ఉంటారు. ఏదైనా చెప్తే ఆ మాటను నెరవేర్చగలమా అని భయపడతారు. అందుకే చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతారు. కానీ మమల్ని నమ్మండి మీ ఆయన మీకు రోజు ‘ఐ లవ్ యు’ చెప్పాలనుకుంటాడు.

2.నీ కెరీర్ ను కొనసాగించు

పెళ్లి అయినా తరువాత మీరు చాలా విషయాలలో కాంప్రమైస్ అయిపోతారు. ముఖ్యంగా కెరీర్ విషయంలో. కానీ మీరు పెళ్లి అయిన తరువాత మీ కెరీర్ ను కొనసాగించి, మీరనుకున్న లక్ష్యాలను చేరుకుంటె. మీ ఆయన సంతోషిస్తాడు. మీకు ఆ విషయం చెప్పాలనుకుంటాడు. కానీ చిన్న ఇగో అడ్డు వస్తుంటుంది.

3.నువ్వనుకున్నది తప్పకుండా సాధించు

మీరు జీవితంలో అనుకున్నది సాధించి సంతోషంగా ఉంటె మీ ఆయనకు ఆనందమే. మీ ప్రతి విజయాన్ని తన విజయంగా భావిస్తాడు. మీరు ప్రయత్నించే ప్రతి విషయంలో మీకు తోడుగా ఉండాలి అనుకుంటాడు. కానీ చెప్పలేకపోవచ్చు. ఆయన ప్రతి సారి మీరు చేయాలనుకున్న వాటి గురించి అడగడం , వివరాలు తెలుసుకోవడం. మీకు ఆ విషయాన్నీ చెప్పాలని ప్రయత్నించడమే.

4.నువ్వు ఈ ఇంటిని స్వర్గంగా మార్చేసావు

మీ ఆయన ఆఫీస్ లో, బయట ఎన్నో సమస్యలు, వత్తిడులు ఎదురుకొవలసివస్తుంది. తనకు ప్రశాంతత దొరికె ఒకే ఒక చోటు ఇల్లు. ఆ ఇంటిని మీరు చాలా కష్టపడి చక్కగా తీర్చితిద్ధి, కావలసిన వన్ని అందేటట్టు చేసి, స్వర్గంగా మార్చినందుకు. మీకు చిన్న ధ్యాంక్స్ చెప్పాలనుకుని చెప్పలేకపోతాడు.

5.నన్ను వదిలి పెట్టి పుట్టింటికి వెళ్ళిపోకు

నిజం! మీరు పుట్టింటికి వెళ్లడం మీ  ఆయనకు ఇష్టం ఉండదు. మీరు లేకుండా ఒక్కడే ఉండలేడు. మీరు తిరిగి ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తుంటాడు. మీరు వెళ్ళిపోతే మీ ఆయనకు సలహాలు, ఓదార్పు ఎవరు ఇస్తారు, ఆయనతో కలిసి సినిమాలు ఎవరు చూస్తారు,  ఇష్టమైనవి ఎవరు చేసిపెడతారు. “నువ్వు లేకుండా నేను అసలు ఎలా బతకగలను?” అని మీకు చాలా సార్లు చెప్పాలనుకుంటాడు కానీ చెప్పడు. మీరే అర్ధం చేసుకోండి.

గుర్తుపెట్టుకోండి: ఈ ప్రపంచంలో మీ ఆయనకు పూర్తి సంతోషాన్ని ఇచ్చేది మీరు మాత్రమే..

మీ ఆయనకు share చేయండి తప్పకుండా సంతోషిస్తాడు 

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: