పసిపిల్లలకు తలస్నానం చేయించడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. చాలా మందికి భయంకూడా. తలస్నానం చేయించేటప్పుడు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో అర్ధంకాదు. చాలా వరకు దానికి కారణం కళ్ళు లేదా చర్మం మంట పుట్టడం. మీరు పిల్లలకు వాడే షాంపూలో హానికరమైన కెమికల్స్ ఉంటే అలా జరుగుతుంది. అందుకే పిల్లల కోసం ఏదో ఒక షాంపూ కాకుండా, మార్కెట్లో పిల్లల కోసమే ప్రత్యేకంగా ఉన్న షాంపూలను మాత్రమే వాడాలి. పిల్లల కోసం అలాంటి 5 బెస్ట్ షాంపూస్ ఇవే…
1.హిమాలయ – జెంటిల్ బేబీ షాంపూ
Himalaya – Gentle Baby Shampoo
హిమాలయ వారు పిల్లల కోసం చేసే ఈ షాంపూలో ఎలాంటి హానికరమైన కెమికల్స్ వాడరు. ప్రకృతిలో సహజంగా దొరికె పదార్ధాలతో తాయారు చేస్తారు. ఈ షాంపూ పిల్లలకు ఏ విధమైన స్కిన్ ఇర్రిటేషన్ కలిగించదు. జుట్టును మృదువుగా, ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది.
2.జాన్సన్స్ బేబీ
JOHNSON’S baby
జాన్సన్స్ బేబీ కంపెనీ వాళ్ళు పిల్లల కోసం రెండు రకాల బేబీ షాంపూలను తయారుచేస్తున్నారు. జాన్సన్స్ బేబీ టాప్-టు-టో వాష్(JOHNSON’S baby Top-To-Toe wash), జాన్సన్స్ బేబీ షాంపూ (JOHNSON’S baby shampoo). ఈ రెండు షాంపూలు పిల్లల సున్నితమైన చర్మం కోసం ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయి. రెండింటిలోనూ పిల్లల కళ్ళు మంట కలగనివ్వకుండా నో టియర్ ఫార్ములా (no tear formula ) ఉంటుంది
3.సెబామెడ్ చిల్డ్రన్ షాంపూ
SebaMed Children’s Shampoo
ఈ షాంపూ ph value 5.5 మాత్రమే. అంటే మీ పిల్లల అతి సున్నితమైన చర్మానికి ఎలాంటి హాని కలిగించదు. అంతే కాకుండా పిల్లల చర్మాన్ని పొడి భారనివ్వదు. సహజమైన హెర్బల్ పదార్థాలు మాత్రమే ఇందులో వాడుతారు.
4.పిజియన్ 2 ఇన్ 1 హెయిర్ అండ్ బాడీ వాష్
Pigeon 2 in 1 Hair and Body Wash
పిల్లల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఈ షాంపూలో జొజోబా, చామంతి నూనెలను వాడుతారు. ఇది పిల్లల చర్మాన్ని హైడ్రాటెడ్ గా, మొయిస్ట్’రైస్సేడ్ గా ఉంచుతుంది. అంతేకాకుండా పిల్లల జుట్టుకు మంచి షైనింగ్ ఇస్తుంది.
5.చిక్కో నో టియర్స్ షాంపూ
Chicco No Tears Shampoo
ఈ పిల్లల షాంపూలో కంటికి మంట కలిగించని నో టియర్ ఫార్ములా ఉంటుంది. పిల్లల మృదువైన, సున్నితమైన చర్మానికి ఏ విధమైన హాని కలిగించదు.
మీ పిల్లల కోసం ప్రత్యేకంగా తయారుచేయబడ్డ ఈ షాంపూల్లో ఏదోటి ఎంచుకోండి
గుర్తుపెట్టుకోండి: పిల్లల కోసం వాడడానికి ఏ ప్రోడక్ట్ నైనా బాగా అలోచించి, సలహాలు తీసుకొని ఎంచుకోండి