11-nelala-pillalaku-pettalsina-aaharam-daily-food-chart

8 నెలల పిల్లలు తీసుకునే ఆహారానికి 11 నెలల పిల్లలు తీసుకునే ఆహారానికి పెద్ద వ్యత్యాసం ఉండదు.  ఒకే ఒక వ్యత్యాసం ఏమిటంటే 8 వ  నెలలో పిల్లలకు ఆహారం అనుమానంగా ఇది పెట్టచ్చా లేదా అని ఆలోచిస్తూ పెడతాము. అదే 11 వ నెలలో అయితే ఆహారం అలవాటుగా మారిపోయుంటుంది. ఈ వయస్సులో పిల్లలు ఘణపదార్థాలు మారం చేయకుండా తినడం మొదలుపెడతారు. నిజానికి పిల్లలు ఆహారంలో వచ్చిన మార్పుని ఆనందంగా స్వీకరిస్తారు. కానీ కొంత మంది పిల్లలలో మాత్రం ఘాణ పదార్థాలు అలవాటు అవడం కొంత ఎక్కువ సమయం పట్టవచ్చు. కంగారుపడకండి, నెమ్మదిగా మారం చేయకుండా తినడం ఆరంభించేస్తారు. తల్లిద్రండ్రులుగా మనం చేయాల్సిందల్లా వాళ్ళకి కావాల్సిన పోషక ఆహారం ఎదో ఒక రూపం లో అందివ్వడమే.

క్రింద పదకొండు నెలల పిల్లలకు రోజు వారి ఆహారం ఎలా పెట్టాలో తెలుసుకుందా. కానీ ఒకటి గుత్తుపెట్టుకోండి, ఈ డైలీ ఫుడ్ చార్ట్ పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలో చెప్పే ఉదాహరణ మాత్రమే. మీరు పిల్లల అవసరాలు, ఆకలి మేరకు దీనిని మార్చుకుంటూ పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. మరో విషయం, పిల్లలు కనీసం 12 నెలలు పూర్తయ్యే వరకు తల్లి పాలే అత్యంత అవసరమైన ఆహారం.

సోమవారం

ఈ నెల కూడా ప్రతి రోజు ఉదయం తల్లి పాలతో మొదలు పెట్టండి. తరువాత టిఫిన్ కి దాలియా కిచిడి మరియు కాసేపటి తరువాత తల్లిపాలు. టిఫిన్ కి భోజనానికి మధ్యలో టాక్లి పాలు రోజు తాగించాలి. భోజనానికి మెత్తగా ఉడికించిన అన్నం, సాదా పప్పు తినిపించడం మంచిది. సాయంత్రం ఏదయినా పండు ఇవ్వండి. రాత్రి పన్నీర్ దోశ తరువాత పడుకునే ముందు మళ్ళి తల్లి పాలు తగ్గించండి.

మంగళవారం

ఉదయం తల్లి పాలు తాగించాక టిఫిన్కి కూరగాయల దోశ లేదా ఇడ్లి తినిపించండి. భజనానికి ముందు ఒక సారి పాలు తాగించిన 1-2 గంటల తరువాత పెరుగన్నం లేదా పాలన్నం తినిపించండి. ఇంట్లో చేసిన పెరుగు అయితే మంచిది. సాయంత్రం ఉడకపెట్టిన కారట్ లేదా బంగాళా దుంప సలాడ్ తినిపించండి.

బుధవారం

11 వ నెలలో పిల్లలకు వెన్న, చీజ్ వంటి పాల పదార్థాలను పరిచయం చేయవచ్చు. కాబట్టి టిఫిన్ కి వీటితో దోశ లాంటివి చేసి తినిపించండి. మధ్యాహ్నం పెసరపప్పు కిచిడి మరియు సాయంత్రం బననా పాన్ కేక్స్ తినిపించండి. రాత్రి కి ఇంకా రుచిగా వెజిటబుల్ పరోటా పెట్టవచ్చు. రోజు లాగే ఉదయం లేవగానే, భోజనానికి ముందు మరియు పడుకునే అప్పుడు పాలు ఇవ్వడం మర్చిపోకండి.

గురువారం

ఉదయాన్నే పాలు పట్టించిన తరువాత రాగి పిండి కొద్దిగా కలిపి దోస పోసివ్వండి లేదా పెసరట్టు తినిపిపించండి. కాసేపటి తరువాత పాలు తాగించి భోజనం తయారు చేయడం మొదలు పెట్టండి. చప్పని సాంబార్ తో బాగా ఉడికించిన అన్నం పెట్టండి. సాయంత్రం ఆపిల్ లేదా కారట్ సూప్ తాగించండి. రాత్రికి చపాతీ వెజిటబుల్ కూరతో తినిపించండి. ఎప్పటిలాగే నిద్రపోయే ముందు పాలు తాగించండి.

శుక్రవారం

శుక్రవారం టిఫిన్ కి గోధుమ దోశ తినిపించండి. అన్నం కానీ స్టీమ్ దోశ భోజనంగా ఇవ్వండి. సాయంత్రం ఒక గ్లాస్ ఆపిల్ మిల్క్ షేక్ తాగించండి. అలాగే రోజు మూడు పూటలా తల్లి పాలు తాగించడం మాత్రం మానకండి.

శనివారం

పాలు తాగించిన తరువాత ఉప్మా రుచి మీ పిల్లలకు పరిచయం చేయండి. తరువాత కొంత సేపటికి పాలు తాగించి కాయధాన్యాల అన్నం భోజన సమయములో తినిపించండి. సాయంత్రం ఏదయినా పన్నీర్ ఆహరం మరియు రాత్రికి బ్రెడ్ ఉప్మా తినిపించండి. రోజు లాగే పడుకునే ముందు తల్లి పాలు తగ్గించండి.

ఆదివారం

ఈ వయస్సులో పిల్లలు గుడ్డు తినగలరు అందుకని టిఫిన్ కి బ్రెడ్ ఆమ్లెట్, మధ్యాహ్నం నెయ్యితో కలిపినా అన్నం మరియు గుడ్డు తాలింపు తినిపించండి. సాయంత్రం ఏదయినా పళ్ళ రసం మరియు రాత్రికి పిల్లలు ఇష్టంగా తినే దోశ తినిపించండి. మూడు పూటలా పాలు ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.

పిల్లలు పళ్లు బాగా వచ్చి బలపడే వరకు మీరు తినిపించే ఘణ పదార్థాలు మెత్తగా ఉండేలా చూసుకోండి. ఈ పాటికి పిల్లలకు పళ్ళు వచేసుంటాయి, కానీ ఎందుకైనా మంచిది కొన్ని రోజులు బాగా ఉడికించి నలిపి తినిపించండి. మీ బాబు ఎదుగుదల చూస్తుంటే ప్రతి రోజు మనకు కొత్తగా ఉంటుంది, ప్రతి రోజు ఒక జ్ఞాపకంగా మారుతుంది.

Leave a Reply

%d bloggers like this: