pregnancy-samayamlo-srungaram-gurinchi-ee-5-vishaylu

చాలా సార్లు కడుపుతో ఉన్న స్త్రీలు పుట్టబోయే పిల్లలకు ప్రమాదమేమో అనుకుని సెక్స్ కోరికలను ఆపుకుంటుంటారు.  కానీ భయపడకండి, మీ అనుమానాలన్నీ పక్కన పెట్టేసాయండి. ప్రెగ్నన్సీ సమయంలో సెక్స్ చేయడం అత్యంత సాధారణం మరియు సురక్షితం. మీ భర్త ఎప్పుడూ దూరంగా ఉండాల్సిన పని లేదు, కొన్ని జాగ్రత్తలు మాత్రం పాటించండి.

కడుపుతో ఉన్న వారు సెక్స్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు మీకు ఎప్పుడు చెప్పబోతున్నాము.

1. ప్రెగ్నన్సీ సమయంలో సెక్స్ చేయచ్చు, సురక్షితం కూడా

మీరు గర్భం దాల్చిన తరువాత కూడా సెక్స్ లో పాల్గొనచ్చు. అది అత్యంత సాధారణం మరియు మీకు కానీ మీ బిడ్డకు కానీ ఎటువంటి హాని జరగదు. నిజానికి, కడుపుతో ఉన్నప్పుడు సెక్స్ మరింత మధురంగా, తృప్తిగా ఉంటుంది. శరీరంలో మారుతున్న హార్మోన్లు దీనికి కారణం. ఈ సమయంలో మీరు ఇంకా సున్నితంగా ప్రభావితంగా మారుతారు. అందువలన మీరు మీ భర్త బాగా ఎంజాయ్ చేయగలరు.

2. సెక్స్ చేస్తే బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేదు

దంపతులు ప్రగ్నన్సీ సమయంలో బిడ్డకు ప్రమాదేమో అని సెక్స్ చేయడానికి సంకోచిస్తుంటారు. కానీ బిడ్డ కి ప్రమాదం లేదు ఎందుకంటే చాలా పొరల లోపల ఉంటాడు. సెక్స్ కి పిల్లలకి ఎటువంటి సంబంధము లేదు. కాబట్టి, ఎక్కువ ఆలోచించకుండా హాయిగా సెక్సని ఎంజాయ్ చేయండి.

3. పొజిషన్ ముఖ్యం

పొజిషన్ విషయం లో మాత్రం అత్యంత శ్రద్ద మరియు జాగ్రత్త వహించాలి. గర్భం దాల్చిన సమయంలో కడుపు మీద పడుకోకూడదు మరియు కడుపు మీద ఎక్కువ బరువు పడకుండా చూసుకోవాలి. 16 – 20 వారాల తరువాత పైన చెప్పినట్టు అస్సలు చేయకూడదు. వేరే పొజిషన్స్ ట్రై చేయండి. పూర్తి ప్రెగ్నన్సీ సమయంలో సెక్స్ చేయగలిగే పొజిషన్స్ కొన్ని ఉన్నాయి, అవి ట్రై చేయండి.

4. ప్రొటెక్షన్ వాడండి

సెక్స్ చేయడం ద్వారా వ్యాపించే రోగాలను అరికట్టాలి అంటే తప్పనిసరిగా ప్రొటెక్షన్ వాడాలి. హెర్పీస్ సింప్లెక్స్ అనే ఒక వైరస్ పిల్లల పుట్టుకలో లోపం కల్గించగలదు. ఇది యానల్ సెక్స్ ద్వారా, లేదా నోటిద్వారా మరియు యోని సెక్స్ ద్వారా వ్యాపించగలదు కాబట్టి జాగ్రత్త వహించండి, ప్రొటెక్షన్ తప్పకుండ వాడండి.

5. సెక్స్ తరువాత రక్తస్రావం కలుగకూడదు

సెక్స్ తరువాత రక్తస్రావం జరిగితే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళండి. ఇలా సాధారణంగా జరగదు కానీ ఒక వేల జరిగితే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించండి.  అంతే కాకుండా ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ కోరికలు తగ్గడం కూడా అత్యంత సాధారణ విషయం కాబట్టి కంగారుపడకండి.

వైవాహిక జీవితంలో సెక్స్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొన్ని మూఢ నమ్మకాలను నమ్మి మీ భర్తను దూరంగా ఉంచకండి.  ఇద్దరు దగ్గరవడానికి దొరికిన సమయాన్ని మొత్తం వాడుకోండి. ఇంకో విషయం, ప్రెగ్నన్సీ చివరి వారంలో మాత్రం సెక్స్లో పాలుపంచుకోకపోతే మంచిది.

Leave a Reply

%d bloggers like this: