pillala-maanasika-edugudal-modati-6-nelalu-ila-untundi

మొదటి కొన్ని సంవత్సరాలలో పిల్లల మానసిక మరియు శారీరక ఎదుగుదల అత్యంత ముఖ్యము.  తల్లిదండ్రులు పిల్లలు సర్రిగ్గా ఎదుగుతున్నారు లేదా అని గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల మానసిక ఎదుగుదల వివిధ దశల్లో జరుగుతుంది. వాటిలో మొదటి 6 నెలలు అత్యంత ప్రముఖమైనవి.

ఈ మొదటి 6 నెలల్లో పిల్లలు ప్రపంచానికి ప్రకృతికి వాతావరణానికి అలవాటు పడుతాడు. బిడ్డ గర్భం అనే ప్రపంచం నుంచి కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాక తన శరీరం మరియు మెదడు అలవాటు పాడటానికి కొంచెం సమయం పడుతుంది. ఈ సమయంలోనే మానసికంగా ఎదుగుతారు. 1-2 నెలల మధ్య సమయంలో బిడ్డ మనుషులను గుర్తించడం మొదలు పెడతారు, ముఖ్యంగా తన అమ్మ స్వరము, స్పర్శ మరియు వాసనను గుర్తుపట్టగలడు. నిదానంగా పిల్లలు ఇతర మనుషులను, నవ్వులను గుర్తించగలడు. పిల్లలు తన చుట్టూ జరుగుతున్నది తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు, ఈ సమయంలోనే తలని కంట్రోల్ చేయడం, ఎత్తడం నేర్చుకుంటారు. అంటే పిల్లలను తన చుట్టూ ఉన్న వస్తువులను చూడటానికి తల తిప్పడం మీరు గమనించవచ్చు. ఈ సమయం లో వారి చూపు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందిందడు కాబట్టి వారు దగ్గరగా ప్రకాశవంతమైన వస్తువుల మీదనే చూపు నిలుపుతారు. ఒక సారి ఆ వస్తువు కనపడకపోతే అసలు దాని గురించే మర్చిపోతారు. అందుకనే పసి పిల్లలను సులువుగా సముదాయించగలం.

మూడు నెలల సమయంలో పిల్లలు కాలుని ఎత్తడం నేర్చుకుంటాడు. మీరు ఎపుడైనా చేయడం చూసి అది నేర్చుకుంటాడు. నాలుగవ నెలలో పిల్లలు వస్తువులను చేరుకోవడానికి ప్రయత్నిస్తారు మరియు వాటి కదలికలను అనుకరిస్తారు. ఒక్కసారి పెట్టుకున్నాక వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, ఎలా ప్రయత్నిస్తారు? వాళ్ళకి తెలిసింది ఒకటే విధము, నోట్లో పెట్టుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. పిల్లల వారి శరీర భాగాలను కూడా గమనించుకుంటూ వేళ్ళు కదిలించడం, చేతులు ఆడించడం వంటివి చేస్తుంటారు. ఈ సమయంలో వారి చూపు మెరుగు పడుండడంతో దూరంగా ఉన్న వస్తువులను కూడా చూడగలరు. అంతే కాకుండా, పదార్థాలు రంగుని రుచిని తెలుసుకోగలడు. రంగు అంటే అది గ్రీన్ ఏది యెల్లో అని చెప్తాడు అని కాదు, గ్రీన్ వేరు యెల్లో వారు అని గుర్తించగలడు.

6 నెలల వయస్సులో శబ్దాలు చేయడం మొదలు పెట్టేస్తారు. మీరు మీ ముద్దుల బిడ్డ చిన్న చిన్న శబ్దాలు చేయడం ఈ సమయంలో వినగలరు. ఇళయ రాజా పాట కన్నా దేవి శ్రీ బీటు కన్నా మధురంగా మీ చెవులకి వినపడుతుంది. సిరి వెన్నెల గారి లాంటి పదాలు వాడలేరు కానీ వారు చేసే అర్థం లేని శబ్దాలు వింటుంటే సిరి వెన్నెల నేరుగా మన మీద పడినట్టు అనిపిస్తుంది.

పిల్లల మానసిక పెరుగుదల అత్యంత సున్నితంగా వేగంగా జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో  మనం చేయవలసిందల్లా వారికి క్వాల్ల్సిన పోషక ఆహారం మరియు సౌకర్యాలు అందించడమే.

Leave a Reply

%d bloggers like this: