pillalaku-pallu-vachetappudu-thappakunda-teesukovalasina-mukhyamaina-5-jagrathalu

పిల్లల బోసినోటిలో మొదటి పన్ను వచ్చినప్పుడు మనకి సంతోషంగా ఉంటుంది.  పిల్లలకు సాలిడ్ ఫుడ్ (solid food) తినిపించడం మొదలు పెట్టచ్చు. 6-12 నెలల వయసప్పుడు మొదట పాల పళ్ళు వస్తాయి అవి 6-7 సంవత్సరాల నుంచి ఊడిపోవడం మొదలవుతాయి. కొత్త పళ్ళు రావడం మొదలవుతుంది. అయితే పిల్లలకు పళ్ళు రావడంతో పాటు కొన్ని కొత్త సమస్యలు కూడా వస్తాయి. ఆ దశలో కొన్ని జాగ్రతలు తప్పకుండా తీసుకోవాలి. అలాంటి ముఖ్యమైనవి ఇవే…

1.కొరకడం

పిల్లలకు పళ్ళు రావడం మొదలయ్యాక తమకు దొరికినవన్నీ కొరికేస్తారు. దీని కారణం  పళ్ళు వచ్చేటప్పుడు చిగుళ్లలో దురదగా ఉండడం. అందుకె పళ్ళు వచ్చే ఈ దశలో పిల్లలలు వస్తువలను, బొమ్మలు, వేళ్ళను కొరకడం, నమలడం లాంటి చేస్తారు. వాళ్లకు దగ్గరగా ఏ ప్రమాదకరమైన వస్తువులు ఉంచకండి. కెమికల్స్ తో కూడిన రంగులున్న బొమ్మలు పిల్లలకోసం వాడకండి. కెమికల్స్ కడుపులోకి వెళ్ళి ప్రమాదకరంగా మారుతాయి.

2.సరిగా నిద్రపోరు

పిల్లలు పళ్ళు రావడం పగటిపూట మాత్రమే జరగదు. రాత్రి పూట కూడా పళ్ళు వస్తుంటాయి. ఆ సమయంలో చిగుళ్లు నొప్పిగా, దురదగా ఉంటాయి. సరిగా నిద్రపోలేరు. ఏడుస్తువుంటారు. అలాంటప్పుడు నిద్రపుచ్చడానికి ప్రయత్నించండి. సరైన నిద్రలేకపోవడం పిల్లలలో కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

3.బుగ్గలు రుద్దడం…చెవులు లాగడం

నోటిలోని చిగుళ్ల నుంచి బుగ్గలకు, చెవులకు నరాల సంబంధాలు ఉంటాయి. చిగుళ్లలోని నొప్పి, దురద బుగ్గల మీద , చెవుల మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే పిల్లలు పళ్ళు వచ్చేటప్పుడు బుగ్గలు రుద్దడం, చెవులు లాగడం లాంటివి చేస్తుంటారు. పిల్లలు మరి వీపరీతంగా అలా చేస్తున్నపుడు సముదాయించండి. లేకపోతే తమను తాము గాయపరుచుకునే ప్రమాదం ఉంది.

4.తినిపించడం

పిల్లలకు పళ్ళు రావడం మొదలైన వెంటనే సాలిడ్ ఫుడ్స్  తినిపించాడనికి ప్రయత్నించద్దు. కొంత సమయం ఆగండి. పళ్ళు వచ్చే సమయంలో పిల్లలు తినడానికి చాలా అసౌకర్యంగా ఉంటుంది. మీరు సాలిడ్ ఫుడ్ మాత్రమే పెట్టడానికి ప్రయత్నించడం, వాళ్ళు తినకపోవడం. వాళ్ళ ఎదుగుదలకు  కావల్సిన ఆహారం అందకుండా చేస్తుంది. అందుకే ఈ దశలో వాళ్ళు ఏది తినడానికి ఇష్టపడితే అది తినిపించండి.

5.పళ్ళ శుభ్రత

 పిల్లలకు పాల పళ్ళు ఉన్నపుడు శుభ్రత మీద అంత శ్రద్ధ పెట్టరు. కానీ ఆ సమయంలో కూడా క్రిములు పళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే పిల్లల చేత రోజు బ్రష్ చేయించండి. పళ్ళు పుచ్చిపోవడం లాంటివి జరిగితే ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లండి. పళ్ళు ఆరోగ్యంగా ఉండడం శరీర ఆరోగ్యానికి చాలా అవసరం.

Leave a Reply

%d bloggers like this: