bharyabhartha-madhya-pillala-gurinchi-jarigey-hasyaspadha

మీరు తల్లి అయిన తర్వాత మీ లైఫ్‌స్టైల్‌లో చాలా మార్పులు వస్తాయి. మరీ ముఖ్యంగా మీరు మాట్లాడే విషయాలలో చాలా మార్పులు వస్తాయి.  ప్రసవం జరిగిన తర్వాత మీరు ఎక్కువగా బాబు/పాప గురించే మాట్లాడాల్సి రావచ్చు. మీరు మీభర్తతో ఉన్నప్పుడు మీబిడ్డ గురించి చాలా  విషయాలు చర్చిస్తారు. వాటిలో ఎక్కువగా చర్చించే విషయాలు ఏంటంటే,

సమయానికి నిద్రపోవడం నేర్పించడం:

కొత్తగా పుట్టిన బాబు/పాప వారికి ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోతారు మరియు వారికి ఇష్టం వచ్చినప్పుడు లేస్తారు. మీరు వారికి మొదటగా నేర్పించాలని అనుకొనే విషయం ఏమిటంటే, నిద్రను అలవాటు చేయడం. నిద్రను సమయానికి అలవాటు చేయడం వల్ల మీకు కూడా కాస్త విశ్రాంతి దొరుకుతుంది.  మొదట్లో ఈవిషయం గురించి మీరు ఎక్కువగా చర్చిస్తారు.

బాబు/పాప మలవిసర్జణ గురించి మాట్లాడటం:

బేబీ పుట్టిన తర్వాత మీరు ఎక్కువగా మాట్లాడుకొనే మరో విషయం ఏమిటంటే బేబి మలం గురించి. ఎందుకంటే, వారికి ఒక్కోసారి ఆకుపచ్చగాను, ఒక్కోసారి పసుపు పచ్చగానూ వస్తుంది. అలాంటి సంధర్భాలలో మీరు ఎక్కువగా ఆవిషయం గురించి మాట్లాడుతారు.

వారు మాట్లాడే మాటల గురించి:

పిల్లలు పుట్టిన తర్వాత వారు చేసే ప్రతీ విషయం కూడా తల్లిదండ్రులకు ఆనందాన్నిస్తుంది. మరీ ముఖ్యంగా వారి మాటల విషయంలో. పాప పుట్టిన 6 నెలల తర్వాత నుండి మీరు వారి మాట్లాడే చిన్న చిన్న మాటల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు.

టాయిలెట్ ఎలా వెళ్ళాలనేది నేర్పించడం:

పాప/బాబు మొదట్లో ఇంట్లో ఎక్కడంటే అక్కడ మలవిసర్జణ చేస్తారు. ఒక్కోసారి, సోఫాల మీద, బట్టల మీద, ఇంకా పరిశుభ్రమైన ప్రదేశాలలో చేస్తారు. కాబట్టి మీరు వారికి టాయిలెట్ వెళ్ళే అలవాటును తొందరగా నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సాధారణంగా పిల్లలు 18 నెలల నుండి 24 నెలల మధ్యలో ఈ అలవాటును అలవరచుకుంటారు.

ప్రాకడం గురించి:

మీ బేబీ ప్రాకుతున్నప్పుడు కలిగే ఆనందం చాలా ఎక్కువ. ఈ సంధర్భం గురించి మీరు చాలా రోజుల పాటు వేచి ఉంటారు. మీ పిల్లలు దొగ్గాడటం గురించి మీరు మీభర్తతో చాలా సార్లు చర్చిస్తారు.

పాప వల్ల బయట ఎదురయ్యే ఇబ్బందుల గురించి:

మీరు ఏదైనా సూపర్‌మార్కెట్‌కు వెళ్ళినప్పుడు లేదా రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు మీ పాప ఏడుపు ఆపకపోతే లేదా అక్కడ అల్లరి ఎక్కువగా చేస్తూ ఉంటే చుట్టూ ఉండే జనం మిమ్మల్నే చూస్తారు. ఇలాంటి సమయాలలో ఏమి చేయాలి, ఏడుపు ఎలా ఆపించాలి అన్న విషయాల గూర్చి కూడా మీరు ఎక్కువగా మాట్లాడుతారు.

మీరు పాప గోళ్ళు ఎప్పుడు తీయాలి:

పాప పెరిగేకొద్దీ గోళ్ళు కూడా పెరుగుతాయి. పాప గోళ్ళు ఎప్పుడు తీయడం మంచిది అన్న ఆలోచన తరచుగా మీ బార్యాభర్తల మధ్య వస్తూ ఉంటుంది. చాలా మంది పిల్లలు నిద్రపోటప్పుడు గోళ్ళు తీయాలని ప్రయత్నిస్తారు. ఒకవేళ మీరు అలాగే చేయాలనుకుంటే పాప కదలకుండా చాలా జాగ్రత్తలు తీసుకోండి.

మీరు నిద్రపోయాకే పాప నిద్ర లేవడం:

మీరు మాట్లాడుకొనే మరో విషయం ఏమిటంటే, పాప/బాబు నిద్ర లేవడం గురించి. ఎందుకంటే, మీరు ఎప్పుడు నిద్రలోకి జారుకుంటారో వారు అప్పుడే మేలుకుంటారు. ఈ సంధర్భం మీకు చాలా సార్లు ఎదురయ్యే అవకాశం ఉంది.

జోలపాడటం గురించి:

జోల పాడటం గురించి కూడా  మీరు మాట్లాడుకుంటారు. ఎందుకంటే, అంతకుముందు మీకు జోల పాడటం రాకపోవచ్చు కానీ మీ బాబు కోసం అదేపనిగా నేర్చుకోవల్సి వస్తుంది. ఒక్కోసారి మీరు మీ బాబు దగ్గర లేకపోయినా కూడా జోలపాటలు మీ నోటి నుండి వస్తూనే ఉంటాయి. మీ బాబు/పాప గురించి కేర్ తీసుకోవడంలో మీరు ఎక్కువగా లీనమవ్వడం వల్ల అలా జరుగుతుంది.

Leave a Reply

%d bloggers like this: