puttina-rashini-batti-meeru-elanti-amma-avutharo-venta

మనలో చాలా మంది జోతిష్య శాస్త్రాన్ని నమ్ముతారు.  అయితే మీరు పుట్టిన రాశిని బట్టి మీరు ఎలాంటి తల్లో సులభంగా చెప్పవచ్చు. మీరు శాంత స్వభావం కలవారా, కోపిస్టులా, భయంకరమైన వారా, సౌమ్యులా లేక జాలి గుండె కలవారో తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న వాటిని చదవండి.

మేష రాశి (మార్చ్21-ఏప్రెల్9):

మీకు స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి. మీ పిల్లలతో సమయం గడుపుతూనే మీకంటూ ప్రత్యేక సమయాన్ని మీరు కేటాయించుకుని,  మీ భర్తతో లేక మీకు ఇష్టమైన వ్యాపకంతో సమయం గడుపుతారు. మీ పిల్లలకు మంచి విధేయతను నేర్పుతారు అంతేకాక వారిని చాలా స్ట్రిక్ట్‌గా పెంచుతారు. ఒకవేళ వారు మంచి పనులు చేస్తే వారిని ప్రోత్సహించి వారిని నచ్చినవి కొనడం, బయటకు తీసుకెళ్ళడం వంటివి చేస్తారు.

వృషభ రాశి (ఏప్రెల్20-మే20):

మీరు స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. మీ పిల్లలను ఇలాగే పెంచాలని కొన్ని రూల్స్ పెట్టుకొని ఉంటారు. అదేవిధంగా పెంచుతారు. మీరు జీవితంలో విజయం సాధించినా, సాధించకపోయినా మీపిల్లల విజయానికి తీవ్రంగా కృషి చేస్తారు. మీకు నచ్చిన దాని కోసం మీరు ఏమైనా చేసే గుణం ఉంటుంది.   పిల్లలకు చదువులో వారిని వారు ఋజువు చేసుకోవడానికి ఎప్పుడూ అవకాశం ఇస్తారు.

మిథున రాశి(మే21-జూన్20):

మీరు మీ పిల్లలకు తల్లి కన్నా కూడా ఫ్రెండ్‌లాగా ఉంటారు. మీ పిల్లలతో మీరు ఎప్పుడూ టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. వారికి ఏది కావాలన్నా మీరే సమకూరుస్తారు. మీతో గడపడానికి మీ పిల్లలు ఎప్పుడు ఇష్టపడతారు. మీ పిల్లలు మీతో అన్ని విషయాలనూ పంచుకుంటారు. మీరు మీ పిల్లలకే కాక మీ పిల్లల స్నేహితులకు కూడా నచ్చుతారు. ఎప్పుడూ అప్డేట్ అయ్యే మీలాంటి వారి విలువను ఎవరూ లెక్కగట్టలేరు.

కర్కాటక రాశి(జూన్21-జూలై22):

మీకు ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. మీ పిల్లలను మీరు ఎంతో గారాభంగా పెంచుతారు. వారికి ఎలాంటి భోజనం నచ్చుతుంది, ఎలాంటి డ్రెస్ నచ్చుతుంది, స్నానం ఎలా చేయించాలి వంటి విషయాల మీద మీకు పూర్తీ అవగాహన ఉంటుంది. మీకు ఎక్కువ ఫీలింగ్స్ ఉండటం వల్ల మీ పిల్లలను గట్టిగా మందలించలేరు.

సింహ రాశి(జూలై23-ఆగష్ట్22):

మీకు చాలా ఆత్మవిశ్వాసం ఉంటుంది. మీ పిల్లలను అన్ని విధాలుగా మీరు ప్రోత్సహిస్తారు. వారికి సంగీతం, ఆటలు, పాటలు, బొమ్మలు గీయడం వంటివి నేర్చుకోవడానికి తోడ్పడుతారు. వారికి మీరు పూర్తి స్వేచ్చ ఇవ్వడమే కాక, వారి మొహాన్ని చూసి వారు చేసిన తప్పును లేదా ఒప్పును పసిగడతారు.

కన్య రాశి (ఆగష్ట్23-సెప్టెంబర్23) :

మీరు చాలా ప్రణాళికాబద్ధంగా ఉంటారు. మీ పిల్లల గురించి మీకు పూర్తిగా తెలిసి ఉంటుంది. వారిని ఒక పద్ధతిగా పెంచడమే కాక, జీవితాంతం క్రమశిక్షణను కలిగి ఉండేలా ప్రోత్సహిస్తారు. వీటితో పాటూ మీరు చాలా శుభ్రంగా ఉంటారు. ఇంటిలో కొంచెం చెత్త ఉన్నా, మీకు నిద్ర పట్టదు.

తుల రాశి(సెప్టెంబర్24-అక్టోబర్22):

మీరు అన్నిటిలో సమతుల్యత పాటిస్తారు. చదవడం, ఆడుకోవడాల మధ్య ఎలా సమతుల్యత పాటించాలో మీరు మీపిల్లలకు చెప్తారు. అంతేకాక, మీరు మీఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దుతారు. మీలో కళా నైపుణ్యం కూడా ఉంటుంది అప్పుడప్పుడూ దాన్ని వెలికి తీస్తూ ఉంటారు.

వృచ్చిక రాశి(అక్టోబర్23-నవంబర్ 21):

మీరు చాలా బలమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. మీకంటూ కొన్ని ఆశయాలూ, గమ్యాలూ ఉంటాయి. వాటి కోసం మీరు నిరంతం శ్రమిస్తూ ఉంటారు. ఏదైనా పనిని ప్రారంభిస్తే మీరు ఎప్పటికి దాని నుండి విశ్రమించరు. మీపిల్లలకు కూడా అలాంటి వ్యక్తిత్వాన్నే మీరు నేర్పిస్తూ, వీరిని మీకు కాపీగా తయారు చేస్తారు.

ధను రాశి(నవంభర్22-డిశెంభర్21):

మీరు ఎల్లప్పుడూ ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. మీప్రతిభను మీరు చూపించడానికి విశ్వాన్ని చుట్టే అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లలకు కూడా మీరు భిన్నమైన కల్చర్‌ను అలవాటు చేస్తారు. మీరు ఉంటే మీపిల్లలకు అస్సలు బోర్ కొట్టదు.

మకర రాశి(డిశెంభర్21-జనవరి19):

ఇతరులకు సలహాలు ఇచ్చే స్థాయికి మీరు చేరుకుంటారు. మిమ్మల్ని చూసి ఇతర అమ్మలు ప్రేరణ పొందుతారు. మీకు చాలా కష్టపడే తత్వం ఉంటుంది. మీరు చేసే పని ద్వారా ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. మీ పిల్లలకు కూడా అలాంటి లక్షణాలనే మీరు భోదిస్తారు తద్వారా మీ పిల్లలు కూడా జీవితంలో చాలా సాధిస్తారు.

కుంభ రాశి(జనవరి20-ఫిబ్రవరి19):

మీరు చాలా అప్‌డేట్‌గా ఉంటారు. ప్రస్తుతం వచ్చే అన్ని సినిమాలను , సంగీతాలను మీరు తెలుసుకుంటూ ఉంటారు. మీకు రోటీన్‌గా ఉండటం బోర్‌గా అనిపిస్తుంది. మీ జీవితంలో మీరు రెబల్‌గా ఉండే అవకాశం ఉంది. మీకు ఉండే అనుభవాలే మీ పిల్లలకు పాఠాలుగా మారుతాయి అంతేకాక వారికి మీరు నిజమైన ప్రపంచాన్ని చూపిస్తారు.

మీన రాశి(ఫిబ్రవరి20-మార్చి20):

మీరు చాలా మంచి హృదయాన్ని కలిగి ఉంటారు. మీ అభిప్రాయాలను మీ పిల్లలపై రుద్దరు పైపెచ్చు వారికి ఏదైనా సమస్య ఎదురైతే మీరే స్వయంగా వెళ్ళి పరిష్కరిస్తారు. మీరు వారి కోసమే జీవిస్తున్నారు అనేలా మీ ప్రవర్తన ఉంటుంది. మీలాంటి వారు దొరకడం వారి అదృష్టం. 

Leave a Reply

%d bloggers like this: