ee-5-margala-dwara-saradaga-mariyu

ఎవరు మాత్రం నాజూకుగా అందంగా ఉండాలని కోరుకోరు. అందరు కోరుకుంటారు కానీ సులువుగా బరువు తగ్గలేకపోతున్నాము అని వాపోతుంటారు. పెళ్ళికి వెళ్ళ వలసి వచ్చినా, ఇష్టమైన బట్టలు మన శరీరానికి అంతగా నప్పకపోయినా ఈ బాధ మరింత ఎక్కువ అవుతుంది. అందుకే మీరు సులువుగా ఆడుతూ పాడుతూ బరువు తగ్గించుకోగలిగే 5  మార్గాలు మీకోసం ఇక్కడ వివరించాము. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము.

1. వ్యాయామం స్నేహితులతో కలిసి చేయండి

ఏ పని అయినా ఒక మంచి ఫ్రెండ్ తో కలిసి చేస్తే సరదాగా అసలు సమయమే తెలియకుండా గడిచిపోతుంది.  వ్యాయామం విషయంలో ఫ్రెండ్ తో కలిసి చేయడం మరింత సరదాగా ఉంటుంది. కొత్తగా వ్యాయామం మొదలు పెట్టే వారికి అతి పెద్ద సమస్య ఎలా చేయాలి, ఎక్కడనుండి మొదలు పెట్టాలి వంటి ఆలోచనలే. ఇలాంటి సమయంలో పక్కన ఒక ఫ్రెండ్ ఉంటె ఎంతో సహాయంగా ఉంటుంది. అందులో వ్యాయామం అలవాటుగా మారేంత వరకు చాలా కష్టంగా ఉంటుంది,  అదే ఒక తోడు ఉంటె సులువుగా కష్టం తెలీకుండానే వ్యాయామం అనేది అలవాటుగా మారిపోతుంది.

2. చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి, వాటిని సాధించండి

బరువులో మార్పు ఒక్క రోజులో కనపడదు. కావున, చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి, వాటిని అధిగమించితే మిమ్మల్ని చూసుకొని మీరే గర్వపదండి. ఇలా చేయడం ద్వారా ఎంతో కొంత కష్టపడుతున్నందుకు మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంతే కాకుండా మీలో ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది.ఇలాంటి చిన్న చిన్న గెలుపులే ఒక రోజు బరువు తగ్గడమే మీ లక్షాన్ని సాధించేలా చేస్తాయి.

3. ఏదయినా చూస్తూ లేదా, పాటలు వింటూ త్రెడ్ మిల్ మీద పరిగెత్తండి

మొదట్లో కొన్ని రోజులు ఎవరు కూడా వ్యాయామాన్ని ఆనందించలేరు. అసలు వ్యాయామం చేయాలంటేనే చిరాకుగా, నీరసంగా ఉంటుంది. అలాంటప్పుడు, పాటలు వింటూ చేయడం, మీకు నచ్చిన సినిమా చూస్తూ ట్రేడ్ మిల్ మీద పరిగెత్తడం చేయండి. ఇలా చేస్తే మీకు కష్టం పెద్దగా తెలీదు అంతే కాకుండా ఎక్కువ సేపు చేయగలరు. కుదిరితే డాన్స్, డాన్స్ కార్డియో, జుంబా డాన్స్ వంటివి నేర్చుకుంటే మీ వ్యాయామం మరింత ఉల్లాసంగా మారుతుంది.

4. పౌష్టికరమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం తినండి

బరువు తగ్గాలంటే వ్యాయామం కొంత వరకే సహాయపడుతుంది. మనం తీసుకునే ఆహరం మీదనే మన బరువు ఎంత వేగంగా తగ్గుతుంది అనే విషయం ఆధారపడి ఉంటుంది. కావున, తాజా మరియు ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం అత్యంత అవసరం. కొవ్వు పదార్థాలు, నూనె వస్తువులు వీలైనంత వరకు తగ్గించండి. వంట చేసే టైములో కూడా చాలా మంది ఆడవాళ్లు ఎక్కువ నూనె వేస్తారు. ఆలా ఐతే మీరు వంట చేశా విధానంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి.

5. వీలైనంత నడవండి

పెరిగిన టెక్నాలజీ వలన ఈ రోజుల్లో మనం అస్సలు నడవడం లేదు. మెట్లు ఎక్కడం వంటివి కూడా చేసే అవసరం లేకుండా లిఫ్టులు వచ్చేసాయి, బట్టలు ఉతికే అవసరం లేకుండా వాషింగ్ మిషన్లు వచ్చేసాయి.  ఇలా ప్రతి దానికి వాటి మీద ఆధారపడకుండా వీలైనన్ని ఇంటి పనులు మనమే స్వయంగా చేసుకుంటే జిం కి వెళ్లి వ్యాయామం చేయాల్సిన అవసరం రాదు.

Leave a Reply

%d bloggers like this: