pelli-roju-eppudu-madhura-gnapakam

“గోరింటాకు బాగా పండితే మంచి భర్త వస్తాడు…” అని  బామ్మ చిన్నపుడు వడిలో కూర్చోపెట్టుకొని గోరింటాకు పెడుతు చెప్పినప్పటి నుంచి, ప్రతి ఆడపిల్ల తన జీవితంలో  పెళ్లి గురించి, అది జరిగే రోజు గురించి ఎన్నో కలలు కనివుంటుంది. పెళ్ళి రోజున ఎలాంటి చీర కట్టుకోవాలి? ఏ నగలు పెట్టుకోవాలి?  అంతకన్నా ముఖ్యంగా పెళ్ళి తర్వాత జీవితం మొత్తం మనతో ఉండే వ్యక్తి ఎలా ఉండాలి? ఇలా ఎన్నో ఆలోచనలు, ప్రశ్నలు, ఊహలు ప్రతి ఆడపిల్ల జీవితంలో ఉంటాయి. ఇంతలో ఆ పెళ్లి కాస్త జరిగిపోతుంది సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ పెళ్ళిరోజు జీవితంలో ఎప్పటికి మరిచిపోలేని ఒక మధుర జ్ఞాపకంగా మిగిపోతుంది…ఎందుకో తెలుసా ?  ఇవే కారణాలు..

1.మీ జీవితాన్ని పంచుకోవడానికి ఒక తోడు దొరికినందుకు

చిన్నపుడు అమ్మానాన్నా, కొంచెం పెద్దయ్యాక స్నేహితులు జీవితంలో కొంత వరకు తోడుంటారు. కానీ జీవితం మొత్తం మన బాధ- సంతోషం, కష్టం-నష్టం, ఆనందాలు -అనుభూతులు కలిసి పంచుకోడానికి ఒక జీవిత భాగస్వామి కావాలి. ఆ వచ్చేవాడు ఇలా ఉండాలి అని చాలా సార్లు అనుకునే ఉంటాం. ఆ వ్య్తకిని మీరు ఎంచుకున్న, మీ అమ్మ నాన్నలు ఎంపిక చేసిన. “ఇతనే నా భాగస్వామి” అనే భరోసా తన చిటికిన వేలు పట్టుకొని ఏడడుగులు వేసిన పెళ్ళిరోజునే కలుగుతుంది.

2.పెళ్ళి చీర

పెళ్ళి అయిన తరువాత ఎన్ని చీరలు కొన్నా, ఒక చీరకు మాత్రం మీ మనసులో , మీ బీరువాలో ప్రత్యేక స్థానం ఎప్పటికి ఉంటుంది. మీ పెళ్ళికి, మీరు ఎంతో ఇష్టపడి కట్టుకున్న పెళ్ళి చీర. ఆ చీరను ఎప్పుడు చూసుకున్నా పెళ్ళి రోజు జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా మనసులో మెదులుతాయి. అప్పుడప్పుడు “ ఇదేరా నేను పెళ్ళికి కట్టుకున్న చీర..మీ నాన్నకు చాలా ఇష్టం “ అని పిల్లలకు చూపిస్తాం.

3.కొత్త కుటుంబంలో భాగం అయినందుకు

ఆడవాళ్ళందరూ పెళ్ళి అయిన తరువాత, తాను ఏడ్చి, అందర్నీ ఏడిపించి పుట్టినింటి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన ప్రతి ఆడపిల్ల ఒక కొత్త కుటుంబంలో భాగమవుతుంది. మరో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. జరిగిన ఈ సంఘటనలన్నీ పెళ్లిరోజును కొంచెం బాధ…కొంచెం సంతోషంతో కూడిన ఒక జ్ఞాపకంగా మిగులుస్తాయి.

4.భాద్యతలు పెరుగుతాయి

అమ్మ నాన్న ముద్దుల కూతురుగా ఏ చీకుచింత లేకుండా గడిచిపోతున్న జీవితాన్ని పెళ్లిరోజు మార్చేస్తుంది.  తరువాత నుంచి కొత్త బాధ్యతలు వచ్చి చేరుతాయి, కొంచెం పెత్తనం కూడా చేయాలి. పెళ్లిరోజు నుంచి కొత్త కుటుంబంలో ఎదురయ్యే ఈ అనుభవాలన్నీ జ్ఞాపకాలే…

5.కథ సుకాంతం అయినందుకు

చిన్ననాటి నుంచి మనం వినే ప్రతి కథలో రాజకుమారి మనమే కదా….రాకుమారుడు కష్టాల్ని పడి చివరికి రాజకుమారిని చేరుకొని, కథ సుకాంతం అయిన ప్రతి సారి, అది మనకె జరిగినట్టు సంతోష పడుతాం. మరి నిజ జీవితంలో మీ రాకుమారుడు మిమ్మల్ని కలిసిన పెళ్ళిరోజు ఒక అద్భుతమైన మధుర జ్ఞాపకమే కదా….

మీరు చదివాక మీ ఆయనకు తప్పకుండా share చేయండి…పెళ్ళిరోజు జ్ఞాపకాలను గుర్తు చేయండి  

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: