ప్రెగ్నన్సీ సమయంలో ఎంత ఆనందంగా ఉంటామో అంత కష్టాలు కూడా పడుతుంటాము. వాటిలో ముఖ్యమైన కష్టం నిద్ర లేకపోవడం. మీరు ప్రెగ్నన్ట్ గా ఉన్న, లేకపోతే మీకు ఒక బిడ్లు పుట్టి ఉన్నా మేము దేని గురించి చెప్తున్నామో అర్థమైవుంటుంది. గర్భవతిగా ఉన్నపుడు ఎంత నిద్రపోదాము అనుకున్నా నిద్ర రాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. నిద్రపోవడం కష్టంగా మారుతుంది.
సాధారణంగా కడుపుతో ఉన్న వారు అలసట మరియు ఆయాసానికి సులువుగా గురవుతుంటారు. మొదటి మరియు మూడవ త్రైమాసికంలో ఇటుంవటి లక్షణాలు ఎక్కువుగా ఉంటాయి. ఈ సమయంలో హార్మోన్ల సమతుల్యత కోల్పోవడం వలన అనేక శరీరానికి ఇబ్బందులు మొదలవుతాయి. ముఖ్యంగా సరిగా తిండి తినలేకపోవడం, నిద్రరాకపోవడం వంటి సమస్యలు మరింత ఇబ్బంది పెడతాయి. ఇంకా కరెక్టుగా చెప్పాలి అని అంటే, శరీరంలో పెరుగుతున్న ప్రొజెర్స్టెరోన్ హార్మోన్లు మన నిద్రలేమితనానికి కారణాలు.
అంతే కాకుండా, సైటోకైన్స్, అనే ఒక ప్రోటీన్లు కూడా అధికంగా పెరగడంతో మనం గర్భంతో ఉన్న సమయంలో సరిగ్గా నిద్రపోలేము. ఈ సైటోకైన్స్ అనేది రోగనిరోధక శక్తిలో ఒక ముఖ్యమైన భాగం. ఇది శరీరంలోని అన్ని కణాలకు కావల్సివున్న సమాచారం అందిస్తూ ఉంటుంది. ప్రెగ్నన్సీ సమయంలో వీటి ఉత్పన్నం అధికంగా ఉండటం వలన రోగనిదరోధిక శక్తి కూడా లోపిలుస్తుంది, తద్వారా నిద్రలేమితనం మరియు ఇతర సమస్యలు వస్తాయి.
నిద్ర రాకపోవడానికి ఇతర కారణాలు ఏమిటో ఎప్పుడు తెలుసుకుందాము
1. మూత్రం ఆపుకునే శక్తి తగ్గుతుంది, అందువలన మనం తరచూ బాత్రూం వెళ్లాల్సి రావడం కూడా ఒక కారణం.
2. వెన్ను నొప్పి
3. వాంతి వచ్చేలా ఉండటం, వికారంగా ఉండటం
4. మార్నింగ్ సిక్నెస్
ఇలాంటి అనేక కారణాల వలన కడుపుతో ఉన్నపుడు ప్రశాంతమైన మరియు సంపూర్ణమైన నిద్రపోదడం కష్టం అవుతుంది. కానీ, ఈ సమయంలో నిద్రపోవడం అత్యంత అవసరం. లేదంటే ఎన్నో దీర్ఘకాలిక మరియు తాత్కాలిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటంటే…
1. నెలల తక్కువ కాన్పు
2. పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం
3. డిప్రెషన్
4. కడుపులో బిడ్డ సరిగ్గా పెరగకపోవడం
కాబట్టి, ఎంత కష్టమైన రోజుకు తగినంత సమయం నిద్రపోవడం అత్యంత అవసరం. ఇప్పుడు ప్రశాంతమైన నిద్రరావడానికి ఈ చిట్కాలు పాటించండి.
వీలైనంత సేపు పక్కకు పడుకోండి
కాళ్ళ మధ్యలో దిండు పెట్టుకోవడం వలన శరీరానికి కొంత విశ్రాంతి లభించి నిద్ర సులువుగా వస్తుంది.
మీకు అవసరమైతే సరైన నిద్రకు అవసరమైన వస్తువులను కొన్నుకోండి.
వామిటింగ్ ఫీలింగ్, మార్నింగ్ సిక్నెస్ వంటి వాటికి డాక్టర్ సహాయం తీసుకుకోండి.
జాగ్రత్తగా ఉండండి. ప్రశాంతమైన నిద్రపోండి. మీరు మీ పిల్లలు ఆరోగ్యాంగా ఉండాలని మా కోరిక అందుకనే రాస్తున్నాము ఈ శీర్షిక.